కార్తీక్ పుట్టినరోజుని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంది దీప. అది చూసి కార్తీక్ చాలా సంతోషిస్తాడు. అంతేకాకుండా ఉదయమే రక్తదానం, అన్నదానం, రోగులకి పండ్ల పంపిణీ చేద్దామని అంటుంది దీప. దాంతో.. అది జరక్కుండా ఉండటానికి కార్తీక్‌ని దూరంగా తీసుకెళుతుంది మోనిత. ఆ తర్వాత అక్టోబర్ 7న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సౌర్య, ఇంద్రుడు, చంద్రమ్మ కలిసి దసరా ఉత్సవాల కోసం సంగారెడ్డికి బయలుదేరుతారు. అంతకుముందే సంగారెడ్డికి బయలుదేరిన దీప, డాక్టర్ అన్నయ్య, ఆయన తల్లి ఒక హోటల్లో భోజనం చేస్తూ ఉంటారు. అదే హోటల్ కి సౌర్య, ఇంద్రుడు, చంద్రమ్మ వెళ్తారు. ఇంద్రుడికి చంద్రమ్మకి ముందుగానే పరిచయమున్న దీపని చూసి విడివిడిగా వెళ్లి పలకరించి వస్తారు. అక్కడ దీపకి సౌర్య ఉన్నట్టుగా మదిలో అనిపిస్తూ ఉంటుంది. మోనిత, కార్తీక్ ని దసరా ఉత్సవాల కోసం తప్పకుండా సంగారెడ్డి తీసుకెళ్లి ఉంటుందని.. అక్కడికి వెళ్తే డాక్టర్ బాబు కలుస్తాడని అంటుంది దీప. చేతులు కడుక్కొని వెళ్తున్న దీపని దూరం నుంచి నేను చూసిన సౌర్య అమ్మ అనుకోని వెళుతుంది. ఇంతలో వారు వెళ్లిపోతారు.
కార్లో వెళ్తున్న దీప, డాక్టర్ అన్నయ్యతో వాళ్ళమ్మ సంగారెడ్డిలో ఉండే డాక్టర్ అన్నయ్య వాళ్ళ పిన్ని రాజ్యలక్ష్మితో చెప్పి న్యాయం జరిగేలా చేయాలని దీప అంటుంది. ‘మనం బతుకమ్మకు మొక్కుకున్నాం. మనకు మంచే జరుగుతుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అన్నయ్య’ అని అంటుంది దీప. ఈ లోపు సౌర్య వాళ్ళ ఆటో దీప ఉన్న కారుని ఓవర్ టెక్ చేసి వెళ్తుంది. దానికి దీప ‘మన కారుని ఆటో ఓవర్ చెక్ చేస్తుందంటే నువ్వు డ్రైవింగ్ ఎంత స్లోగా చేస్తున్నావో తెలుస్తుంది’ అని నవ్వుతుంది. సరే అన్న డాక్టర్ అన్నయ్య ఆటో ఓవర్ టేక్ చేస్తాడు. దాంతో సౌర్య కారు మనల్ని ఓవర్ టేక్ చేసిందని ఇంద్రుడికి చెప్పి గొడవ చేస్తుంది. వెంటనే ఇంద్రుడు, దీప కారని ఓవర్ టేక్ చేస్తాడు. వాళ్ల అంతా స్పీడ్ ఎందుకు వెళుతున్నారని అనుకుంటారు దీప, డాక్టర్ అన్నయ్య.
అనంతరం కార్తీక్, మోనిత నేత్రదాన శిబిరం దగ్గర కారు దిగుతారు. ఆ బోర్డు చూసిన కార్తీక్ కి గతం తాలూకు జ్ఞాపకాలు వస్తాయి. కళ్ళు దానం చేయడానికి ఫామ్ ఫిలప్ చేయడానికి వెళ్తారు. అదే సమయానికి దీప వాళ్ల కారు కూడా వచ్చి అక్కడే ఆగుతుంది. వెనకాలే సౌర్య వాళ్ళ ఆటో కూడా వస్తుంది. దీప డాక్టర్ బాబు వాళ్ళ కార్ ఇక్కడే ఉంది అని శిబిరం వైపు వెళ్తుంది. సౌర్య వాళ్లు కూడా అవదానం చేయాలని అనుకుంటారు. శిబిరం వద్ద దీపకి సౌర్యకి కూడా ఇంతకుముందు జరిగిన సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగంలో.. దీప వాళ్లు రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్తారు. ఆమెకి దీప బాధనంతా చెప్తారు. ఒక ఆడ కూతురికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని మాటిస్తుంది. ఉత్సవాల్లో ఉండగా కార్తీక్, మోనితతో వంటలక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని.. తన భర్తని తనతో కలిపితే నా చుట్టూ తిరగకుండా ఉంటుందని అంటాడు. అక్కడే కనబడ్డ దీపతో మీ ఇంటికి తీసుకెళ్లమని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్ ఎపిసోడ్‌లో చూడండి.