దసరా ఉత్సవాల కోసం ముందుగానే మోనిత, కార్తీక్ సంగారెడ్డి చేరుకుంటారు. తర్వాత దీప వాళ్లు, సౌర్య, చంద్రమ్మ, ఇంద్రుడు ఒకరికి తెలియకుండా ఒకరు వస్తారు. అక్కడ జరిగే నేత్రదాన శిబిరంలో కార్తీక్‌ని దీప కలుస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 8న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
నేత్రదానం చేయడం కోసం మోనిత ఫామ్ ఫిలప్ చేస్తూ‘భర్త స్థానంలో కార్తీక్ పేరు రాయడం తనకెంతో సంతోషంగా ఉంటుంది’ అని మనసులో అనుకుంటూ ఉండగానే దీప అక్కడికి వస్తుంది. దీప కార్తీక్ తో.. ‘ఏంటి డాక్టర్ బాబు.. నీ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసి, రోగులకు పండ్లు, పాలు పంచుదామని అనుకున్నాం కదా. మీరు కనపడకుండా ఇటు వచ్చేశార’ అని అంటుంది. అలా కాదు దీప మోనిత కూడా దసరా ఉత్సవాలు చూడాలని అంది. ఆ తొందరలో నీకు ఇచ్చిన మాట విషయం మర్చిపోయాను అంటాడు కార్తీక్. మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని అడుగుతాడు కార్తిక్. మాది ఊరే అని చెబుతాడు డాక్టర్ అన్నయ్య. తన స్నేహితురాలు పదే పదే ఫోన్ చేస్తుందని తొందరపెట్టి అక్కడ నుంచి కార్తీక్‌ని తీసుకెళ్తుంది మోనిత.
అనంతరం దీప వాళ్లు రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్తారు. దీప గురించి మాట్లాడుతూ.. ఎలాగైనా తనకి న్యాయం చేయాలని రాజ్యలక్ష్మి డాక్టర్ అన్నయ్య అడుగుతాడు. అప్పుడు రాజ్యలక్ష్మి ఆడ కూతురికి న్యాయం జరిగేలా చూస్తాను అని మాటిస్తుంది. దీప తన గురించి చెప్తూ.. ఇంకో ఆడది తన భర్త దగ్గర తననే పరాయిని ఆడదానిగా చేసి.. తన భర్తని తనకి కాకుండా చేసిందని, ఎలాగైనా మీరు సాయం చేయాలని ప్రాధేయపడుతుంది. ఈ ఊరి వాళ్ల ముందే తనని తన భర్తకి కాకుండా చేసిందని, దానికి ఈ ఊరు మొత్తం సాక్ష్యం చెప్పిందని అంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి.. సరే ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు ఉత్సవాలు ఏ ఆటంకం లేకుండా జరగాలని చెప్తుంది రాజ్యలక్ష్మి.
మరోవైపు మోనిత తన స్నేహితురాలు కావ్య ఇంటికి కార్తీక్ ని తీసుకెళ్తుంది. కార్తీక్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మోనిత ఏం ఆలోచిస్తున్నావ్ కార్తీక్ అని అడుగుతుంది. ‘పోయినసారి వచ్చినప్పుడు తనని అందరూ మందలిచ్చారని, ఈసారి ఎవరు తనని గుర్తుపట్టలేదు ఏంటా అని ఆలోచిస్తున్నాను’ అని అంటాడు కార్తీక్. అప్పుడే అక్కడికి వచ్చిన నరసయ్యకి కావేరి కార్తీక్ ని పలకరించమని చెబుతుంది. నరసయ్య, కార్తీక్‌ని మోనితని పలకరించి తన పిల్లల్ని చదివిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. దాంతో కార్తిక్ గతం తాలూకు జ్ఞాపకాలు లీలగా గుర్తొస్తూ ఉంటాయి. ఆ విషయం మోనితతో చెప్తాడు. దాంతో మోనిత కంగారుగా.. ‘వేరే ఎవరు లేరు. నరసయ్య పిల్లల్ని నువ్వు చదివిస్తున్నావు. ఇదే నిజం’ అని చెప్తుంది. అంతలో ‘ఇవేమీ ఆలోచించకండి. బతుకమ్మ ఉత్సవాలు ఒకసారి చూసి రండి’ అని పంపిస్తుంది కావేరి.
అనంతరం కార్తీక్, మోనితతో.. ‘దీపది కూడా ఈ ఊరే కదా వాళ్లింటికి నన్ను తీసుకెళ్లు’ అని అంటాడు. ‘అసలు తన ఊసే వద్దు అంటుంటే వాళ్లింటికి వెళ్దాం అంటావేంటి కార్తీక్’ కోపంగా అంటుంది మోనిత. ఆమె భర్త మాట్లాడితే దీప తన చుట్టూ తిరగడం మానేస్తుందని చెబుతాడు కార్తీక్. ఇంతలో ఇద్దరు ఆడవాళ్లు వచ్చి మోనిత, కార్తీక్‌ది అదే ఊరు అని కార్తీక్ నమ్మేలా మాట్లాడి వెళ్తారు. మరోపక్క కార్తీక్ కోసం దీప వెతుకుతూ ఉంటుంది. మోనిత మాత్రం కార్తీక్‌ని దీప కంట పడకుండా చేయాలని పక్కకి తీసుకెళ్లబోతుంది. ఇంతలో దీప కార్తిక్ ను చూసి డాక్టర్ బాబు అంటూ దగ్గరకు వస్తుంది. ఇంతలో.. దీపతో కార్తీక్ మాట్లాడుతూ.. ‘మీ ఇంటికి తీసుకెళ్లు మీ ఆయనతో మాట్లాడాలి’ అని అడుగుతాడు. సరే డాక్టర్ బాబు తీసుకెళ్తాను అంటుంది దీప. అప్పుడు మోనిత టెన్షన్ పడి దీపని తిడుతూ నానా గోల చేస్తుంది. ఇంతలో కావేరి సూచన మేరకు ఇద్దర మహిళలు వచ్చిన దీపని అవమానించేలా మాట్లాడి వెళతారు. దాంతో.. మోనిత, కార్తీక్‌ని అక్కడ నుంచి తీసుకెళ్తుంది. బాధపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది దీప. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. ‘రాజ్యలక్ష్మి నీకు ఎలా తెలుసు దీపని అడుగుతుంది మోనిత. ఇలాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా కార్తీక్‌ని వదిలేది లేదని బెదిరిస్తూ ఉంటుంది మోనిత. అసలేం జరిగిందో తర్వాతి ఎపిసోడ్‌లో చూడండి.