గత ఎపిసోడ్‌లో.. తన కథనే కార్తీకదీపం నాటకంగా వేస్తుంటుంది. అది చూసిన కార్తీక్‌కి గతం లీలాగా గుర్తొస్తూ ఉంటుంది. ఇంకోవైపు మోనిత అబద్దాలతో నమ్మించి సౌర్యని పంపించి వేస్తుంది. మరోవైపు.. హిమని తనతోపాటు ఇంటికి తీసుకెళుతుంది సౌందర్య. ఆ తర్వాత సెప్టెంబర్ 28న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కార్తీకదీపం నాటకంలోని సన్నివేశాలు కార్తీక్‌కి పిల్లల పుట్టే అవకాశం లేదని, దీప కడుపులో పెరిగే బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని నానా మాటలు అనడం, బదులుగా దీప తన నిప్పు అని భార్యని అనుమానించే ఇలాంటి వాడు దేశోద్ధారకుడు అయితే ఏంటి, దేవుడు అయితే ఏంటి ఐ డోంట్ కేర్ అంటూ దీప ఇంటి నుంచి బయటకు వెళ్లడం. తర్వాత సౌర్య డాక్టర్ బాబు పరిచయం, హిమా వంటలక్క పరిచయం, దీపకు తమకు కవలలు పుట్టారని తెలిసి ఇంకో పాపని వెతకమని కార్తీక్ ని ప్రాధేయపడడం, తనమీద పంతంతో నీ ఇంకో బిడ్డను తన దగ్గర పెరిగేలా చేశావని వంటలక్కను తిట్టడం, సౌర్యని కార్తీక్ చదివించడం ఇలా నాటకం సాగుతుంటుంది. ‘ఆ సన్నివేశాలను చూసి తనను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. సౌర్య, హిమ, దీప, సౌందర్య , ఆనందరావు, మోనిత పేర్లు కూడా చాలా కంగారు పెడుతున్నాయి’ అని డాక్టర్‌తో అంటాడు కార్తీక్. ఏమీ కాదు నాటకం పై మాత్రమే దృష్టి పెట్టమని చెప్తాడు డాక్టర్.
అనంతరం నాటకంలో కార్తీక్ నిజం తెలుసుకొని పూజ జరుగుతున్న సమయంలో దీప కాళ్ల మీద పడి క్షమాపణ అడగడం. అదే సమయానికి మోనిత వచ్చి తను కడుపుతో ఉన్నానని, దానికి కారణం కార్తీక్ అని చెప్పడం. కార్తీక్ కాదు అనడం. మోనిత కార్తీక్ బాబుకు శాంతి పూజ జరిపించడం. అన్ని మర్చిపోయి దీప, కార్తీక్. పిల్లలతో కలిసి వాళ్లు హనీమూన్ వెళ్లిన ప్రదేశానికి వెళ్లడం. అక్కడ అందరూ సరదాగా ఉండడం. దీప మందు తాగి డాన్స్ చేయడం లాంటి సన్నివేశాలు. హిమా తనకు డ్రైవింగ్ అంటే ఇష్టమని దీపని తీసుకెళ్లడం. ఇలాంటి వాటిని నాటకంగా చూసిన కార్తీక్ ఏదో గుర్తొచ్చినట్లుగా దీప అంటూ పరుగెత్తి స్పృహ కోల్పోతాడు.
మరోవైపు ఇంటికి వచ్చిన మోనిత సౌందర్య, ఆనందరావు, సౌర్య పీడ విరగడయ్యిందని, ఎలాగైనా కార్తీక్‌ని ఎలాంటి అనుమానం రాకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని అనుకుంటుంది. కార్తీక్‌ని పిలుస్తూ ఇళ్లంతా వెతుకుతూ ఉంటుంది. శివ వచ్చి కార్తిక్ లేడని కాలనీ వజ్రోత్సవాలలో నాటకం వేస్తున్న అని చెప్పి కార్తీక్ ని వంటలక్క తీసుకెళ్లిందని చెప్తాడు. శివ చెంప చెళ్లుమనిపించి.. నువ్వు వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని, వేలకు వేలు జీతాలు ఇస్తుంటే కార్తీక్‌ని ఒంటరిగా బయటికి పంపిస్తావా అని తిట్టి కమ్యూనిటీ హాల్‌కి వెళుతుంది మోనిత.
గతం కొద్దిగా లీలాగా గుర్తొచ్చిన కార్తీక్ దీప అని పిలుస్తూ స్పృహతప్పి పడిపోగా.. డాక్టర్ గారు ఆసుపత్రిలో చేరుస్తారు. అక్కడకు మోనిత కూడా వస్తుంది. అక్కడ దీపని చూసి అరుస్తున్న మోనితని వద్దని వారిస్తుంది దీప. డాక్టర్ బాబుకి తను గుర్తొచ్చానా అని డాక్టర్ అన్నయ్యని అడుగుతుంది. కార్తీక్ కళ్లు తెరిచి దీప అని పిలిచి ఆగిపోతాడు. ఇంతకీ కార్తీక్ కి నిజంగా గతం గుర్తొచ్చిందో లేదో తెలియాలి అంటే తర్వాతి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.