Karthikeya 2 : యంగ్ హీరో నిఖిల్ సాలిడ్ కంటెంట్‌తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎక్కడా ఓవర్‌గా ప్రచారం లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు లేవు. షేక్ ఆడిస్తా వంటి ప్రగల్భాలూ లేవు. కానీ బిగ్ హిట్. బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమా వచ్చి పది రోజులవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఒకరకంగా చెప్పాలంటే థియేటర్లున్నాయన్న ఆలోచన మరిచిన ప్రేక్షకులను సైతం ఈ సినిమా థియేటర్ బాట పట్టిస్తోంది. కొద్ది రోజులవుతున్నా.. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన కార్తికేయ 2 ఇప్పటివరకూ 80 కోట్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. లైగర్ రిలీజ్‌తో నార్త్ అండ్ సౌత్‌లో కార్తికేయ 2 హవా తగ్గుతుందని అందరూ లెక్కలు వేశారు. కానీ సీన్ రివర్స్.
హవా తగ్గుతుందనుకుంటే మరింత పెరిగింది. లైగర్ సినిమా ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం, వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడంతో… లైగర్ కలెక్షన్స్ కి చాలా పెద్ద గండి పడింది. ఈ సినారియో కార్తికేయ 2కి కలిసొచ్చి నార్త్‌లో కార్తికేయ మూవీ తన డ్రీం రన్ కంటిన్యూ చేస్తోంది. మూడు వేలకి పైగా హిందీ స్క్రీన్స్‌ని హోల్డ్ చేస్తున్న కార్తికేయ 2 మూవీ, ఓవరాల్‌గా వంద కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే కార్తికేయ 2 మూవీ ప్రభాస్ సినిమా రికార్డులని బ్రేక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏ టైర్ 2 హీరో కలలో కూడా ఊహించని ఈ ఫీట్‌ని నిఖిల్ సొంతం చేసుకున్నాడు.
Karthikeya 2 : నిఖిల్ కెరియర్‌కి బిగ్గెస్ట్ హిట్
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రభాస్ సినిమా కలెక్షన్స్‌ను సైతం కార్తికేయ 2 బ్రేక్ చేసింది. ప్రభాస్ నటించిన రాదే శ్యాం సినిమా హిందీలో 20 కోట్ల వరకూ రాబట్టింది. నెగిటివ్ టాక్ కారణంగా రాదే శ్యాం, నార్త్ బెల్ట్‌లో అంతగా రాణించలేకపోయింది. ఈ మూవీ కలెక్షన్స్‌ని బ్రేక్ చేసి కార్తికేయ 2 నిఖిల్ కెరియర్‌కి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ విషయంపై ప్రభాస్ ఫాన్స్ మాత్రం చాలా పాజిటివ్ వేలో స్పందిస్తున్నారు. మా హీరో అట్టర్ ఫ్లాప్ సినిమా, ఒక హిట్ సినిమా కలెక్షన్స్ అంత ఉన్నాయి… అది మా రేంజ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ గొప్పలు చెప్పుకుంటున్నారు.