గత ఎపిసోడ్‌లో.. సౌర్యను వెతుకుంటూ వెళ్లిన దీప, కార్తీక్‌కి ఆటోలో వెళుతున్న రౌడీ పిల్ల కనిపిస్తుంది. వారు కారులో వెంబడించిన దొరకదు. ఇంటికి వెళ్లిన తర్వాత వారిద్దరిని ఒకే చోట చూసిన మోనిత, దీప మీద అరుస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన వాల్తేరు వాణి, మోనిత చెంప మీద కొట్టి తన జీవితాన్ని నాశనం చేసిందని తిడుతుంది. అలా దగ్గరైన మోనితని తన దగ్గరే ఉంచుకుంటుంది దీప. ఆ తర్వాత అక్టోబర్ 25న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మోనితపై గొడవ పడిన తర్వాత ఇంటికి తీసుకెళ్లిన దీపని వాల్తేరు వాణి వదిన అని వరుస పెట్టి పిలుస్తుంది. అనంతరం జరిగిన అన్ని విషయాలను వాణికి చెబుతారు దుర్గ, దీప. దాంతో.. దీప మీద జాలి చూపిస్తుంది వాణి. అయితే.. మనసులో మాత్రం మోనిత మనిషినని, దీప, దుర్గ ఆటకట్టించడానికే వచ్చినట్లు అనుకుంటుంది. అలాగే.. దీప కూడా వాణిని గుడ్డిగా నమ్మేస్తుంది. దాంతో.. నమ్మించి గొంతు కోయడానికి పని సులువైందని సంతోష పడుతుంది వాణి. మరో వైపు.. సౌర్య గురించే ఆలోచిస్తుంటాడు కార్తీక్. సౌర్య కొంచెంలో మిస్సవ్వడం తలచుకుని బాధ పడుతుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత, కార్తీక్‌ని భోజనానికి పిలుస్తుంది. దాంతో.. తనకి తినాలని లేదని, ఎవరితో తిరుగుతున్నావో ఎవరికీ తెలుసని వెటకారంగా అంటాడు కార్తీక్. దానికి.. ‘నేను నువ్వు చేస్తున్నావు. వంటలక్కతో నీకున్న సంబంధం ఏంటి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె ఇంట్లోనే ఉంటున్నావు. అన్ని పనులు చేసి పెడుతున్నావు. ఇంకోసారి అటు వైపు వెళితే బాగోదు’ అని కోపంగా అంటుంది మోనిత. అయినా పట్టించుకోని కార్తీక్.. మోనితని దయ్యంలా ఉన్నావని, చెప్పి ప్రశాంతత కోసం దీప దగ్గరకి వెళతాడు. అది చూసి.. ‘నేను దయ్యాన్న. ఆ వాల్తేరు వాణి ఏదో ఒకటి చేస్తే బావుండు’ అని కోపంగా అనుకుంటుంది మోనిత.
అనంతరం.. దుర్గ, వాణి కలిసి నడుస్తూ ఉంటారు. ఆ సమయంలో.. ‘నాకు ఆడవాళ్లంటే పడదు. కానీ.. నిన్ను చూస్తే ఏదో అభిమానం కలిగిందని చెబుతాడు’ దుర్గ. దాంతో.. బుట్టలో పడ్డాడని సంతోషించిన వాణి.. దుర్గని డిన్నర్‌కి బయటికి వెళదామని చెబుతుంది. దానికి.. సమయం వచ్చినప్పుడు వెళదామని చెప్పి వెళ్లిపోతాడు దుర్గ. ఇంకోవైపు.. గిన్నెలు శుభ్రం చేస్తుంది దీప. అప్పుడే అక్కడికి వచ్చిన ఉదయం చేసే పనిని, నైట్ చేస్తున్నావు ఎందుకు అని అడుగుతాడు కార్తీక్. దాంతో.. ఉదయమే సౌర్యని వెతకడానికి వెళుతున్నానని చెబుతుంది దీప. ఇంతలో అక్కడికి వచ్చిన వాణి.. కార్తీక్‌ని అన్నయ్య అని పిలుస్తూ.. కార్తీక్ ఏం మాట్లాడిన అతనికే సపోర్టుగా మాట్లాడుతుంటుంది. అది చూసి సంతోషపడుతుంది దీప. అయితే.. వాణి మాత్రం దీపని చంపడానికి ఏదో ప్లాన్ వేస్తుంటుంది. అనంతరం వాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఉదయమే వేరే పని మీదే బయటికి వెళుతున్నానని చెబుతాడు కార్తీక్. నిజానికి అతను వెళుతున్నది వారణాసి దగ్గరకి. అయితే.. తన పని కాగానే త్వరగా వస్తానని ఇద్దరం కలిసి సౌర్యని వెతుకుదామని చెబుతాడు కార్తీక్.
మరోవైపు.. వాణిని చాటుగా కలుస్తుంది మోనిత. దీప దగ్గరే కార్తీక్ ఉన్నాడని చెప్పడంతో కోపంతో ఊగిపోతుంది మోనిత. ఇంతలో దుర్గ ఫోన్ చేసి డిన్నర్ బయటికి వెళదాం అంటాడు. ఇంతలో దీప, కార్తీక్ అక్కడి వస్తుండడం చూసి మోనిత, వాణి ఒకరిని ఒకరు తిట్టుకున్నట్లు నటిస్తారు. నీకు పిచ్చంటే.. నీకు పిచ్చని వాదులాడుకుంటారు. అదంతా చూసిన ఏం మాట్లాడడు కార్తీక్. దాంతో.. ఇలా ఏన్నాళ్లు ఉంటావో చూస్తానని అని కోపంగా కార్తీక్తో అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. అది చూసి.. వాణిని పూర్తిగా నమ్మిన కార్తీక్, దీపని ఆమెకి అప్పగించి వెళ్లిపోతాడు. ఉదయమే.. సౌర్యని వెతుకుతుంటాడు కార్తీక్. అలాగే.. కుటుంబ సభ్యుల గురించే ఆలోచిస్తుంటాడు కార్తీక్. దీప ఇంటి దగ్గర టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తుంది దీప. అంతకుముందే ఏదో కలిపిన వాణి.. తినను అని చెబుతుంది. కానీ.. దుర్గ తినడానికి సిద్ధ పడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ టిఫిన్ పెట్టమని అంటాడు. అది చూసి టెన్షన్ పడుతుంటుంది వాణి. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.