సౌర్యని వెతుకుంటూ వెళ్లిన కార్తీక్‌కి దొంగతనం చేయబోతున్న ఇంద్రుడు కనిపిస్తాడు. ఇంతలో అక్కడికి దీప కూడా వస్తుంది. అతన్ని గుర్తు పట్టేసి సౌర్య గురించి ఆరా తీస్తారు. సౌర్య పెద్దమనిషి అయినా విషయం చెప్పడంతో వేడుకకి కావాల్సిన బట్టలు, నగలు అన్ని కొనిస్తారు కార్తీక్, దీప. అయితే.. సౌర్య తల్లిదండ్రులు వాళ్లేనని తెలిసినా.. దత్తత కూతురి మీద మమకారం చంపుకోలేక వారిని ఇంటికి తీసుకెళ్లకుండానే వెళ్లిపోతాడు ఇంద్రుడు. ఆ తర్వాత అక్టోబర్ 28న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఏవేవో కారణాలు చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్న ఇంద్రుడు.. కొంచెం దూరంలో ఆటో ఆపి సౌర్య గురించే ఆలోచిస్తుంటాడు. ‘బిడ్డలు లేని వారి జీవితంలోకి జ్వాల (సౌర్య) వచ్చిందని సంతోషపడ్డాం. ఇన్ని రోజులు తన తల్లిదండ్రులు చనిపోయారని అనుకున్నాం. కానీ.. వంటలక్క, డాక్టర్ బాబు తన తల్లిదండ్రులే. జ్వాలమ్మ వారితో వెళ్లిపోతే చంద్రమ్మ, నేను బతకాలేం. అందుకే జ్వాలమ్మని దూరంగా తీసుకెళ్లిపోతాం’ అని అనుకుంటాడు ఇంద్రుడు. ఇంకోవైపు.. కారులో వెళుతూ సౌర్య దొరికినందుకు సంతోష పడుతుంటారు కార్తీక్, దీప. ఇంతలో.. ఇంద్రుడికి అనుమానం వస్తే తనని దీపకి ఇవ్వకపోవచ్చు అని సందేహంగా అంటాడు కార్తీక్. వారు ఇవ్వనన్నా కూడా సౌర్య నిన్ను చూడగానే అమ్మ అంటూ దగ్గరకి వచ్చేస్తుంది కదా అని సర్ది చెబుతాడు కార్తీక్. దాంతో.. మొదట టెన్షన్ పడ్డా దీప చివరికీ కూల్ అవుతుంది.
ఇంకోవైపు.. తాను కిరాయికి మాట్లాడిన వాల్తేరు వాణి ఏం చేయట్లేదని టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత. అందుకే.. కావేరికి ఫోన్ చేసి తన అభిప్రాయాలను పంచుకుంటుంది మోనిత. వాణి ఏం చేయకపోవడంతో టెన్షన్ పడుతున్నట్లు చెబుతుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్, ఆమె విని ఎందుకు టెన్షన్ అని అడుగుతాడు. దానికి ఇలా దొరికిపోతున్నాను ఏంట్రాబాబు అంటూ తనని తానే తింటుకుంటూ.. కావేరితో మాట్లాడుతున్నానని చెబుతుంది మోనిత. దాంతో.. మరే ఘోరం చేయబోతున్నవన్నట్లు మాట్లాడతాడు కార్తీక్. దానికి దుర్గతో మాట్లాడిన అనుమానమే.. కావేరితో మాట్లాడినా అనుమానమేనా అని కోపంగా అంటుంది మోనిత. నువ్వు దీపతో తిరగడం గురించి అడగకూడదని ఇలా మాట్లాడుతున్నావా అని రివర్స్ ఎటాక్ చేస్తుంది మోనిత. దాంతో.. తనకి భార్యవో కాదో అని డౌట్ వచ్చినట్లు చెబుతాడు కార్తీక్. దానికి.. వారి ఫొటో చూపించిన మోనితకి.. దీపతో కార్తీక్ ఉన్న ఫొటో చూపించి ఇదేంటని అడుగుతాడు. ఈ ఫొటోని బట్టి దీప కూడా తన భార్యనా అని లాజిక్ మాట్లాడతాడు. అదేం లేదని మోనిత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండగా.. దుర్గ ఎంట్రీ అవుతాడు. దాంతో.. కోపంగా తాము సిరీయస్ డిస్కషన్‌లో ఉన్నామని వెళ్లమనడంతో.. సైలెంట్‌గా వెళ్లిపోతాడు దుర్గ. అనంతరం.. నిజం ఏంటో చెప్పు అని మోనిత మీద అరుస్తాడు కార్తీక్.
