మీరు నా గురించి ఎందుకు వెతకలేదని సౌందర్యని నిలదీస్తుంది సౌర్య. చిన్నప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేసి తాము వెతికిన తనే రాలేదని చెబుతుంది సౌందర్య. అనంతరం కొన్ని రోజులుగా ప్రేమ్ డల్‌గా ఉంటున్న విషయాన్ని గుర్తిస్తాడు నిరుపమ్. పెళ్లి తర్వాత ఆ సంగతేందో చూడాలి అనుకుంటాడు. హిమ సైతం సౌర్యకి నిరుపమ్‌తో ఎలా పెళ్లి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు 13న ఏం జరిగిందో చూద్దాం..
సౌందర్య వచ్చి చీర కట్టుకో పూజ కోసం గుడికి వెళ్దాం అంటుంది హిమతో. ఏం చేయాలో తెలియని హిమ నాన్నమ్మ చెప్పినట్లే చేయడానికి వెళ్లబోతుంది. అప్పుడే సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు ప్రేమ్. దాంతో.. ‘పెళ్లికి చాలా రోజులు ఉన్నాయి కదా అని ప్రశాంతంగా ఉన్నా. కానీ వారాలు రోజుల్లోకి.. రోజులు గంటల్లోకి మారిపోయాయి. నువ్వు పెళ్లి ఎలా ఆపుతావోనని టెన్షన్ పెరిగిపోతోంది బావా. నీ దగ్గర ఉన్న ఐడియా ఏంటో చెప్పు’ ఆందోళనగా అంటుంది హిమ. అయితే ప్రేమ్ మాత్రం.. ‘హిమని తీసుకుని పెళ్లి చేసుకుంటే ఈ పెళ్లి కచ్చితంగా ఆగుతుంది కదా? కానీ నా ప్రమేయం ఉందని తెలిస్తే అందరి ముందు నేను చెడ్డవాడ్ని అవుతాను.. అలా వద్దులే.. ఏదొకటి చెయ్యాలి’ అంటూ మనసులోనే ఏవేవో ఉపాయాలు వేస్తుంటాడు. ఇంతలో హిమ.. ‘ఏం మాట్లాడవేంటి బావా? నువ్వు ఏం చేయబోతున్నావో చెబితే నాకు కాస్త టెన్షన్ తగ్గుతుంది కదా?’ అంటుంది హిమ. దాంతో.. ‘నువ్వేం భయపడకు హిమా.. బ్రహ్మాండమైన ఐడియా ఉంది. నేను చూసుకుంటాను’ అని ప్రేమ్ ధీమాగా అంటాడు. ‘అది ఫెయిల్ అయితే?’ అని భయంగా అడుగుతుంది హిమ. ‘అప్పుడు బ్రహ్మస్త్రం లాంటి మరో ఐడియా ఉందిలే’ అంటాడు ప్రేమ్ ఇంకా కాన్ఫిడెంట్‌గా. ఇంతలో సౌందర్య వచ్చి.. ‘హేయ్ హిమా.. ఇంకా రెడీ కాలేదా? గుడికి వెళ్లాలి’ అని కంగారుపెట్టడంతో రెడీ అవ్వడానికి వెళ్లిపోతుంది హిమ.
మరోవైపు సౌర్య చీర కట్టుకుని కుందనపు బొమ్మలా రెడీ అవుతుంది. ‘అరే ఈ చీరలో కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా. పదహారణాల తెలుగింటి అమ్మాయిలా ఉన్నావమ్మా. ఇవన్నీ మానేసి.. ఆ డ్రెస్‌లేంటీ.. చేతికి రుమాళ్లు చుట్టుకోవడం.. చూస్తే కోడతాను అనేలా ఉండడం ఏంటీ తల్లీ. నాకు అర్థమే కాదు’ అంటాడు ఆనందరావు నవ్వుతూ. ‘తాతయ్యా నీకేం పనిలేదా? అందుకే నన్ను పొగడటం.. రాయబారాలు చేస్తుంటావు? ఏంటి తాతయ్యా నువ్వు?. చీర కట్టుకోమన్నారు కట్టుకున్నా. బావుంది అంటే సరిపోతుంది కదా. తెలుగుదనానకి ప్రతిరూపంలా ఉన్నావు. చీరకే అందం వచ్చింది. ఏంటి ఇది’ అంటుంది సౌర్య విసుగ్గా. పొగడ్తలు నచ్చని దానివి నువ్వే. మనం ఒక సెల్ఫీ తీసుకుందాం రా అంటూ ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంటారు. ఆ తర్వాత ‘అవును నీ జీవితంలోకి ఆటో ఎలా వచ్చింది. ఆటోబయోగ్రఫీ చెప్పు సౌర్యా’ అంటాడు ఆనందరావు కుతుహలంగా.
