గత ఎపిసోడ్‌లో.. కార్తీక్ ఇంట్లోనే ఉన్నప్పటికి తన దగ్గర లేనట్లు సౌందర్య, ఆనందరావు దగ్గర నాటకం ఆడుతుంది మోనిత. ఇంకోవైపు.. కార్తీక్‌కి గతం గుర్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది దీప. మోనిత మాత్రం ఆ ప్రయత్నాలు అన్నింటిని తిప్పి కొడుతూ ఉంటుంది. ఈ తరుణంలో కాలనీ అసోసియేషన్ వజ్రోత్సవాల సందర్భంగా వంటలు చేయమని దీపని అడుగుతారు. ఆ తర్వాత సెప్టెంబర్ 26 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కాలనీ అసోసియేషన్ వజ్రోత్సవాల సందర్భంగా నాటకం వేయాలని అనుకుంటూ ఉంటారు కాలనీవాసులు. వంట చేయడం కోసం అక్కడికి వచ్చిన దీప తను ఒక కథ చెప్తానని దాన్ని నాటకంగా వేయాలని కోరుతుంది. కథ విన్న తర్వాత చాలా బాగుంది అని దానిలోని ముఖ్య పాత్రను దీపనే వేయాలని అంటారు కాలనీవాసులు. దీప దానికి ఒప్పుకుంటుంది. అనంతరం మోనిత స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లి కార్తీక్ పరిస్థితి చెప్పి ఎవరైనా ప్రయత్నిస్తే గతం గుర్తొచ్చే అవకాశాలు ఉన్నాయా అని అడుగుతుంది. కొన్ని సందర్భాల్లో అలా గుర్తొచ్చే అవకాశం ఉందని చెప్తాడు డాక్టర్.
హిమ, సౌర్య కోసం సౌందర్య వెతుకుతూ ఉంటుంది. దగ్గర్లోనే ఉన్న హిమ, సౌర్యని ఇంటికి రమ్మని బ్రతిమలాడుతూ ఉంటుంది. ‘నానమ్మ రమ్మంటేనే రాలేదు. నువ్వు రమ్మంటే వస్తానా ‘అని కసురుకుంటుంది సౌర్య. ఇంతలో మనవరాళ్లని వెతుకుతూ అక్కడికి వచ్చిన సౌందర్యని చూసిన సౌర్య.. టాయిలెట్‌కి అని చెప్పి అక్కడి నుండి తప్పించుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సౌందర్య ‘ఇక్కడ ఏం చేస్తున్నావు సౌర్య ఏది’ అని హిమని అడుగుతుంది. సౌర్యని ఇంటికి రమ్మని ఎంత బ్రతిమలాడినా రావడం లేదని, ఇప్పుడే వాష్ రూమ్ కి వెళ్లిందని ఏడుస్తూ చెప్తుంది హిమ. ఎంతసేపు ఎదురు చూసినా సౌర్య రాకపోవడంతో తను అక్కడికి రావడం చూసే అక్కడి నుండి వెళ్లి ఉంటుందనీ సౌందర్య హిమతో చెప్పి హిమని తనతో తీసుకొని వెళుతుంది.
నాటకం చూడడం కోసం కార్తీక్ తీసుకువెళ్లడానికి మోనిత ఇంటికి వెళుతుంది దీప. ఆమెని చూసిన కార్తీక్ మళ్లీ ఎందుకు వచ్చావు అంటూ దీపని కోప్పడతాడు. కాలనీలో నాటకం వేస్తున్నాను అని మీరు వచ్చి చూడాలని అడుగుతుంది. నీ భర్త ఎవరో ఎందుకు వదిలి వెళ్లాడో చెప్పమని అడుగుతాడు కార్తీక్. దాంతో నాటకం చూస్తే అంతా వివరంగా తెలుస్తుందని, తన భర్త ఎవరో కూడా తెలుస్తుందని రమ్మని కోరుతుంది దీప. ఇక్కడే ఉన్న శివతో మీ మేడంకి ఏమి చెప్పొద్దని కమ్యూనిటీలో నాటకం చూడటానికి వెళ్లానని మాత్రమే చెప్పమని చెప్తాడు కార్తీక్.
ఇంకోవైపు.. సౌందర్యని చూసి పారిపోయిన సౌర్య తెలియక మోనిత కారు డిక్కీలో కూర్చొని ‘నానమ్మ తన కోసం ఏడుస్తూ ఉంటుంది’ అని అనుకుంటూ ఉంటుంది. డాక్టర్ దగ్గర నుంచి బయటికి వచ్చిన మోనిత అదే కారులో వెళ్తూ కార్తీక్ ని ఎలాగైనా దీపకి దూరంగా ఉంచాలని, తన జ్ఞాపకాలు గుర్తు రాకుండా చూడాలని, అవసరమైతే అమెరికా అయినా తీసుకువెళ్లాలని అనుకుంటుంది.
నాటకం దగ్గరికి వచ్చిన కార్తీక్‌ని ముందు వరసలో కూర్చోబెడుతుంది దీప. అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చి దీపని అతను ఎవరని అడుగుతుంది. దాంతో డాక్టర్ బాబు అని పరిచయం చేస్తుంది దీప. నాటకం త్వరగా ప్రదర్శించమని లేదా తను వెళ్లిపోతానని తొందరపడుతూ ఉంటాడు కార్తీక్. దీప డాక్టర్ అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అతను అక్కడికి వస్తాడు. దాంతో కార్తీక్ ‘దీపకి అన్నయ్య అయ్యి ఉండి.. తన భర్తను ఎందుకు వెతకడం లేదు. మీకు అవసరం ఉంది కదా. ఎందుకు వెతకడం లేదు. మీకు తన భర్త ఎవరో తెలియదా’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు డాక్టర్ తెలుసు అని చెప్తాడు. అయితే.. ‘మీకు చేతకాకపోతే నాకు చెప్పండి. నేను వెతికి పెడతాను’ అంటాడు కార్తీక్. అందుకు అతను నాటకం చూడండి అన్ని మీకే అర్థమవుతాయి అని కూర్చోబెడతాడు. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగంలో.. నాటకంలో కార్తీక్‌కి పిల్లలు పుట్టే అవకాశం లేదని, దీపని అనుమానించి ఇంటి నుంచి పంపే సంఘటనను వేస్తూ ఉండగా.. కార్తీక్‌కి గతం తాలూకు జ్ఞాపకాలు వచ్చి దీప వెళ్లొద్దు అంటూ స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.