గత ఎపిసోడ్‌లో.. సౌర్య కోసం వెతుకుతూ ఉంటాడు కార్తీక్. కానీ అతనికి ఎక్కడా కనిపించదు. మరోవైపు.. దీపకి సంగారెడ్డిలో ఇంద్రుడు చెప్పిన విషయం గుర్తొస్తుంది. అతను చెప్పిన ఆ అమ్మాయి సౌర్య అనే డౌట్ వచ్చిన దీప.. ఆ ఊర్లో ఆమెని వెతకడానికి వెళుతుంది. కార్తీక్ కూడా అక్కడికి వచ్చి ఇద్దరం కలిసి వెతుకుదాం అంటాడు. అప్పుడే ఆటోలో వెళుతున్న సౌర్యని చూసి గుర్తు పట్టేస్తుంది దీప. ఆ తర్వాత అక్టోబర్ 24న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఆటోలో సౌర్యని చూసేసిన దీప.. ఆ విషయం కార్తీక్‌కి చెబుతుంది. అనంతరం ఇద్దరు కలిసి కారులో ఆ ఆటోని వెంబడిస్తారు. దాంతో.. చాలా సార్లు సౌర్యని కలిసే అవకాశం వచ్చిన కలవలేకపోయానని బాధగా అంటుంది దీప. కొంత దూరం వెళ్లాక ఆటో కనిపించకుండా పోతుంది. దాంతో.. పట్టుకోలేకపోయానని బాధ పడుతుంది దీప. అది చూసి.. ఎలాగైనా వెతికి పట్టుకుందామని ఆమెకి సర్ది చెబుతాడు కార్తీక్. ఇంకోవైపు.. దీపని కార్తీక్‌ని దూరం చేయడానికి వాల్తేరు వాణి అనే మహిళను మాట్లాడుతుంది మోనిత. వాణి మాటలు విని వంటలక్క పని ముగిసిపోయిందని సంతోషంగా అనుకుంటుంది మోనిత. అక్కడ సౌర్యని పట్టుకోలేకపోయిన కార్తీక్.. దీప గురించే ఆలోచిస్తుంటాడు. ‘మొన్ననే గతం వచ్చిన నాకే ఇలా ఉందంటే.. ఎప్పుడో గతం గుర్తొచ్చిన దీప పరిస్థితి ఎలా ఉంటుందో’ అని అనుకుంటాడు కార్తీక్. అనంతరం.. సౌందర్య, ఆనందరావు అందరు అమెరికా వెళ్లారని చెబుతుంది దీప. సౌర్య అందుకే ఇక్కడే ఉండిపోయి ఉంటుందని అంటుంది దీప.
అనంతరం.. కార్తీక్, దీప ఇంటికి వస్తారు. వెనుకే మోనిత కూడా కారులో వస్తుంది. వారిద్దరిని ఒకే కారులో చూసిన మోనిత.. నా మొగడ్ని ఎక్కడికి తీసుకెళ్లావని కోపంగా అడుగుతుంది. అంతేకాకుండా.. ఇలాగే చేస్తే దీపని చంపి బుడిద కూడా దొరక్కుండా చేస్తానని అరుస్తుంది మోనిత. అది విన్న కార్తీక్.. ‘మోనిత నువ్వు మనిషివేనా’ అని అరుస్తాడు. దాంతో రెచ్చిపోయిన మోనిత దీపని ఇక్కడికి చెడా మడా తిట్టేస్తుంది మోనిత. ఇంతలో.. అక్కడికి వచ్చిన వాల్తేరు వాణి లాగి పెట్టి మోనిత చెంప మీద కొడుతుంది. మోనిత వల్లే తన బోటిక్ కి రూ.20 లక్షలు నష్టమని, అందుకే ఈ ఇలా చేశానని కోపంగా అంటుంది వాణి. అలాగే.. మోనిత అంతు చూస్తానని వార్నింగ్ ఇస్తుంది. అయితే.. వాణి చేసే పనులు చూసి మొదట గందరగోళంలో పడ్డా మోనిత.. తర్వాత రివర్స్లో వస్తోందని అర్థం చేసుకుంటుంది. అందుకే కార్తీక్కి డౌట్ రాకుండా ఏదో రెండు మాటలు అనేసి కార్తీక్ని తీసుకుని వెళ్లిపోతుంది మోనిత. అనంతరం దీపని వదిన అంటూ వరుస పెట్టి పిలుస్తుంది వాణి. మోనిత అంతు చూసేదాకా ఇక్కడే ఏదో రూమ్‌లో ఉంటానని అంటుంది వాణి. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న దుర్గ వచ్చి దీపతో పాటు ఆమె ఇంట్లోనే ఉండమని చెబుతాడు. దానికి దీప కూడా సరేనంటుంది.
ఇంకోవైపు.. అమ్మనాన్న గురించే బాధ పడుతుంటుంది సౌర్య. దేవుడు తన కుటుంబాన్ని ఎందుకు దూరం చేశాడని, తనకి ఎప్పుడు కనిపిస్తారని కన్నీరు పెట్టుకుంటుంది సౌర్య. ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు ఏమైందని అడుగుతాడు. అమ్మనాన్న గురించి చెబుతుంది సౌర్య. అది విని.. సమయం రావాలి, అప్పుడు కచ్చితంగా కనిపిస్తారని సర్ది చెబుతాడు ఇంద్రుడు. దాంతో.. ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.