వెతుకుంటూ వచ్చిన దుర్గని తిట్టి పంపిస్తుంది మోనిత. అయితే.. అసలు విషయం తెలియని కార్తీక్.. దుర్గని అక్కడే ఉండమంటాడు. అదే మంచి అవకాశం అనుకున్న దీప.. దుర్గతో కలిసి ఓ ప్లాన్ వేస్తుంది. గతంలో మోనిత తన మీద ప్రయోగించిన ఐడియానే దుర్గ సహాయంతో మోనిత మీద ప్రయోగిస్తుంది దీప. దాంతో మోనిత మీద కార్తీక్‌లో అనుమానం మొదలవుతుంది. దాని వల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ దీపకి బాధ చెప్పుకోడానికి వస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 3న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మోనితతో దుర్గ క్లోజ్‌గా ఉండడం చూసి డల్‌గా దీప దగ్గరకి వస్తాడు కార్తీక్. దాంతో ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది దీప. కార్తీక్‌కి చెప్పబోతుండగా.. శివ అప్పుడే కార్తీక్ ని వెతుక్కుంటూ వస్తాడు. కార్తీక్‌ని ఓ రెండు గంటలు బయటికి తీసుకెళ్లమని మోనిత మేడం చెప్పిందని అంటాడు. దాంతో మోనితపై అనుమానం పడుతూ రానని అంటాడు. ఇంతలో శివకి దుర్గ ఫోన్ చేసి.. డబ్బులు పంపించి రెండు గంటలు ఇంటికి రాకుండా బయటికి వెళ్లమని చెబుతాడు. దాంతో దుర్గ చెప్పిన విషయాలను కార్తీక్‌కి చెబుతాడు శివ. అనంతరం సంతోషంగా సినిమాకి బయలు దేరతాడు. దాంతో.. కార్తీక్ కోపంతో తనలో తానే రగిలిపోతూ ఉంటాడు. దీప అతన్ని కూల్ చేస్తున్నట్లు ఆవేశ పడొద్దని అంటుంది. దానికి.. ‘దుర్గ డబ్బులు ఇచ్చి శివని సినిమాకి వెళ్లమనడం ఏంటి.. నన్ను రెండు గంటల పాటు బయటికి తీసుకెళ్లమని మోనిత చెప్పడం ఏంటి.. ఇది ముందు నుంచే జరుగుతుందా.. నేనే గతాన్ని మరిచిపోయి సంతోషంగా ఉంటున్నానా’ అని కోపంగా అంటాడు కార్తీక్. దాంతో.. కార్తీక్‌ని కూల్ చేసిన దీప.. మోనితని బ్యాడ్ చేయడానికి భర్తని ఇబ్బంది పెడుతున్నందుకు మనసులోనే బాధ పడుతుంది.
అనంతరం.. వాకిట్లో పడుకున్న దుర్గ చందమామని చూస్తూ పాట పాడుకుంటూ ఉంటాడు. అక్కడికి వచ్చిన మోనిత.. కర్రతో దుర్గ నెత్తి మీద కొట్టి చంపేయాలని అనుకుంటుంది. అది గమనించిన దుర్గ.. ‘ఏంటి బంగారం.. నన్ను చంపాలని అనుకుంటున్నావా. అదే చేస్తే అనుమానాలే నిజం అవుతాయి’ అని అంటాడు. దాంతో.. అందుకేరా ఏం చేయలేక పోతున్నానని కోపంగా అంటుంది మోనిత. ‘అది సర్లే.. కానీ కార్తీక్ సర్ దీప ఇంట్లో ఉన్నారు. మొగుడు పెళ్లాలు ఏదో మాట్లాడుకుంటున్నారు’ అని చాలా కూల్‌గా అంటాడు దుర్గ. దాంతో.. ఒళ్లుమండిన మోనిత ఇద్దరి పని చెబుతా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అక్కడ కార్తీక్ మాత్రం మోనిత గురించే మాట్లాడుతూ కోపంగా ఊగిపోతుంటాడు. ‘మోసపోయాను వంటలక్క. ఇప్పుడు నాకు తెలిసింది. తర్వాత కాలనీ మొత్తానికి తెలిసి నా పరువు పోతుంది’ అని బాధ పడుతుంటాడు కార్తీక్. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత.. కార్తీక్ తనని అనుమానిస్తున్నాడనే నిజం తెలుసుకుంటుంది. అంతేకాకుండా.. తాను శివని బయటికి తీసుకెళ్లమన్నా సమయానికే.. దుర్గ కూడా శివకి డబ్బులు పంపించి బయటికి వెళ్లమన్నాడని తెలిసి షాక్ అవుతుంది. దాంతో కోపంతో ఊగిపోతూ.. దుర్గని చంపాలని వెళుతుంది మోనిత. నిద్రపోతున్న ర్గని చంపేందుకు మోనిత పాయిజన్ ఇంజక్షన్ ఇవ్వబోతుంది. ఇంతలో కార్తీక్, దీప అక్కడికి వస్తారు. మోనిత, దుర్గ వద్ద ఉండడం చూసి ఏం చేస్తున్నావని అడుగుతాడు. దాంతో బాగా ఇరుక్కుపోయానని మోనిత బాధ పడుతూ.. వాళ్లే కావాలని అనుమానాలు వచ్చేలా చేస్తున్నారని అంటుంది. ఇంతలో లేచిన దుర్గ.. ‘కార్తీక్ సర్ రెండు గంటల వరకూ రాడని అన్నావు కదా.. అప్పుడే వచ్చాడేంటి’ అని అమాయకంగా అడుగుతాడు. దాంతో కార్తీక్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో.. ‘నన్నెందుకు ఇలా టార్చర్ పెడుతున్నారని’ కోపంగా అంటుంది మోనిత. దాంతో.. రాక్షసే నీతి వాక్యాలు చెబుతుందని దుర్గ, దీప నవ్వుతారు. త్వరగా కార్తీక్ వదిలేయకపోతే పరువుపోతుందని హెచ్చరిస్తాడు దుర్గ. అది విని చేసేదేం లేక అక్కడిని నుంచి కోపంగా వెళ్లిపోతుంది మోనిత.
తెల్లారగానే.. దుర్గ విషయాన్ని తేల్చాలని అనుకుంటుంది. ‘దుర్గతో తనకి ఎలాంటి సంబంధం లేదని చెబితే నమ్ముతాడా.. మరి ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నావని అని అడిగితే ఏం చెప్పాలి’ అని బాధ పడుతుంటుంది. దాంతో ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డు పడుతుంది. తరువాయి భాగంలో.. తనకి దుర్గకి ఎలాంటి సంబంధం లేదని, అనుమానించొద్దని కార్తీక్ ని బ్రతిమిలాడుతుంటుంది మోనిత. దాంతో.. దీప కడుపులో బిడ్డకి తనకి సంబంధం లేదని గతంలో కార్తీక్ చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. దాంతో.. ‘నీ కడుపులో బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని అరుస్తాడు కార్తీక్. ఇదంతా చూస్తున్న మోనిత, దీప షాక్ అవుతారు. అసలేం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.