హిమ ఇంటి నుంచి సౌర్య దగ్గరకి వెళ్లడంతో.. వారి కోసం ఆ ఊరికి వస్తారు సౌందర్య, ఆనందరావు. అనంతరం మోనితకి ఫోన్ చేస్తుంది సౌందర్య. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మోనిత కార్తీక్ జాగ్రత్త అంటుంది. అది విన్న సౌందర్య కార్తిక్ అంటున్నావేమిటి అని ఆరా తీస్తుంది. దాంతో వెంటనే ఫోన్ కట్ చేస్తుంది మోనిత. దాంతో ఆమె దగ్గరకి బయలుదేరతారు సౌందర్య, ఆనందరావు. ఆ తర్వాత సెప్టెంబర్ 23న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘కార్తీక్ తనను గుర్తుపట్టకుండా నిజాలను అబద్ధాలుగా చేసి చూపిస్తుంది’ అని డాక్టర్ అన్నయ్యకి ఏడుస్తూ చెబుతుంది దీప. దాంతో ఆమెకి ధైర్యం చెప్పి కార్తీక్‌ని ఎలాగైనా ఆస్పత్రికి తీసుకురావాలని పంపిస్తాడు. ఇంతలో.. సౌందర్య ఆనందరావు కారులో మోనిత దగ్గరకి వస్తారు. వాళ్లని చూసి మోనిత షాక్ అవుతుంది. వెంటనే శివని పిలిచి కార్తీక్ ని వెనక్కి తీసుకెళ్లమని చెబుతుంది. శివ అలాగే చేస్తాడు. అనంతరం సౌందర్యని చూసి ఎలా ఉన్నారు ఆంటీ అని అడుగుతుంది మోనిత. అది పట్టించుకోకుండా పరిసరాలను గమనిస్తున్న సౌందర్యని చూసి బట్టలు చూస్తున్నారా అని అడుగుతుంది మోనిత. దాంతో.. డాక్టర్ చదువు చదివి బోటిక్ నడపడం ఏంటో నాకు అర్థం కావట్లేదని అంటుంది సౌందర్య. కార్తీక్‌తో కలిసి చదువుకున్న చదువు కదా ఆంటీ అందుకే దానిని వదిలేశాను. నా కార్తీక్ పీల్చిన ఆఖరి గాలి అందుకే ఇక్కడే ఉంటున్నానని అంటుంది మోనిత. అప్పుడే అటుగా వచ్చిన దీపకు మోనిత మాత్రమే కనపడుతుంది. ఆమె ఎవరో కస్టమర్స్ తో మాట్లాడుతుంది అనుకుని కార్తీక్ కోసం వెళుతుంది.
ఇంతలో ఫోన్ కోసం కార్తీక్ హాల్లోకి వస్తాడు. దీంతో అక్కడే ఉన్న సౌందర్య ఆనందరావుని చూస్తాడు. గతం తాలూకు జ్ఞాపకాలు లీలగా గుర్తుకు వస్తాయి. వాళ్లని ఎక్కడో చూసినట్లు ఉందని అనుకుంటాడు. మోనిత సైగ చేయడంతో కార్తీక్‌ని శివ మళ్లీ బ్యాక్ యార్డ్‌కి తీసుకెళ్తాడు. సౌందర్య ఆనందరావుతో మోనిత.. నేను ఫోన్లో కార్తీక్ అని అన్నాననే కదా మీరు వెతుకుతున్నారు. తన కొడుకు ఆనంద్‌నే కార్తీక్ అని పిలుస్తున్నాను’ అని చెబుతుంది. ఇంతలో.. ఆనందరావుకి అటుగా వెళుతున్న దీప కనిపిస్తుంది. అదే సౌందర్యకి చెబుతూ అటుగా వెళ్లబోతాడు ఆనందరావు. వెంటనే మోనిత అతన్ని ఆపి నాకు కార్తీక్ కూడా ఇలాగే కనిపిస్తూ ఉంటాడు అంకుల్ అని వాళ్లని వెళ్లకుండా చేస్తుంది. అలాగే కార్తీక్, దీప వాళ్ల కంట పడకుండా చేస్తుంది.
కార్తీక్ ని మాటలతో మభ్యపెడుతూ ఉంటాడు శివ. ఆమెని ఎక్కడో చూసినట్టు ఉంది అంటూ కార్తీక్ అనుకుంటుండగా దీప విని నా గురించేమో అని దగ్గరికి వెళ్లి అడుగుతుంది. డాక్టర్ బాబు నా గురించే నా అనుకుంటున్నారు అంటుంది దీప. కాదు వంటలక్క ఎవరో ఇద్దరు వచ్చారు. వాళ్ల గురించి అనుకుంటున్నాను అంటాడు కార్తీక్. కస్టమర్స్ అయితే కార్తీక్ తెలిసే అవకాశం లేదే కార్తీక్ తెలిసిన వాళ్ళైతే నాకు కూడా తెలిసే ఉంటారే అని ఆలోచిస్తుంది దీప.
సౌందర్య, ఆనందరావు వెళుతుంటే కార్తీక్ పిలుస్తాడు. కానీ వినకుండా కారులో వెళ్లిపోతారు. అనంతరం ఎవరు వాళ్లు అని మోనితని కార్తీక్ అడిగితే కస్టమర్స్ అని చెప్తుంది. పెద్ద గండం నుంచి బయటపడడంతో హాయిగా ఫీల్ అవుతుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన దీపని చూసి నువ్వెప్పుడొచ్చావు అని అరుస్తుంది. పిలిచావా అని కార్తీక్‌ని అడిగితే.. నేనెందుకు పిలుస్తాను నీకేమైనా పిచ్చా అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెంటనే మోనిత గొంతు పట్టుకున్న దీప.. వచ్చింది ఎవరో చెప్పమని గట్టిగా నిలదీస్తుంది. కార్తీక్ ఇక్కడే ఉన్నాడేమోనని మీ అత్త మామలు వచ్చారు. లేరని చెప్తే వెళ్లిపోయారని చెబుతుంది మోనిత. ‘ఈ మధ్య నా నోరు ఊరుకోవడం లేదు. అనవసరంగా మాట్లాడుతున్నాను. ఆంటీతో కార్తీక్ అని, దీపతో ఎప్పుడొచ్చావని అనవసరంగా మాట్లాడుతున్నాను. నా నోరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి’ అని అనుకుంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.