గత కొన్నిరోజులుగా కార్తీకదీపంలో ఫ్లాష్ బ్యాక్ నడుస్తోంది. దీప, సౌర్య ఒకే బస్సులో ప్రయాణం చేస్తారు. జర్నీ మధ్యలో బస్సు ఓ డాబా దగ్గర ఆగుతుంది. అప్పుడు వాటర్ కోసం వెళ్లిన చంద్రమ్మ చిల్లర లేక ఇబ్బంది పడుతుంది. దాంతో అప్పుడే అక్కడి వచ్చిన దీప సౌర్య కోసం అని తెలియకుండానే వాటర్ బాటిల్ కొనిచ్చి అమ్మ ఇచ్చిందని చెప్పమంటుంది. అది తెలిసి సౌర్య ఆమెకు థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటుంది. కానీ బస్సు ఎక్కగానే నిద్రపోవడంతో.. హైదరాబాద్ రాగానే దిగి వెళ్లిపోతుంది దీప. ఆ తర్వాత ఆగస్టు 20 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘నాకు వెళ్లడం ఇష్టం లేదంటుంటే.. ఇల్లు ఇల్లు అని చిరాకు పెడుతున్నారు. నేను మీతో ఉండడం ఇష్టంలేకపోతే నన్ను వదిలేయొచ్చు కదా. ఆ ఇంటికి పంపడం ఎందుకు అని అంటుంది. హిమ ఉందనే అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. అలాంటిది మళ్లీ తిరిగి వెళ్లాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది’ అని అంటుంది. ‘అదేంటి ఇటింటికీ దగ్గర వచ్చిన తర్వాత ఇలా అంటావు. ఇప్పుడు మీ ఇంటికి వెళదాం. నీకు అక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మాతో తీసుకెళ్లిపోతాం’ అని అంటారు చంద్రమ్మ, గండ.
ఇకవైపు దీప సైతం మరో ఆటో ఎక్కి సౌందర్య, ఆనందరావు దగ్గరకి వెళుతుంటుంది. వెళుతూనే.. ‘అత్తయ్య, మావయ్య, పిల్లలు నన్ను చూసి చాలా సంతోషిస్తారు. డాక్టర్ బాబు బతికే ఉన్నారని తెలిస్తే ఆనందంతో గంతులేస్తారు. అత్తయ్య మావయ్యలతో చాలా కబుర్లు చెప్పాలి.. ఈ రోజు ఏంటీ బస్టాండ్‌కి ఇల్లు ఇంతదూరం ఉందనిపిస్తుంది. నా ఆత్రం వల్లనా లేక ఆటోవాడే స్లోగా వెళ్తున్నాడా’ అని మనసులో అనుకుంటూ ఆటోవాన్ని త్వరగా తీసుకెళ్లమంటుంది.
సౌర్య వచ్చిన ఆటో వాళ్ల ఇంటి ముందు ఆగుతుంది. సౌర్యని అక్కడే ఉండమని.. సౌందర్య, ఆనందరావు గురించి ఆరా తీయడానికి వెళతారు చంద్రమ్మ, గండ. అప్పుడు.. సెక్యూరిటీ ఆపగా.. ఇది సౌర్య ఇళ్లని.. ఆమె నాన్నమ్మ, తాతయ్య ఇక్కడే ఉంటారని చెబుతారు. అది విని వాళ్లు ఈ ఇల్లు అమ్మేసి వెళ్లిపోయారని చెబుతాడు. అది విని సౌందర్య ఇంతకుముందు మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్ అవుతుంది సౌర్య. దాంతో.. సౌర్య రానంటున్న వీళ్లు ఇలా వదిలేసి వెళ్లిపోయాం కదయ్యా అంటూ బాధపడిపోతుంది చంద్రమ్మ. తర్వాత సౌర్యని తీసుకుని వాళ్ల ఊరికి బయలుదేరతారు.