మరో వైపు.. ఇంద్రుడు ఇంకా రాలేదని టెన్షన్ పడుతుంటుంది చంద్రమ్మ. ఇంతలో అతను అక్కడికి వస్తాడు. ఇంద్రుడు డల్‌గా ఉండడం చూసి.. డబ్బులు దొరకలేదా అని అడుగుతుంది చంద్రమ్మ. అలాగే.. సౌర్య అమ్మ గురించి అడుగుతోందని బాధగా అంటుంది చంద్రమ్మ. అది విని.. వాళ్లని చూశానని మనసులో అనుకుంటాడు ఇంద్రుడు. అనంతరం డబ్బులు తీసుకురాడానికి ఇంట్లోకి వెళుతున్న చంద్రమ్మకి.. ఆటోలోని బట్టలు, నగలు తీసి ఇస్తాడు. ‘బట్టలు బావున్నాయి. కానీ ఎందుకు డల్‌గా ఉన్నావు. డబ్బులు ఎక్కడివీ’ అని ఆరా తీస్తుంది చంద్రమ్మ. దానికి ఆటోని తాకట్టు పెట్టానని ఇంద్రుడు అబద్దం చెప్పిన చంద్రమ్మ నమ్మదు. దాంతో దొంగతనం చేశావా అని కోపంగా అరుస్తుంది చంద్రమ్మ. దాంతో దొంగతనం చేయలేదని చంద్రమ్మ మీద ఒట్టు అని, తనని ఇంకా ఏం అడగొద్దని అంటాడు ఇంద్రుడు.
అక్కడ సౌర్య పెద్దమనిషి అయిన విషయం గురించే ఆలోచిస్తూ బాధ పడుతుంటుంది దీప. అలాంటి దగ్గర ఉండాల్సిన తను చుట్టపు చూపుగా వెళ్లాల్సి వస్తోందని, పిండి వంటలు చేస్తూ ఎమోషనల్ అవుతుంది దీప. ఇంతలో అక్కడికి వచ్చిన వాణి.. విషయం ఏంటని అడుగుతుంది. వాణి నిజ స్వరూపం తెలియని దీప.. అన్ని విషయాలు చెప్పేస్తుంది. దాంతో.. ఆ విషయం మోనితకి చెప్పాలని అనుకుంటుంది వాణి. ఇంతలో చాలా సంతోషపడుతూ దుర్గ స్వీట్లు పట్టుకుని వస్తాడు. విషయం ఏంటని అడిగితే.. మోనిత మీద కార్తీక్ అరవడం గురించి ఆనందంగా చెబుతాడు దుర్గ. దాంతో.. అన్ని మంచి శకునాలేనని సంతోషపడుతుంది దీప. అనంతరం దీప చెప్పిన సంగతులన్నీ మోనితకి చెబుతుంది వాణి. అది జరగనివ్వకూడదని ఫిక్స్ అవుతుంది మోనిత. దీప, కార్తీక్‌ని సౌర్య దగ్గరకి వెళ్లకుండా మోనిత ఆపగలిగిందా లేదా అని తర్వాతి ఎపిసోడ్‌లో చూడండి.