Ghost: కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ఘోస్ట్. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ ఘోస్ట్ సినిమా తెలుగు తమిళం, కన్నడ,మలయాళ,హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. కాగా ఈ సినిమాకు శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాను సందేశ్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు.
ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్ట్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ఆ పోస్టర్ లో శివరాజ్ కుమార్ గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్నారు. అలాగే ఆ పోస్టర్ లో వెనక ఫైర్, స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్ లో పోస్టర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఘోస్ట్ సినిమా ప్రస్తుతం ఆరు కోట్ల వ్యయంతో వేసిన జైలు సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా ఆఫ్ జైల్ సెట్ లో 24 రోజులపాటు కొన్ని సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ నవంబర్ 10 కి పూర్తి కానుంది. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది.
ఈ ఘోస్ట్ సినిమాకు మంచి మంచి టెక్నిషియన్ లు పనిచేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. అలాగే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ఘోస్ట్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
క్యాస్ట్ : డాక్టర్ శివరాజ్ కుమార్
ప్రొడక్షన్ : సందేశ్ ప్రొడక్షన్స్ (29వ చిత్రం)
డైరెక్టర్ : శ్రీని (బీర్బల్)
కెమెరా మాన్ : మహేంద్ర సింహ
సంగీతం : అర్జున్ జన్య
ఆర్ట్ : శివ కుమార్ (కె జి ఎఫ్)
డైలాగ్స్: మస్తీ, ప్రసన్న వి ఎం
పబ్లిసిటీ, పి ఆర్ ఓ: బిఏ రాజు’స్ టీం