సౌర్యని వెతుకుంటూ వెళ్లిన కార్తీక్, దీపకి ఆమెని పెంచుకుంటున్న ఇంద్రుడు కనిపిస్తాడు. వారే సౌర్య తల్లిదండ్రులని గుర్తు పట్టిన ఇంద్రుడు సౌర్య పెద్దమనిషి అయ్యిందని చెబుతాడు. దాంతో వారు బట్టలు, నగలు కొనిస్తారు. అయితే.. ఇంటికి వస్తామని చెప్పిన కార్తీక్, దీపని కావాలనే కారణాలు చెప్పి రాకుండా అడ్డుకుంటాడు. సౌర్య దూరం అవుతుందేమోనని బాధ పడుతుంటాడు ఇంద్రుడు. మరుసటి రోజు సౌర్య దగ్గరకి వెళ్లడానికి అన్ని సిద్ధం చేసుకుంటాడు కార్తీక్, దీప. ఆ తర్వాత అక్టోబర్ 31 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సౌర్య పెద్దమనిషి అయ్యిందని తెలిసి వెళ్లడానికి అవసరమైన పిండి వంటలన్నీ సిద్ధం చేస్తుంది దీప. ఇంతలో కార్తీక్ వచ్చి భార్య సంతోషంగా చూసి చాలా సంతోషపడతాడు కార్తీక్. అనంతరం మోనితకి చెప్పకుండానే దీపతో పాటు వెళ్లడానికి కార్తీక్ సిద్ధమవుతాడు. ఇంకోవైపు.. సౌర్యకి స్నానం చేయించి ఫంక్షన్‌కి సిద్ధం చేస్తుంది చంద్రమ్మ. ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు.. ‘జ్వాలమ్మ మనల్ని వదిలి వెళ్లిపోతే తట్టుకోగలవా?’ అని సందేహపడతాడు ఇంద్రుడు. దానికి.. ‘పిల్లలు లేరని ఆ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సంగతి సందర్భం వచ్చినప్పుడు చూసుకుందాం’ అని అంటుంది చంద్రమ్మ. దాంతో.. కార్తీక్, దీపకి సౌర్యని అస్సలు అప్పగించనని అనుకుంటాడు ఇంద్రుడు.
మరోవైపు.. సౌర్యని చూడటానికి కారులో వస్తుంటారు కార్తీక్, దీప. చిన్న పిల్లగా ఉన్న సౌర్య.. అప్పుడే పెద్ద మనిషి అయిందా అని సంతోషపడుతుంది దీప. అలాగే.. సంగారెడ్డిలోనే ఇంద్రుడు పిలవగానే వెళ్లుంటే దొరికేది కదా అని బాధ పడుతుంది దీప. దాంతో.. అప్పుడే ఎందుకు వెళ్లలేదు అని చిరాకు పడతాడు కార్తీక్. అది గమనించిన దీప..‘డాక్టర్ బాబులో చిన్నగా మార్పు వస్తుంది’ అని సంతోషపడుతుంది దీప. అక్కడ.. వంటలు చేస్తున్న మనుషులను చూస్తూ దీపని గుర్తు చేసుకుని సంతోషపడుతుంటుంది సౌర్య. ఇంతలో అక్కడికి వచ్చిన చంద్రమ్మకి విషయం చెప్పి బాధ పడుతుంది సౌర్య. అక్కడికి వెళుతుండగా.. అక్కడ ఎవరు లేరని చేయిపట్టుకుని అడ్డుకుంటుంది చంద్రమ్మ. ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు అక్కడ ఎవరు లేరని సర్ది చెబుతాడు. దాంతో.. అమ్మ వచ్చి తనకి అక్షింతలు వేయదా అని కన్నీరు పెట్టుకుంటుంది సౌర్య. అది చూసి ఇంద్రుడు కూడా ఏడుస్తాడు. తన స్వార్థం కోసం తనని ఏడిపించినందుకు తనని తానే తిట్టుకుంటాడు ఇంద్రుడు. అది చూసి సౌర్య, చంద్రమ్మ చాలా బాధ పడతారు. అనంతరం.. సౌర్యని ఏడవొద్దని చెప్పి ఇప్పుడే వస్తానని బయటికి వెళతాడు ఇంద్రుడు.
మరోవైపు.. ఇంట్లోని వస్తువులని పగల గొడుతుంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చి శివని దీపగా ఊహించుకుని చెడామడా తిడుతుంది మోనిత. చంపేస్తానని చెబుతూ గన్ తీసుకొచ్చి అతని తలకి గురి పెడుతుంది. అది చూసి గడగడ వణికిపోతూ వదిలేమని వేడుకుంటాడు మోనిత. దాంతో స్పృహలోకి వచ్చిన మోనిత బయటకి వెళ్లి కాపలా కాయమని కోపంతో ఊగిపోతూ చెబుతుంది. అది చూసి అలాగే మేడం అని చల్లగా జారుకుంటాడు శివ. అక్కడ ఇంతకుముందు రోజు ఇంద్రుడు కలిసి చోట్లో అతని కోసం ఎదురుచూస్తుంటారు కార్తీక్, దీప. దాంతో.. ‘తనే సౌర్య తల్లినని తెలిసి కావాలనే మనల్ని ఇంటికి రాకుండా అడ్డుకున్నాడేమో’ అని సందేహంగా అంటుంది దీప. వేడుక పనుల్లో బిజీగా ఉండొచ్చని సర్ది చెబుతాడు కార్తీక్. ఇంతలో ఆటోలో ఇంద్రుడు అక్కడికి వస్తాడు. అతను ఆటోలో వెళుతుండగా.. బయటే కారులో ఫాలో అవుతుంటారు కార్తీక్, దీప. ఆ సమయంలో.. సౌర్య బాధ చూసి ఇష్టం లేకపోయినా వారిని ఇంటికి తీసుకొస్తున్నట్లు బాధగా అనుకుంటాడు ఇంద్రుడు. అక్కడ సౌర్యకి ముత్తదువులు అందరూ పసుపు కుంకుమ పూసి వేడుక చేస్తుంటారు. కార్తీక్, దీప కూతరుని కలిశారా లేదా అని తర్వాతి ఎపిసోడ్‌లో చూడండి.