మోనిత తల పగులగొట్టడానికి సౌర్య విసిరిన రాయి.. ఆమె తప్పుకోవడంతో అనుకోకుండా కార్తీక్‌కి తగులుతుంది. దాంతో.. అతనికి గతం గుర్తొస్తుంది. అయితే.. ఈ విషయం దీపకి మాత్రం చెప్పడు. కానీ.. ప్రతి విషయంలో దీపకి సపోర్టు చేస్తూ మోనితని తిడుతుంటాడు. మరో వైపు.. దుర్గ, దీప కలిసి మోనితని కార్తీక్ ముందు బ్యాడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. దాంతో.. వారి నుంచి తప్పించుకుని కార్తీక్‌ని తన దారిలోకి తెచ్చుకోడానికి మోనిత ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 18న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఉదయం నిద్ర లేచిన దీపకి బయట కూర్చుని ఉన్న కార్తీక్ కనిపిస్తాడు. దాంతో.. కంగారుగా వెళ్లి ఏమైంది డాక్టర్ బాబు.. ఎంతసేపైందని అడుగుతుంది. తనని లేపొచ్చు కదా అని భర్తతో అంటుంది దీప. దాంతో.. ఏం లేదని పని చూసుకోమని చెబుతాడు. అనంతరం దీపని పిల్లల గురించి వివరాలు అడుగుతాడు కార్తీక్. అది విని.. వారు నాన్నమ్మ, తాతయ్యతో అమెరికా వెళ్లిపోయారని చెబుతుంది దీప. దాంతో.. సౌర్య ఇక్కడే ఉన్న విషయం తెలియదా అని మనసులో అనుకుంటాడు కార్తీక్. అలాగే.. దీపలాగే సౌర్యని కూడా కళ్లారా చూసినా గుర్తు పట్టనందుకు బాధ పడతాడు కార్తీక్. అతను ఏదో ఆలోచించడం చూసిన దీప.. ‘ఏం ఆలోచిస్తున్నారు డాక్టర్ బాబు’ అని అడుగుతుంది దీప. దానికి.. తలనొప్పిగా ఉందని, కాఫీ పెట్టివ్వమని దీపతో అంటాడు కార్తీక్. దాంతో.. కాఫీ పెట్టడానికి ఇంట్లోకి వెళుతుంది దీప.
రాత్రి మొత్తం కార్తీక్ ఇంటికే రాలేదని కంగారు పడుతుంటుంది మోనిత. వంటలక్క ఇంటికి ఏమైనా వెళ్లుంటాడా అని చూసేందుకు వెళుతుంది మోనిత. అక్కడ దీప ఇచ్చిన కాఫీని తాగుతుంటాడు కార్తీక్. అది చూసి కోపంగా.. ‘వంటలక్క సిగ్గు లేకుండా నా భర్తని రాత్రంతా..’ అని డైలాగ్ పూర్తి చేసేలోపే లాగి ఒకటి పీకుతుంది దీప. అనంతరం.. జరిగిన విషయాన్ని చెబుతుంది దీప. దాంతో.. అలాగని కొడతావా అని కోపంగా అంటుంది మోనిత. అలాగే.. రియాక్ట్ అవ్వట్లేదు ఏంటని కార్తీక్‌ని కోపంగా అడుగుతుంది. అది విని. ‘నువ్వు ఇప్పుడన్న మాటలే వేరే మహిళతో అంటే వారు వంటలక్కలాగే రియాక్ట్ కాకాపోతే రియాక్ట్ అవుతా. అయినా.. నోరు దగ్గర పెట్టుకోకపోతే 32 పళ్లు రాలతాయి’ అని మోనితకి ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అది విని వంటలక్కకి సపోర్టు చేస్తున్నావంటూ కార్తీక్‌పై చిరాకు పడుతుంది మోనిత. అనంతరం.. దీపకి కాపలాగా రాత్రంతా బయటే ఉన్నాడా ఏంటని మనసులో అనుకుంటుంది మోనిత. అది అర్థమైన కార్తీక్.. తను అనుకునేది నిజమేనని చెప్పి.. మోనితతోపాటు ఇంటికి వెళతాడు.
ఇంటికి వెళ్లిన మోనిత చెంపని తడుముకుంటూ దీపని తిట్టుకుంటుంది. అది చూసిన కార్తీక్ ఎందుకు చెంపని పాముకుంటున్నావు అని వెటకారంగా అడుగుతాడు కార్తీక్. అది చూసి కావాలనే చేస్తున్నావని కార్తీక్ మీద అరుస్తుంది మోనిత. రాత్రంతా తిండి నిద్రలేకుండా కార్తీక్ గురించే ఆలోచించానని అతనితో చెబుతుంటుంది మోనిత. ఇంతలో టిఫిన్ తీసుకుని దుర్గ అక్కడికి వస్తాడు. అక్కడి కార్తీక్‌ని చూసి.. ‘సర్.. రాత్రంతా ఇంటికి రాలేదు. మనిద్దరికీ మాత్రమే రవ్వ దోశ తీసుకురమ్మన్నావు. ప్రతి సారి ఇలాగే ఇరికిస్తావు’ అని మోనితతో అంటాడు దుర్గ. ఇంతలో పులిహోర తీసుకుని అక్కడికి వస్తుంది దీప. అది చూసి మరోసారి తిడుతుంది మోనిత. దాంతో.. మోనితని కంట్రోల్ చేసి ఇంట్లోకి వెళ్లి దీప వడ్డిస్తుంటే కార్తీక్ తింటుంటాడు. ఇంతలో ఆనంద్ ఏడుస్తాడు. దాంతో.. దీప ఆ బాబుని ఎత్తుకుని ఆడించడంతో ఏడుపూ ఆపేస్తాడు. అది గమనించిన మోనిత వెళ్లడానికి ప్రయత్నించిన వెళ్లకుండా దుర్గ రెండు పట్టుకుని ఉండి ఉంటాడు. దాంతో బలవంతంగా విడిపించుకుని అక్కడికి వెళుతుంది మోనిత. అది గమనించి మోనితకి దుర్గని అనుమానిస్తూ తిడతాడు కార్తీక్. అంతేకాకుండా.. బాబు ఏడిస్తే ఎత్తుకుని ఆడించమని దీపకి చెప్పి ఫోన్ వస్తే వెళ్లిపోతాడు కార్తీక్.
ఇంకో వైపు.. వారణాసి గురించి బాబాయ్ ఇంద్రుడిని ఆరా తీస్తుంది సౌర్య. దాంతో.. అక్కడ ఎవరో వారణాసిని కొట్టిన విషయం చెబుతాడు ఇంద్రుడు. కానీ అతను ఎక్కడ ఉన్నాడో తెలియదని చెబుతాడు ఇంద్రుడు. దాంతో.. వారణాసిని అనవసరంగా తిట్టానని బాధ పడుతుంది సౌర్య. మోనిత ఏమైనా వారణాసిని కొట్టించిందేమోనని అనుమాన పడుతుంది సౌర్య. అది కూడా జరిగే అవకాశం ఉందని చెబుతాడు ఇంద్రుడు. మరో వైపు.. హాస్పిటల్‌కి వెళ్లిన కార్తీక్ వారణాసి గురించే ఆలోచిస్తుంటాడు. అతన్ని ఎలాగైనా బతికించుకోవాలని ఆరాటపడతాడు. ఇంతలో అటుగా వచ్చిన డాక్టర్‌ని వారణాసి గురించి అడిగి తెలుసుకుంటాడు. ఎలాగైనా బ్రతికించాలని డాక్టర్‌ని బ్రతిమిలాడతాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.