గతంలోకి వెళ్లగా.. సౌర్య చిన్నప్పుడు తల్లిదండ్రుల గురించి నడుస్తూ ఉంటుంది. అప్పుడే వారణాసి ఆమె దగ్గరకి వస్తాడు. వెంటనే సౌర్య ఏడుస్తూ.. వారణాసిని హత్తుకొని ఏడుస్తుంది. సౌందర్య గుర్తొచ్చి.. ఆవేశంగా వారణాసిని వదిలేసి.. కోపంగా.. ‘వారణాసి నిన్ను ఎవరు పంపించారు. నన్ను వెతుక్కుంటూ వెళ్లమని మా నాన్నమ్మ, తాతయ్య పంపిచారు కదా’ అంటుంది సౌర్య కోపంగా. దాంతో వారణాసి మనసులో.. ‘అమ్మో ఇప్పుడు ఆనందరావు సార్ పంపించారని నిజం చెబితే మళ్లీ పారిపోతుందేమో.. నాతో ఈ రెండు మాటలు కూడా మాట్లాడదేమో..’ అనుకుంటూ.. ‘నన్ను ఎవ్వరూ పంపించలేదమ్మా. అమ్మనాన్న యాక్సిడెంట్ జరిగిన తర్వాత వారి శవాల కోసం రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా’ అంటాడు వారణాసి. అనంతరం నేను నీతో ఆసుపత్రికి వస్తాను. అలాగే నాకు ఆటో నేర్పు.. నేను తర్వాత ఆటో నడుపుతా అంటుంది. వారణాసి వద్దంటున్న వినకుండా కచ్చితంగా ఆటో నేర్పించమని అడుగుతుంది సౌర్య. అనంతరం ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళతారు.
ఇక వారణాసి, సౌర్య ఆసుపత్రికి వెళ్తారు. లోపలకి నడిచిన వెళ్తుండగా ఓ గదిలోనే ఐసీయూలో ఎవరో ఒక మనిషి బెడ్ మీద పడుకున్నట్లు చూపిస్తారు. అది ఎవరో కాదు మన వంటలక్క దీపే. ఆ గది పక్క నుంచే వారణాసి, సౌర్య మార్చురీ రూమ్‌కి వెళ్తారు. మార్చురీలో శవాల్లో
దీప, కార్తీక్ లేకపోవడంతో సౌర్య ఏడుస్తూ… ‘వారణాసీ.. వీళ్లల్లో ఎవరు మా అమ్మా నాన్న కాదు అంటే.. వాళ్లు ఎక్కడో బతికే ఉంటారు కదా.. ఎప్పుడు వస్తారు వారణాసీ..’ అంటుంది. అప్పుడు వారణాసీ.. ‘అక్కా బావ ఎక్కడున్నారో ఆ దేవుడికే తెలియాలి’ అని మనసులో అనుకుంటాడు. గతం నుంచి బయటికి వచ్చిన సౌర్యా.. ‘ఇది తాతయ్య జరిగింది. నాకు ఆటో అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? అమ్మ వారణాసి ఆటోలో వెనుకే కూర్చునేది కదా.. అమ్మా త్వరగా అని స్టిక్కర్ కూడా అంటించానని తెలుసుకదా? నేను ఆటో నడుపుతుంటే.. వెనకాల మా అమ్మ కూర్చున్నట్లే ఉంటుంది తాతయ్యా.. అందుకే ఇష్టం. మీ అందరికీ ఆటో తక్కువగా కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం చాలా గొప్ప’ అని ఎమోషనల్ అవుతుంది సౌర్య.
