తెలుగు టెలివిజన్ పై మోస్ట్ సక్సెస్ ఫుల్ సీరియల్ అంటే కార్తీకదీపం అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రియాలిటీ షోలు, సినిమాలు బుల్లితెరపై వస్తున్నా వాటికి ఏ మాత్రం తీసిపోకుండా రేటింగ్స్ ని కార్తీకదీపం సీరియల్ తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్, క్రికెట్ వరల్డ్ కప్ టైం లో కూడా ఈ సీరియల్ హవా కొనసాగింది. ఇదిలా ఉంటే ఈ సీరియల్ మూడు నెలల క్రితం దీప, కార్తిక్ పాత్రలకి ఫుల్ స్టాప్ వేసి కొత్త జెనరేషన్ తో కథని నడిపించడం మొదలు పెట్టారు. ఆ తరువాత ఊహించని విధంగా సీరియల్ రేటింగ్ కూడా తగ్గిపోయింది.
కొత్త జెనరేషన్ కి సంబందించిన కంటెంట్ తో కార్తీక దీపం ప్రేక్షకులు సంతృప్తి చెందలేదు. దీంతో మరల కథలో మార్పులు చేసి దీప, కార్తిక్ పాత్రలని సీరియల్ లోకి ప్రవేశపెట్టారు. దీప కార్తిక్ కోసం వెతకడంతో కథని మొదలుపెట్టారు. అలాగే కార్తిక్ గతం మరిచిపోవడం కథలో భాగం చేశాడు. ఇక కార్తీక్, దీప పాత్రలు తిరిగి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీరియల్ మరల రేటింగ్స్ లో టాప్ లోకి వచ్చింది. ఇదంతా వంటలక్క ఎంట్రీ ప్రభావం అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఇక కార్తీక దీపం సీరియల్ హవాని ఇప్పట్లో ఎవరూ నిలువరించలేరు అని చెప్పాలి.
ఇక ఈ సీరియల్ తర్వాత రెండో స్థానంలో గుప్పెడంత మనసు సీరియల్ ఉంది. వసుధార, రిషి లవ్ స్టోరీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ కారణంగానే ఈ సీరియల్ రేటింగ్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇక వీటి తరువాత మూడో స్థానంలో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఉండటం విశేషం. ఇక వంటలక్క ప్రేమి విశ్వనాథ్ స్టార్ మా వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ షోలో ప్రేమి విశ్వనాథ్ ని ఎంట్రీ చేస్తూనే థియేటర్స్ దగ్గర రివ్యూ ఇచ్చేవారితో మంచి హంగామా సృష్టించారు. ఇదంతా ప్రోమోలో చూపించి షో మీద క్యూరియాసిటీ పెంచారని చెప్పాలి.