కార్తీక్‌కి దగ్గర అవడానికి చెన్నైలో ఉన్న ఆనంద్‌ని తీసుకురావాలనుకుంటుంది మోనిత. కానీ కార్తీక్ ని అక్కడే ఉంచేస్తే దీప తన వైపుకి తిప్పుకుంటుందని భయపడుతుంది. అందుకే కార్తీక్ కి గతం గుర్తొచ్చే మందని మోసం చేసి దీపని వేరే ప్రాంతానికి పంపించాలనుకుంటుంది. కానీ ఇంద్రుడు చెప్పడం వల్ల నిజం తెలిసింది దీప పరిగెత్తుకుంటూ వెనక్కి వస్తుంది. అది తెలియని మోనిత ఆనంద్ ని తీసుకురావడానికి చెన్నై వెళ్లిపోతుంది. ఆ విషయం శివ అని అడిగి తెలుసుకుంటుంది దీప. అందుకే కార్తీక్ కి దగ్గర అయ్యే ప్లాన్ వేస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 19న ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
శివ హాల్లో కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతుంటాడు. అది చూసి దగ్గరకు పిలిచిన కార్తీక్ విషయం ఏంటి అని అడుగుతాడు. దాంతో శివ కొంచెం నసుగుతూ తనకి మందు అలవాటు ఉందని, మేడం ఇంట్లో లేదు కాబట్టి ఒక హాఫ్ తెచ్చుకుంటానని కార్తీక్ నీ రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో.. ఓ ఫుల్ తెచ్చేయి.. తనకి మందు అలవాటు ఉందో లేదోనని టెస్టు చేసుకుంటానంటాడు. కార్తిక్ ఇచ్చిన డబ్బు తీసుకుని సంతోషంగా బయటికి వెళతాడు శివ. ఇదంతా కిటికీలోంచి చూసి భర్తకి మందు బాటిల్ కొనిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది దీప. టైం చూసి కార్తిక్ తో మాట్లాడాలి అనుకుంటుంది.
ఇంకోవైపు ఆనంద్ ని ఇంత సడన్ గా మోనిత ఎందుకు తనతో తీసుకెళ్లిందని ఆలోచిస్తూ ఉంటుంది సౌందర్య. ఇంతలో అక్కడికి వచ్చిన ఆనందరావుతో కూడా అదే అంటుంది. కన్నతల్లి కదా ప్రేమ వల్ల కావచ్చు అని అంటాడు ఆనందరావు. కానీ సౌందర్య కి అది నిజమని అనిపించదు. అందుకే కొడుకుని పెంచమని ఆస్తిని అప్పగించి వెళ్లిన మోనిత.. ఆనంద్ ని తీసుకెళ్లేటప్పుడు మాత్రం ఆశ ఎందుకు వెనక్కి తీసుకోలేదని అంటుంది. ఆస్తి కన్నా విలువైనదేదో జరుపుకుంటుందని అంటాడు ఆనందరావు. దాంతో దానికి ఆస్తికన్న విలువైనది వారి కొడుకు కార్తికేనని చెబుతుంది సౌందర్య. కొడుకు చనిపోయాడు కదా అని ఆనందరావుతో.. మనకు సంబంధించిన విషయం ఏదో దానికి తెలుసని దాని గురించి తెలుసుకోవడానికి స్వయంగా తానే వెళ్తానని సౌందర్య చెబుతుంది. భవిష్యత్తులో తమకు ఎలాంటి సమస్య రాకుండా ముందే జాగ్రత్త పడదామని ఆనందరావుతో చెబుతుంది.
అక్కడ దీప మాత్రం చికెన్ పకోడీ వేస్తూ మందు కోసం బయటికి వెళ్లిన శివ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దీపతో మాట్లాడొద్దని మోనిత చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆమెను చూసినప్పటికీ ముఖానికి చెయ్యి అడ్డుపెట్టుకొని వెళ్లిపోతుంటాడు శివ. అది గమనించిన దీప అతన్ని ప్రేమగా తమ్ముడు శివ అని పిలుస్తుంది. దాంతో కరిగిపోయిన శివ దీపక్క అంటూ ఆ దగ్గరికి వెళ్తాడు. దీపతో మాట్లాడొద్దని కొద్దిసేపు బెట్టు చేసిన శివ.. స్టఫ్గా ఆమె చేసిన చికెన్ పకోడీ చూసి పూర్తిగా కరిగిపోతాడు. అన్ని భలే కుదిరాయని సంతోషపడుతూ చికెన్ పకోడీ చేసి పట్టుకొని రమ్మంటాడు. సరేనంటుంది దీప.