మరోవైపు దీపని కాపాడిన డాక్టర్, అతడి తల్లి కలిసి కూర్చుని.. దీప గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ‘పాపం దీప ఇంటికి చేరుకుందా అని పెద్దావిడ అడగగా.. వెళ్లే ఉంటుందమ్మా ఈ పాటికి.. వాళ్లని కలిసిన ఆనందంలో ఉంటుంది కదా.. అందుకే కాల్ చెయ్యలేదు.. కుదుట పడ్డాక తనే చేస్తుందిలే అంటాడు డాక్టర్. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి.. ‘సార్ మీరు చెప్పినట్లే ఎంక్వైరీ చేశాను.. పక్క ఊరి ఆసుపత్రిలో ఓ వ్యక్తిని జాయిన్ చేశారట.. అతడు కార్ యాక్సిడెంట్ జరిగిన తర్వాతే జాయిన్ అయ్యాడట’ అని చెప్పి వెళ్తాడు. దాంతో ఆ పెద్దావిడ.. ‘అతడు ఆ అమ్మాయి భర్త అయ్యే అవకాశాలే ఎక్కువ. వెంటనే ఈ విషయం తనకి చెప్పు.. చాలా సంతోషిస్తుంది’ అంటుంది కొడుకుతో. సరే అంటాడు డాక్టర్. అనంతరం ఎంతో ఎగ్జాయిటింగ్‌గా పరుగెత్తుకుంటూ వెళ్లగా.. అక్కడ కొత్త సెక్యూరిటీ గార్డుని చూసి షాక్ అవుతుంది. అతని విషయం అడగగా.. వారు అమెరికా వెళ్లిపోయినట్లు తెలియడంతో షాక్ అవుతుంది. దీప ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండగా.. ఆమెని కాపాడిన డాక్టర్ కాల్ చేస్తాడు. కార్తీక్ దొరికినట్లేనని చెబుతాడు. దాంతో సంతోషంగా తిరిగి అక్కడికి బయలుదేరుతుంది.
చిక్ మంగుళూరు వెళ్లిన దీప మరుసటి రోజు ఉదయం గుడికి వెళుతుంది. అక్కడ దేవుడికి దండం పెట్టుకుని.. ‘పక్క ఊర్లో ఉన్నది నా డాక్టర్ బాబే కావాలి. ఆయన కూడా వస్తే ఇద్దరం కలిసి అమెరికా వెళ్లి మా పిల్లలని తిరిగి తెచ్చుకుంటాం’ అని వేడుకుంటుంది. పిల్లలు, భర్త గురించి తలచుకుంటూ బోట్టు పెట్టుకుంటూ ఉండగా.. ‘దీపా’ అని కార్తీక్ పిలవడం వినిపిస్తుంది. వెనుదిరిగి చూడగా.. అక్కడ గడ్డంతో కార్తీక్ నిలబడి ఉండడం చూసి పరుగెత్తుకూ వెళ్లి గట్టిగా కౌగిలించుకుంటుంది. చాలా సంతోషంగా ఉందండి. మిమ్మల్ని విడిచి ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను అని ఎమోషనల్ అవుతుంది. తర్వాత కార్తీక్ చేతులకి అనిచి కళ్లు మూసుకుంటుంది. అనంతరం కళ్లు తెరచి చూడగా అక్కడ కార్తీక్ ఉండడు. దాంతో ఇది కల మాత్రమేనా అని కన్నీటి పర్యంతం అవుతుంది. వెంటనే వెళ్లి ఆయన్ని చూడాలని అనకుంటుంది. తరువాయి భాగం అంటూ.. పక్కా ఊరి హాస్పిటల్‌కి వెళ్లి కార్తీక్ గురించి ఆరా తీస్తుంది దీప. అప్పుడు ఆయన భార్య వచ్చి తీసుకెళ్లిందని బాంబు పేల్చుతుంది నర్సు. దాంతో షాక్‌కి గురై నిల్చున్నా దీపకి కార్తీక్ పర్సుని తీసుకొచ్చి ఇస్తుంది మరో నర్సు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.