చందూ మొండేటి దర్శకత్వం నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా ఎప్పుడో ఐదేళ్ళ క్రితం వచ్చింది. ఇక దానికి సీక్వెల్ ని మళ్ళీ కార్తికేయ2గా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. మొదటి సినిమాకి మించి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. హిందీలో అయితే ఏకంగా 25 కోట్లకి పైగా కలెక్ట్ చేసి సంచలన హిట్ గా నిలబడింది. పెద్ద పెద్ద సినిమాలని సైతం తట్టుకొని కార్తికేయ 2 హిందీలో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఇప్పటికి కూడా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో నడుస్తుంది.
ఇక నిఖిల్ కెరియర్ లో వంద కోట్ల గ్రాస్ ని సాధించిన సినిమాగా కార్తికేయ2 నిలబడంతో అతని ఇమేజ్ ని కూడా అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చివర్లో దర్శకుడు చందూ మొండేటి క్లారిటీ ఇచ్చారు. ఇక ద్వారకా నగరం ఉనికిని ప్రపంచానికి పరిచయం చేయడమే కార్తికేయ నెక్స్ట్ గోల్ గా సీక్వెల్ స్టొరీకి లీడ్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో మూవీ సీక్వెల్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందనే విషయంపై చందూ మొండేటి క్లారిటీ ఇచ్చారు. కార్తికేయ 2 కోసం తీసుకున్నంత సమయం అయితే నెక్స్ట్ సీక్వెల్ కోసం తీసుకోనని చెప్పేసాడు.
అలాగే వీలైనంత త్వరలో ఈ సీక్వెల్ కి సంబందించిన ప్రకటన వస్తుందని కూడా చెప్పాడు. దీనిని బట్టి నిఖిల్ 18 పేజెస్ తర్వాత చేయబోయే సినిమా కార్తికేయ3 అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఇక చందూ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ అవకాశం ఇచ్చిన కూడా పుష్ప2 రిలీజ్ కావడానికి కనీసం ఏడాదికి పైగా పడుతుంది. అంత వరకు ఖాళీగా ఉండే కంటే కార్తికేయ3 మూవీని కంప్లీట్ చేయడం బెటర్ అని ఆలోచిస్తూ సీక్వెల్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.