మరోవైపు వారణాసి చేయి పట్టుకొని వేగంగా లాక్కుంటూ వస్తుంటుంది రౌడీ బేబీ సౌర్య. దాంతో ఎక్కడికి సౌర్య అమ్మ అని అడుగుతాడు వారణాసి. దానికి నిన్ను తాతయ్య పంపించాడు కదా అని కోపంగా అరుస్తూ అడుగుతుంది సౌర్య. ఆమెకి సందేహం వచ్చిందని అర్థమైన వారణాసి అదేం లేదని సౌర్యకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా నమ్మని సౌర్య అందరూ ప్రేమతో చేస్తున్నప్పటికీ తనకు నచ్చట్లేదు అని బాధగా ఉంటుంది. అమ్మ నాన్న దొరికే వరకు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్లలేనని అంటుంది సౌర్య. అది చూసి వారణాసి కూడా ఎమోషనల్ అవుతాడు.
అనంతరం కార్తీక్, శివ కలిసి మందు కొడుతుంటారు. మందు తాగుతున్న కార్తీక్ స్టఫ్ తీసుకు రాలేదని శివని అంటాడు. దాంతో వంటలక్క తీసుకొస్తుందని శివ చెప్తాడు. ఇంతలో చికెన్ పకోడీ పట్టుకొని దీప అక్కడికి వస్తుంది. అది చూసి ప్లేట్లో పెట్టుకురమ్మని ఆమెకి కార్తీక్ చెప్తాడు. దీప అటు వెళ్లగా.. ఆమెను చూసి దీప జెన్యూన్ గా ఉందని, ఆమెలో ఎలాంటి మోసం లేదని, అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని శివ అనుకుంటాడు. వెళ్లి దీపతో మాట్లాడుతుండగా శివని కార్తీక్ పిలుస్తాడు. అనంతరం దీప తెచ్చిన చికెన్ పకోడీ తినే చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇస్తాడు కార్తీక్. అయితే ఇంతలో శివకి ఇంటి నుంచి ఫోన్ రావడంతో మాట్లాడడానికి బయటకు వెళ్తాడు. దాంతో ఏవైనా కబుర్లు చెప్పచ్చు కదా అని కార్తీక్ అనడంతో గతంలో దానితో కలిసి తను మందు కొట్టిన విషయాన్ని చెబుతుంది దీప. మీ ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది కదా అని అంటాడు కార్తీక్. అవును అని దీప అన్ని విషయాలు చెబుతుండగా వినకుండానే నిద్రలోకి జారుకుంటాడు. అది చూసి శివతో కలిసి కార్తీక్ ని బెడ్ మీద పడుకోబెడుతుంది. శివ పడుకుంటా అని వెళ్లిపోయాక అక్కడే ఉన్న అలమరాలోని కార్తీక్ హెల్త్ సర్టిఫికెట్స్ ని తీసుకుంటుంది దీప. దాంతో ఈ ఎపిసోడ్ కి శుభం కార్డు పడుతుంది. తర్వాత భాగం అంటూ.. ఉదయం లేచిన కార్తీక్‌కి కాఫీ ఇస్తుంది దీప. అప్పుడే అక్కడికి వచ్చిన మోనిత కాఫీని కింద పడేస్తుంది. ఏంటని అడుగుతూనే ఆమె చేతిలోనే బాబును చూసి ఎవరని అడుగుతాడు కార్తీక్. ఏడుస్తున్న బాబుని ఎత్తుకోమని చెబుతుంది దీప. కార్తీక్ ఎత్తుకోగానే బాబు ఏడుపు ఆపేస్తాడు. అది చూసి ఏదైనా గుర్తొస్తుందని దీప అడగడంతో గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. అసలేం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.