మోనిత ఇంట్లో లేకపోవడంతో మందు తాగాలని ఉందని అంటాడు డ్రైవర్ శివ. దాంతో తనకి కూడా తీసుకురమ్మని డబ్బులు ఇస్తాడు కార్తీక్. ఇదంతా పక్క నుంచి విన్న దీప వారి కోసం మందిరం నంజుకోవడానికి చికెన్ పకోడీ చేస్తుంది. అనంతరం కార్తీక్ మందు తాగుతుండగా పక్కనే కబుర్లు చెప్తుంది. అయితే చాలా రోజుల తర్వాత మందు తాగిన కార్తీక్ కి వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. కార్తీక్ ని మంచం మీద పడుకోబెట్టిన దీప.. గదిలో ఉన్న ఏవో పేపర్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం సెప్టెంబర్ 20న ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
ఉదయం కాగానే నిద్ర లేచిన కార్తీక్ కి తల పట్టేసినట్టు ఉంటుంది. ఇంతలో టీ పట్టుకొని దీప అక్కడికి వస్తుంది. కప్పులో టీ పోసిస్తూ బాగా నిద్ర పట్టిందా డాక్టర్ బాబు అని అడుగుతుంది. ఇంతలా అక్కడికి వచ్చిన శివ మేడం వస్తుంది త్వరగా దీపక్క అని అంటాడు. సరే అని కార్తీక్ కి టీ ఇస్తుంటుంది దీప. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత ఆ కప్పుని కింద పడేస్తుంది. అది చూసి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అని కార్తీక్ అడుగుతాడు. ఇంతలో ఆమె చేతిలో బాబుని చూసి ఈ బాబు ఎవరని అడుగుతాడు. దాంతో మన కొడుకు ఆనంద్ అని చెబుతుంది మోనిత. ఇంతలో బాబు ఏడుస్తాడు. అది చూసి మీరు ఎత్తుకుంటే బాబు ఏడుపు వచ్చేమో డాక్టర్ బాబు అని చెప్పడంతో బాబుని ఎత్తుకుంటాడు కార్తీక్. వెంటనే బాబు ఏడుపు ఆపేస్తాడు. అది చూసి మీకు ఏమైనా గుర్తొస్తుందా డాక్టర్ బాబు అని అడుగుతుంది దీప. కార్తీక్ గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుండగా.. అదేమో వద్దని కసురుతుంది మోనిత. అనంతరం నా కొడుకుని చూశావా వంటలక్క అని సంతోషంగా అంటాడు కార్తిక్. అనంతరం బాబు, కార్తీక్ ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది మోనిత.
అనంతరం ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది దీప. ఇంతలో అక్కడికి డాక్టర్ అన్నయ్య వస్తాడు. ఆ ఇంట్లోకి అడుగుపెడుతూనే అర్జెంటుగా రమ్మని పిలిచావ్ ఏంటని దీపని అడుగుతాడు. దాంతో గదిలో నుంచి తీసుకొచ్చిన కార్తీక్ హెల్త్ సర్టిఫికెట్స్ ని డాక్టర్ అన్నయ్యకి చూపిస్తుంది. అవి చూసి మంచి పని చేసావ్ అమ్మ వీటిని స్పెషలిస్ట్ కి చూపించి చికిత్స ఎంటో కనుక్కుందామని చెబుతాడు. అనంతరం దిగులుగా ఉన్న దీపని చూసి అసలేమైందో చెప్పమని అడుగుతాడు డాక్టర్ అన్నయ్య. దాంతో ఉదయం జరిగిన విషయాన్ని అంతా చెబుతుంది దీప. బాబును చూసి తన కొడుకని నమ్మేసిన కార్తీక్.. ఆ బాబు తల్లి అయిన మోనిత కూడా తన భార్యగా నమ్మేస్తాడని బాధగా అంటుంది. డాక్టర్ బాబు దూరమైపోతాడేమోనని ఎమోషనల్ అవుతుంది. అలాంటిది ఏం జరగదని ఓదార్చుతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అనంతరం కూరగాయలు కోస్తూ భర్త పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటుంది దీప. పరధ్యానంగా ఉండడంతో వేలు కట్ అవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ అది చూసి బాధ పడిపోతాడు. జాగ్రత్తగా ఉండాలి కదా అని దీపతో అంటాడు. ఏం పర్లేదు డాక్టర్ బాబు అంటూ ఏం పని మీద వచ్చారని అడుగుతుంది. దాంతో ఉదయం మోనిత చేసిన పనికి సారీ చెప్పడానికి వచ్చినట్లు చెబుతాడు కార్తీక్. దాని గురించి చెప్పడం మర్చిపోయానని అంటుంది దీప. అలాగే కార్తీక్ ని టీ పెట్టుకొస్తానంటుంది. టీ ఇచ్చిన తర్వాత తన సంబంధించిన చెబుతుంది. అది విని కార్తీక్ కి వ్రతం కొంచెం కొంచెం గుర్తొస్తుంది. దాంతో తల పట్టేసుకుని పడిపోతాడు. ఇంతలా అక్కడికి వచ్చిన మోనిత కంగారుగా కార్తీక్ ముఖం మీద వాటర్ చల్లి లేపుతుంది. పైకి లేచిన కార్తీక్ దీపనే చూస్తూ ఉంటాడు. అది చూసి గతం గుర్తొచ్చింది అనే కంగారుతో ఏమైందని అడుగుతుంది మోనిత. మనం ఇక్కడ ఎందుకు ఉన్నామని ప్రశ్నిస్తాడు కార్తీక్. వంటలక్కతో మాట్లాడమని వచ్చామని మోనిత కవర్ చేసి.. కార్తీక్ ని అక్కడి నుంచి తీసుకెళుతుంది. అనంతరం తన మాటల వల్ల కొంచెమైనా గతం గుర్తొచ్చి ఉంటుంది. అందుకే డాక్టర్ బాబు అలా చూశాడని అనుకుని.. ఇంకా గట్టి ప్రయత్నం చేయాలని అనుకుంటుంది.
అనంతరం ఇంటి బయట కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది మోనిత. ఉదయం జరిగిన సంఘటన గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ కి గతం గుర్తొచ్చేలా ఏం చేసిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కొడుకుని ఎత్తుకొచ్చిన కార్తీక్.. బాబు పెరెంటని అడుగుతాడు. కొంచెం ఆలోంచించిన మోనిత.. ఆనంద్ అని చెబుతుంది. అది విని ఆ పేరు ఎక్కడో విన్నట్లు ఉందని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. అది చూసి మోనిత షాక్ అవుతుంది. దాంతో ఈ ఎపిసోడ్ కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగం అంటూ.. డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చే వరకే నీ కుప్పిగంతులు అని మోనితతో అంటుంది దీప. అది జరగకుండా చేస్తానని కోపంగా అంటుంది మోనిత. ఇంతలో అక్కడికి కార్తీక్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.