అది విని ఆనందరావు కొంచెం దూరంగా జరుగుతుంటాడు. అది చూసి.. ‘ఏంటి తాతయ్యా.. అంతా విన్నాక దూరం జరగుతున్నారు?’ అంటుంది సౌర్య అనుమానంగా. ‘అంటే నువ్వు రౌడీవి కదా? మళ్లీ తిట్టడమో కొట్టడమో చేస్తావని దూరంగా జరుగుతున్నా.. నువ్వు తిట్టను కొట్టను అంటే ఓ నిజం చెబుతాను..’ అని భయంగా అంటాడు ఆనందరావు. ‘ఏంటి తాతయ్యా అది’ అంటుంది సౌర్య. ‘వారణాసిని నీ దగ్గరకు పంపించింది మేమేనమ్మా’ అంటాడు ఆనందరావు. దాంతో సౌర్యకు కోపం వస్తుంది. ‘తాతయ్యా నిజమా. అంటే అప్పటి నుంచే నన్ను మోసం చేయడం మొదలుపెట్టారా మీరు’ అంటుంది ఆవేశంగా. అక్కడికి వచ్చిన సౌందర్య సౌర్య చెంప చెల్లుమనిపిస్తుంది. ‘ఏంటే మేము నిన్ను మోసం చేశామా? అసలు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. చిన్న పిల్లగా ఉన్నప్పుడే నేను వచ్చి రమ్మని ఎంత బ్రతిమిలాడాను.. అయినా నువ్వు రాలేదు’ అంటుంది సౌందర్య కోపంగా. ‘చిన్నపిల్లలం అని నువ్వే అంటున్నావ్ కదా నాన్నమ్మ.. అప్పుడే ఇలా ఓ దెబ్బ కొట్టి.. తీసుకొచ్చి ఉంటే.. మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను కలెక్టర్‌ని అయ్యోదాన్నికదా’ అంటుంది సౌర్య. ‘సౌర్యా అమ్మకి ఇచ్చిన మాట నెరవేర్చలేదని నీకు ఎంత బాధ ఉందో.. నేను కూడా అంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నాను’ అంటుంది హిమ. దాంతో సౌర్యకి కోపం వచ్చి హిమని తిడుతుంది. అది విని సౌందర్య మీ గొడవలు ఆపి వెళ్దాం పదా. దాంతో సౌర్య, హిమ వచ్చి దీప, కార్తీక్ ఫొటోలకు దడం పెట్టుకుంటారు. దీప, కార్తీక్ ఫొటోలకు దండలు ఉండవు. దాన్ని బట్టి వారిద్దరూ మళ్లీ తిరిగి వస్తారని హింట్ ఇచ్చినట్లైంది. అది గమనించిన సౌందర్య.. ‘ఈ ఫొటోలకు దండలు ఉండాలి కదా ఎవరు తీసేశారు’ అంటుంది. ‘అవును నేను గమనించలేదు.. ఎవరు తీసేశారో మరి..’ అంటాడు ఆనందరావు. ఇంతలో సౌందర్యకు స్వప్న కాల్ చేయడంతో అందరూ కలిసి గుడికి బయలుదేరతారు.
మరోవైపు.. హిమ గురించి నిరుపమ్ ఆలోచిస్తుంటాడు. హిమ ఏం చేస్తుందోనని భయపడుతుంటాడు. అప్పుడే ప్రేమ్ అక్కడికి వస్తాడు. ‘అమ్మో వీడికి కనిపిస్తే మళ్లీ నీ ప్రాబ్లమ్ ఏంటని వెంట పడతాడు. అసలు నీ పెళ్లే నా ప్రాబ్లమ్ అని వాడికి చెప్పలేను’ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లబోతాడు ప్రేమ్. ఇంతలో ప్రేమ్‌ని నిరుపమ్ చూసేస్తాడు. రేయ్ ఆగరా.. ఏం అయ్యింది? వెళ్లిపోతున్నావ్ ఏంటని అడుగుతాడు. ‘మూడ్ బాలేదు’ అంటాడు ప్రేమ్. నా పెళ్లి కాగానే మనందరం కూర్చుని నీ ప్రాబ్లెమ్ సాల్వ్ చేద్దామంటాడు నిరుపమ్. అంతలో హిమ కాలు చేయడంతో నిరుపమ్‌కి హిమ కాల్ చేస్తుంది. ప్రేమ్‌ని ఉండమంటూ హిమాతో ఫోన్‌లో ‘హిమా నువ్వు చెప్పు’ అంటాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది. తరువాయి భాగం అంటూ.. చిన్నప్పుడు సౌర్య వెళ్లిన ఆసుపత్రిని చూపిస్తారు. అక్కడ వంటలక్క యాక్సిడెంట్ కలలోకి రావడంతో కోమాలోంచి బయటికి వస్తూ.. ‘డాక్టర్ బాబు’ అని అరుస్తుంది. వంటలక్క మళ్లీ తిరిగి రావడంతో కథ మంచి రసవత్తరంగా మారింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.