నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ బజ్ నార్త్ లో రోజు రోజుకి పెరిగిపోతుంది. సినిమా ఏకంగా 2 వేలకి పైగా స్క్రీన్స్ లో ప్రస్తుతం ఆ మూవీ ప్రదర్శితం అవుతూ ఉండటమే సినిమా స్థాయి ఏ రేంజ్ కి పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. కేవలం 46 స్క్రీన్స్ తో స్టార్ట్ అయిన కార్తికేయ2 హిందీ వెర్షన్ రెండు వారాలు తిరిగేసరికి ఏకంగా హిందీ సినిమాలని బీట్ చేస్తూ 2 వేలకి పైగా స్క్రీన్స్ కి చేరుకోవడం అరుదైన రికార్డుగా చెప్పుకోవాలి. కొత్తదనం కోరుకునే బాలీవుడ్ ప్రేక్షకులకి మైథలాజికల్ ఎలిమెంట్ తో నార్త్ ఇండియాలోనే ద్వారకా బ్యాక్ డ్రాప్ లో సినిమా రావడంతో ఊహించని స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారు.
కేవలం మొదటి రోజు ఏడు లక్షల కలెక్షన్స్ తో స్టార్ట్ అయిన కార్తికేయ 2 మూవీ ప్రస్తానం 21వ తేదీ సండే రోజున 4 కోట్లకి పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక సోమవారం కూడా నాలుగు కోట్లకి పైగానే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. రెండ్లు వారాలలో హిందీలో కార్తికేయ2 కలెక్షన్స్ 22 కోట్ల మార్క్ ని బీట్ చేసింది. ఇలా చేయడం ద్వారా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ రికార్డుని ఈ సినిమా బ్రేక్ చేసినట్లు అయ్యింది. లాంగ్ రన్ లో రాధేశ్యామ్ ఫ్లాప్ టాక్ తో 22 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో రెండు వారాలలోనే 22 కోట్ల మార్క్ ని కార్తికేయ2 బీట్ చేసింది. ఇక ఇప్పటి వరకు అన్ని భాషలలోకి కలిపి 75 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా కలెక్ట్ చేసిందని సమాచారం.
లాంగ్ రన్ లో వంద కోట్ల మార్క్ ని కూడా దాటిపోయే అవకాశం కనిపిస్తుంది. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకి ఏకంగా 70 కోట్లకి పైగా లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉందని ట్రెండ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా హిట్ తో భవిష్యత్తులో కూడా కార్తికేయ ఫ్రాంచైజ్ లో మరిన్ని సినిమాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని హీరో నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇందులో హీరో పాత్ర బేస్ చేసుకొని ఇండియన్ హిస్టరీలోకి వెళ్లి కొత్తకథలు చెప్పే ప్రయత్నం చేస్తామని మీడియా ద్వారా స్పష్టం చేశారు.