సంగారెడ్డి నుంచి సరాసరి దీప దగ్గరకే వస్తాడు కార్తీక్. కానీ.. గతం గుర్తొచ్చింది అనే నిజం మాత్రం భార్యకు చెప్పడు. మరో వైపు.. దుర్గ మాత్రం మోనితతో క్లోజ్‌గా ఉన్నట్లు నాటకం ఆడుతుంటాడు. అది నచ్చని మోనిత అతన్ని కోప్పడిన పట్టించుకోకుండా కార్తీక్‌కి అనుమానం వచ్చేలా మాట్లాడుతుంటాడు. అలాగే.. కార్తీక్‌కి దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది దీప. ఆ తర్వాత ఏం అక్టోబర్ 17న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కార్తీక్ ముందు కావాలనే మోనితని బంగారం అని టీజ్ చేస్తాడు దుర్గ. దాంతో దుర్గ కాలర్ పట్టుకుని నేను బంగారం ఏంట్రా అని ఆవేశంగా అడుగుతుంది మోనిత. దాంతో.. దీపకి బదులుగా కార్తీక్ ని చంపడానికి ప్లాన్ చేస్తే అయిపోతుంది కదా అని వెటకారంగా అంటాడు దుర్గ. అది విని పిచ్చిగా మాట్లాడకు అని తిట్టి పంపిచేస్తుంది మోనిత. అదంతా చూసిన కార్తీక్.. దీపని చంపడానికి ఎందుకు ప్రయత్నించావు అని మోనితని మరోసారి నిలదీస్తాడు. దానికి.. ‘నేను ఏం చేయలేదు కార్తీక్. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు’ అని బాధగా అంటుంది మోనిత. అది విని.. ‘నువ్వు నిజంగానే దీపని చంపడానికి రౌడీలను పంపావు. అంటే దీప నిజంగానే నా భార్య. లేక నీ భర్త వెంట ఎవరు పడ్డా చంపేస్తావా. నీలాంటి మోసగాళ్లని చూస్తే చిరాకు’ అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్.
మరోవైపు.. తనని చంపడానికి మోనిత మనుషులను పెట్టిన విషయాన్ని డాక్టర్ అన్నయ్యకి వివరంగా చెప్పి బాధ పడుతుంది దీప. దాంతో.. షదాని వల్ల నీకు మంచే జరిగింది కదమ్మా. గతం గుర్తు రాక ముందే మోనిత ఎలాంటిదో కార్తీక్కి తెలిసి పోయింది. దానికి దుర్గ ఎఫెక్ట్ కూడా తోడయ్యింది. నువ్వు ఏం బాధ పడకు. మంచే జరుగుతుంది’ అని ఓదార్చుతాడు డాక్టర్. ఇంకో వైపు.. సౌర్య గురించి తెలుసుకోడానికి వినాయక విగ్రహాలు అమ్మిన ప్లేస్‌కి వెళతాడు కార్తీక్. అక్కడే ఓ వ్యక్తిని అడిగితే అలాంటి వారేవరు లేరని అంటాడు. వారు కొన్ని రోజులు అలా వచ్చి వెళ్లిపోతుంటారని ఆ వ్యక్తి చెబుతాడు. దాంతో.. రౌడీకి ఎంత కష్టం వచ్చిందని బాధగా అనుకుంటాడు.
ఇంకోవైపు.. కార్తీక్ ముందు అనుమానం వచ్చేలా మాట్లాడడం ఆపేయమని దుర్గని రిక్వెస్ట్ చేస్తుంది మోనిత. తనకి ఉన్న ఆస్తులను అన్ని ఇస్తానని అంటుంది మోనిత. అది విని దుర్గతో పాటు అప్పుడే వచ్చిన దీప కూగా పగల బడి నవ్వుతుంది. అలా చేయాలంటే.. డాక్టర్ బాబుకి నిజం చెప్పేసి దూరంగా వెళ్లిపోవాలని అంటుంది దీప. దాంతో.. వారిద్దరిని చంపేయాలన్నంత కోపంగా చూస్తుంది మోనిత. దాంతో.. ‘భార్య వేరే మగాడితో క్లోజ్‌గా ఉంటే ఏ భర్త అయినా దూరం పెడతాడు. నేను ఇంత చేస్తున్న కార్తీక్ సర్ నిన్ను వదలేట్లేదంటే.. నిన్ను భార్య అని నమ్మట్లేదని అర్థం’ అని వెటకారంగా అంటాడు దుర్గ. అలా కొద్దిసేపు ఆటపట్టించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.
అనంతరం గదిలోకి వెళ్లిన మోనిత.. దుర్గని, దీపని తిట్టుకుంటూ ఉంటుంది. అలాగే.. తన మాటలు గుడ్డిగా నమ్మే కార్తీక్ ఎందుకు ప్రతి దానికి ఎందుకు ప్రశ్నిస్తున్నాడని బాధ పడుతుంది. అలాగే.. కార్తీక్ని ఎలాగైనా మళ్లీ దారిలోకి తెచ్చుకోవానలని అనుకుంటుంది దీప. ఇంకో వైపు.. బయటకి వెళ్లిన కార్తీక్ సరాసరి దీప ఇంటికి వస్తాడు. అప్పటికే ఆమె నిద్ర పోయి ఉంటుంది. దాంతో.. ఆమెని చూస్తూ పెళ్లైన దగ్గర నుంచి తన వల్ల దీపకి ఎలాంటి సుఖం లేదని.. గతం గుర్తు చేసుకుని బాధ పడతాడు కార్తీక్. అనంతరం ఎలాగైనా సౌర్యని వెతికి పట్టుకుని అందరం కలిసి అమ్మనాన్న దగ్గరకి వెళ్లిపోవాలని అనుకుంటాడు. దానికి ముందే మోనితకి బుద్ది చెప్పాలని కూడా ఫిక్స్ అవుతాడు. తర్వాత ఉదయం కాగానే నిద్ర లేచిన దీపకి బయటే కూర్చున్న కార్తీక్ కనిపిస్తాడు. ఆమె ఏమైందని అడగగానే.. తలనొప్పిగా ఉంది కాఫీ పెట్టివ్వమని చెబుతాడు కార్తీక్. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభంకార్డు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి ఎపిసోడ్లో చూడండి.