సౌర్యని వెతకడానికి వెళ్లిన కార్తీక్, దీపకి ఇంద్రుడు కనిపిస్తాడు. వారే సౌర్య తల్లిదండ్రులని తెలిసినా కావాలనే వారికి అబద్దం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంద్రుడు. అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత చంద్రమ్మకి సైతం నిజం చెప్పకుండా దాచేస్తాడు. మరోవైపు.. దీప మాత్రం సౌర్య గురించి దొరికిన సమాచారాన్ని వాణికి చెబుతుంది. దాంతో.. వాణి వెళ్లి జరిగిన మొత్తం విషయాన్ని మోనితకి చెబుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 29న ఏం జరిగిందో చూద్దాం..
సౌర్య గురించి దీప చెప్పిన విషయాలను మోనితకి పూసగుచ్చినట్లు చెబుతుంది వాణి. సౌర్యని చూడటానికి కార్తీక్, దీప కలిసి వెళుతున్నారని చెబుతుంది వాణి. దాంతో.. సౌర్య వారి కూతురని, కార్తీక్, దీప నిజమైన భార్యాభర్తలని, అందుకే వారు ఎట్టి పరిస్థితులు సౌర్యని కలవకూడదని చెబుతుంది మోనిత. అలాగే.. కార్తీక్ అంటే చాలా పిచ్చని, అతని కోసమే ఆర్టిఫిషియల్ గర్భంతో ఆనంద్‌ని కన్నానని చెబుతుంది మోనిత. దాంతో.. నీలాంటి గొప్ప ప్రేమికురాలు లోకంలో లేదని ప్రశంసలు కురిపిస్తుంది వాణి. దాంతో.. గొప్ప ప్రేమలు అన్ని విషాదాలే కదా అని నిరాశగా అంటుంది మోనిత. దానికి.. మీ ప్రేమ విషాదం కాదని ఓదార్చుతుంది వాణి. అయినా.. దీప పెడుతున్న టార్చర్ గురించి వాణికి చెప్పి బాధ పడుతుంది మోనిత. అది చూసి.. వారి అడ్డు తొలగిస్తానని ఒట్టేసి చెబుతుంది వాణి. అది విని.. ఉదయంలోపు దీపని, దుర్గని చంపేస్తే పది లక్షల రూపాయలు ఇస్తానని చెబుతుంది మోనిత.
ఇంకోవైపు.. పిండి వంటలు చేస్తున్న దీప దగ్గరకి కార్తీక్ వస్తాడు. సౌర్యని కలవబోతున్నానని దీప చాలా సంతోషడుతుందని అనుకుంటాడు కార్తీక్. అనంతరం తెల్లారగానే కూతురి దగ్గరకి వెళదామని అంటాడు కార్తీక్. ఇంతలో అక్కడికి వచ్చిన వాణిని దీపకి సహాయం చెప్పి పడుకోడానికి వెళ్లిపోతాడు కార్తీక్. మరోవైపు.. ఆనంద్‌ని నిద్రపుచ్చిన మోనిత కార్తీక్ ప్రవర్తనలో తేడా రావడం గురించి బాధ పడుతుంటుంది. ఇప్పుడే ఇలా ఉంటే.. గతం గుర్తొస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని భయంగా అనుకుంటుంది మోనిత. అలాగే.. గతం గుర్తొచ్చి రానట్లు నాటకమాడుతున్నాడా అని కూడా అనుమానపడుతుంది. వెంటనే.. అదంతా తన భ్రమ అనుకుంటుంది మోనిత.
అక్కడ దీప నిద్ర పోయిన తర్వాత ఇంటి మీద పెట్రోల్ పోసి అగ్గి పుల్ల గీసి వేస్తుంది వాణి. ఎంతకి నిప్పు అంటుకోదు. ఇంతలో అక్కడికి వచ్చిన దుర్గ.. తాను పోసింది పెట్రోల్ కాదని నీళ్లని చెబుతాడు దుర్గ. తనకి ముందే అనుమానం వచ్చి క్లోజ్‌గా ఉన్నట్లు నటించానని చెబుతాడు దుర్గ. దాంతో.. ఇంతకు ముందు తాను చేసిన విషయాలను ఆవేశంగా చెబుతుంది వాణి. అనంతరం ఉదయమే నిద్ర లేచిన మోనిత.. దీప, దుర్గ చనిపోయి ఉంటారని ఆనందంతో బయటికి వస్తుంది. అక్కడ కల్లాపి జల్లుతున్న దీపని చూసి షాకై.. వాణికి కాల్ చేస్తుంది మోనిత. ఆ ఫోన్ పట్టుకుని వచ్చిన దుర్గ.. రాత్రి జరిగిన విషయాలను చెబుతాడు దుర్గ. ఈ విషయం అంత కార్తీక్‌కి చెబుదామా అంటుంటాడు దుర్గ. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్.. పొద్దున్నే మొదలు పెట్టేశారా అని, ఇలాంటి దారుణాలు చూడడం తన వల్ల కాదంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. దాంతో.. ఎందుకు తనని టార్చర్ పెడుతున్నావని దుర్గ మీద అరుస్తుంది మోనిత. దాంతో.. నువ్వు నన్ను చంపాలనుకున్నంతా దారుణం కాదులే అని వెటకారంగా చెప్పి వెళ్లిపోతాడు దుర్గ. అనంతరం సంతోషంగా రెడీ అవుతున్న దీప దగ్గరకి వెళతాడు కార్తీక్. సౌర్యని కలవబోతుడడం చాలా సంతోషంగా ఉందని చెబుతుంది దీప. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. కార్తీక్, దీప నిజంగా సౌర్యని కలిశారా లేదా అని తరువాతి ఎపిసోడ్‌లో చూడండి.