తెలుగు టెలివిజన్ స్క్రీన్ పై మోస్ట్ సక్సెస్ ఫుల్ సీరియల్ గా కార్తీకదీపం సీరియల్ నిలిచిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతూ వస్తుంది. సినిమాలు, రియాలిటీషోలతో సమానమైన రేటింగ్స్ ని కార్తీకదీపం సొంతం చేసుకునేది. ఇక టెలివిజన్ ప్రేక్షకులలో ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా ఈ సీరియల్ కి అడిక్ట్ అయినవారు ఉన్నారు. అంతలా జనాల్లోకి రీచ్ అయ్యింది. ఇక కొన్ని నెలల క్రితం ఈ కథలో జెనరేషన్ మార్చేసి కొత్త పాత్రలతో ఓ మూడు నెలల పాటు కార్తీకదీపం సీరియల్ నడిపించారు. దీంతో ఒక్కసారిగా కథ గాదితప్పినట్లు ఆడియన్స్ కి అనిపించడంతో సీరియల్ చూడటం మానేశారు.
దీంతో రేటింగ్ అమాంతం పడిపోయింది. దీంతో మరల ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళి పాత పాత్రలన్నింటిని తీసుకొచ్చి కథని నడుపుతున్నారు. గత రెండు వారల నుంచి కార్తీకదీపం పాత పాత్రలతోనే నడుస్తుంది. అయితే దీపకి గతం గుర్తుకొచ్చి కార్తిక్ ని వెతకడంతో కథని కొత్తగా చెప్పడం మొదలు పెట్టారు. ఇద్దరు బ్రతికే ఉన్నారు అని చూపించే ప్రయత్నం చేసారు. కొన్ని రోజులు రేటింగ్స్ భాగానే వచ్చాయి. అయితే పాత్రలని తీసుకొచ్చి పెట్టిన మునుపటి ఆసక్తి ప్రస్తుతం నడిపిస్తున్న కథలో లేకపోవడంతో ఆడియన్స్ ని విరక్తి కలిగింది.
ఈ నేపధ్యంలో మరల ఈ సీరియల్ రేటింగ్స్ తగ్గడం మొదలైంది. వీటి స్థానంలోకి గుప్పెడంత మనసు సీరియల్, జానకి కలగనలేదు వంటివి ముందు వరుసలోకి వచ్చేశాయి. వీటిలో ఎంటర్టైన్మెంట్ ఉండటంతో పాటు లవ్ స్టొరీ కూడా టీవీ ప్రేక్షకులకి నచ్చడంతో కార్తిక దీపం సీరియల్ ని దాటుకొని రేటింగ్స్ ని ఇవి సొంతం చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో రేటింగ్ తగ్గడంపై కార్తీకదీపం టీం పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది.