ముళ్లుని ముళ్లుతోనే తీయాలి అనుకుని.. దుర్గ, దీప కలిసి మోనిత మీద కార్తీక్ కి అనుమానం కలిగేలా చేస్తారు. దాంతో తన బాధనంత దీపకే చెప్పుకుని బాధ పడుతాడు కార్తీక్. ఆ కోపంతో దుర్గని చంపాలని ప్రయత్నం చేస్తుంది మోనిత. కానీ.. కార్తీక్ కి అనుమానం ఇంకా పెరుగుతుంది. అనంతరం మోనితనే తను భార్య కాదని మోనితకి చెప్పేలా చేయాలని దుర్గ, దీప కలిసి కొత్తగా ఓ ప్లాన్ వేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 5 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కార్తీక్‌కి ప్రేమగా పకోడిలు చేసి పెడుతుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన దుర్గ.. ‘పకోడీలు చేశానని నాకు కాల్ చేసి.. నేను వచ్చేలోపు కార్తీక్ సర్‌కి పెడతావా’ అని అంటాడు. అది విని లేదు కార్తీక్ నేను చేయలేదు అంటుంది. దాంతో.. కార్తీక్ సర్ ఏం అనుకోడులే అని అంటాడు దుర్గ. దాంతో.. ఫీల్ అయినా కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అనంతరం కోపంగా దుర్గ కాలర్ పట్టుకుంటుంది మోనిత. ఏం అన్యాయం చేశానురా అని మోనిత అడుగుతుంది. దాంతో.. ‘దీపమ్మకి కూడా ఇలాగే చేశావు కదా.. నేను అదే చేస్తున్నా. రాత్రికి పెద్ద షాక్ ఇవ్వబోతున్నా. రెడీగా ఉండు బంగారం’ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు దుర్గ.
అనంతరం.. మోనిత, దుర్గ చెప్పిన కథల గురించే ఆలోచిస్తూ బాధ పడుతుంటాడు కార్తీక్. అలాగే.. తనకి లీలా గుర్తొచ్చినట్లు సైకిల్ మీద ఒక్కడినే వెళుతున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు. కిటీకిలో నుంచి చూస్తే.. దీప, డాక్టర్ అన్నయ్య, ఆయన తల్లి ఇంటికి పూలు కడుతూ కనిపిస్తారు. దాంతో.. దీపని పిలిచి ఏదైనా పండుగ అని అరుస్తూ అడుగుతాడు. ‘అవును.. నిజంగానే పెద్ద పండుగ ఉంది డాక్టర్ బాబు. రాత్రికి చెబుతా’ అని అంటుంది దీప. అది గమనించిన మోనిత కార్తీక్ దగ్గరకి వచ్చి ఇంట్లోకి తీసుకెళుతుంది. దాంతో.. ఏదైనా పండగ ఉందా అని మోనితని అడుగుతాడు కార్తీక్. అదేదో అడిగి దీప దగ్గరకి వెళుతుండగా.. చేయి పట్టి ఆపేస్తుంది.
మరోవైపు.. ‘అక్కడ ఏం జరుగుతుంది. మోనిత ఏం చేస్తుంది. ఆమెకి పండుగ ఏంటని అనుమానం రాదా’ అని అడుగుతాడు డాక్టర్ అన్నయ్య. ‘లేదు అన్నయ్య. దానికి ఆయన్ని నా దగ్గరకి రాకుండా చూసుకోవడంలోనే టైమ్ వేస్ట్ చేసుకుంటుంది’ అని చెబుతుంది దీప. అనంతరం ‘ఎప్పుడు లేంది. ఆకలి అని అడిగావు ఏంటి దీప’ అని డాక్టర్ తల్లి. సంతోషంలో ఉండడం వల్ల ఆకలిగా అనిపించినట్లుందమ్మ అని చెబుతుంది దీప. అలాగే.. డాక్టర్ బాబుకి మోనిత ఎలాంటి పుడ్డు పెడుతుందో అని అందరూ బాధ పడతారు.
మరోవైపు.. ‘ఏడుపు ముఖం పెట్టుకుని ఇంటి చుట్టు తిరిగే దీప ఎందుకు అంతా సంతోషంగా ఉంది. దుర్గ ఏదో షాక్ ఇస్తా అన్నాడు. ఏంటది’ అని మనసులో అనుకుంటుంది మోనిత. అది గమనించి.. దీప గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు కార్తీక్. దాని గురించి కాదు మెటిరీయల్ గురించి ఆలోచిస్తున్నా.. నీకు ముందే చెప్పాను కదా అంటుంది మోనిత. దాంతో.. ‘నువ్వు చెప్పింది కాకుండా వేరేది గుర్తొస్తోంది. ఏది గుర్తు రాక.. గతం ఏంటో తెలియక పిచ్చిగా ఉంది’ అని కోపంగా అంటాడు కార్తీక్. అది చూసి.. ‘కార్తీక్ ఎందుకంతా ఆవేశం. నాతో పంచుకోవచ్చు కదా’ అంటుంది మోనిత. దాంతో.. ‘నా జీవితంలో నువ్వు తప్ప ఎవరు లేరా. నువ్వే లేరని చెబుతున్నావా. దీప ఎమో నా భార్య అంటుంది. హిమ, రౌడీ అని ఇంకా ఎవో పేర్లు చెప్పింది. నువ్వు చెప్పేది నా కుటుంబమా.. తను చెప్పేది నిజమా. గతం గుర్తొచ్చే వరకు ఏది అబద్ధం అని కొట్టి పారేయలేను’ అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అనంతరం.. దుర్గ, దీప కలిసి ఏదో చేస్తున్నారు. నిజంగా ఏదైనా ఉందా. లేక నాటకాలు ఆడుతున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. ఇంతలో దీప.. వచ్చి ఇంటి తలుపులు కొడుతుంటుంది. దాంతో కార్తీక్ లేవకముందే పంపించాలని అనుకుంటుంది మోనిత. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్.. ఏమైందని దీపని అడుగుతాడు. దాంతో.. దీప, డాక్టర్ అన్నయ్య, ఆయన తల్లి ఇంట్లోకి వస్తారు. ఎందుకు వచ్చారని, బయటికి నడవమని బయటికి వెళ్లమని కసురుతుంది మోనిత. పండుగ చేసుకోడానికి వచ్చామని.. అది డాక్టర్ బాబు పుట్టినరోజు అని చెబుతుంది దీప. అది విని మోనిత షాక్ అవుతుంది. దీప మాత్రం చిలిపిగా నవ్వుతూ మోనితని చూస్తుంటుంది దీప. దాంతో.. ఈ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డు పడుతుంది. తరువాయి భాగంలో.. మోనిత ఇంటికి వచ్చిన దీపకి.. బోటిక్‌లో, ఇంట్లో ఎవరు కనిపించరు. మరోవైపు.. కార్తీక్ ని ఎక్కడికో తీసుకెళుతుంటుంది మోనిత. దాంతో.. దీపకి దూరంగా తీసుకెళుతున్నావా.. లేక దుర్గకి, నీకు అడ్డుగా ఉన్నానని చంపడానికి తీసుకెళుతున్నావా అని అడుగుతాడు కార్తీక్. అసలేం జరిగిందో తరువాతి ఎపిసోడ్ లో చూడండి.