రౌడీలు కొట్టడంతో తల పగిలిని వారణాసిని హాస్పిటల్‌కి తీసుకెళతాడు కార్తీక్. వారణాసి కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతాడు అక్కడి డాక్టర్. తర్వాత గతం మొత్తం గుర్తొచ్చిన కార్తీక్, దీప కోసం ఇంటికి వచ్చేస్తాడు. అప్పటికే కార్తీక్ ఏమయ్యాడో తెలియని దీప కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది దీప. తలకి కట్టుకో కనిపించిన కార్తీక్ ఏమైందని అడిగితే.. గతం గుర్తొచ్చిందని నిజం మాత్రం చెప్పడు. అనంతరం దీపతో కలిసి మోనిత దగ్గరకి వెళతాడు. దాతో మోనిత కంగారు పడుతూ కార్తీక్ని ఏం చేశావని దీపని తిడుతుంది. దాంతో.. మోనితపైన అరుస్తూ దీపకి సపోర్టుగా మాట్లాడతాడు కార్తీక్. ఆ తర్వాత అక్టోబర్ 15న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
రాత్రి నిను, మోనిత కలిసి వచ్చామని అంటాడు దుర్గు. అది నిజమా అని మోనితని అడుగుతాడు కార్తీక్. దానికి మీరు తప్పిపోయారని వెతుకుదాం అన్నా వినకుండా తనని ఇక్కడికి తీసుకొచ్చిందని అంటాడు దుర్గ. దాంతో.. కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. అమ్మనాన్నకి తాను బతికున్నట్లు తెలియదా.. వారికి దూరంగా ఉండేలా చేసిందని మోనితని తిట్టుకుంటాడు కార్తీక్. అంతేకాకుండా.. ‘అమ్మనాన్న, హిమ ఎక్కడ ఉన్నారు. సౌర్య, వారణాసి ఇక్కడే ఉన్నారు. ఆ విషయం దీపకి తెలియదా. ఆ విషయం దీపని అడిగితే తనకి గతం గుర్తొచ్చిందని మోనితకి తెలిసిపోతుంది. దానికి తెలియకుండా అందరిని వెతకాలి’ అని అనుకుంటాడు కార్తీక్. అక్కడ దుర్గ, డాక్టర్ అన్నయ్య భోజనం చేస్తుంటారు. దీపే వారికి వడ్డిస్తూ ఉంటుంది. తనని కూడా తినమని డాక్టర్ అడుగుతాడు. దానికి.. డాక్టర్ బాబుతో కలిసి భోజనం చేస్తానని అంటుంది దీప. అలాగే.. కార్తీక్‌లో వచ్చిన మార్పుని గమనిస్తారు దీప, డాక్టర్ అన్నయ్య. అది విని కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందేమోనని అంటాడు దుర్గ. అలా ఏం జరగదని, కాకాపోతే మోనిత మీద డౌట్ వచ్చి ఉండొచ్చని అంటాడు డాక్టర్. అనంతరం కార్తీక్‌ని భోజనానికి పిలవడానికి వెళుతుంది దీప.
అక్కడ.. స్విమ్మింగ్ ఫూల్‌ని శుభ్రం చేస్తుంటాడు శివ. అందుకే కావాలనే శివని మాధవ అనే పేరుతో పిలుస్తాడు కార్తీక్. అనంతరం సౌర్య గురించి పరోక్షంగా అడుగుతాడు కార్తీక్. సంగారెడ్డిలో సౌర్య కనిపించిన విషయం చెబుతాడు శివ. దాంతో.. ఆ పాపని వెతకమని, దొరికితే చదివిద్దామని అబద్ధం చెబుతాడు కార్తీక్. అంతేకాకుండా.. మోనితకి ఈ విషయం చెప్పొద్దని కార్తీక్ చెప్పడంతో.. ఆమెకి అస్సలు చెప్పనని అంటాడు కార్తీక్. సౌర్యని దొరికించుకుని, తనని దీప దగ్గరకి తీసుకెళ్లాలని అనుకుంటాడు కార్తీక్. ఇంకోవైపు.. తల్లిదండ్రులని వెతకడానికి వెళ్లిన బయటకి వెళ్లిన సౌర్య ఇంటికి వస్తుంది. ఒంటరిగా బయటికి వెళ్లొద్దని, మోనిత కంటపడితే ప్రమాదమని చెబుతాడు ఇంద్రుడు. అనంతరం చంద్రమ్మ రావాల్సిన డబ్బులు వసూలు చేసుకోడానికి ఊరు వెళ్లిందని, అప్పటి వరకూ తానే వండి పెడతానని అంటాడు ఇంద్రుడు. అది విని నీ వంట తినాలా బాబాయ్ అంటూ కంగారు పడుతుంది సౌర్య.
మరోవైపు.. కార్తీక్‌ని భోజనానికి పిలవడానికి మోనిత ఇంటికి వస్తుంది దీప. అప్పుడే.. ‘దీపని ఎందుకు ఎటాక్ చేయించావు మోనిత. నువ్వు పంపిన మనుషులను కొట్టింది నేనే’ అని కోపంగా అంటుంటాడు కార్తీక్. నేనేందుకు అలా చేస్తానని బుకాయించే ప్రయత్నం చేస్తుంది మోనిత. అయినా నమ్మని కార్తీక్.. దీప కోసం కాకాపోతే నా కోసం పంపావా అని అడుగుతాడు. అంత ప్రేమించే తన మీదకి ఎందుకు పంపుతానని బాధగా అంటుంది మోనిత. అది నిజం కాకాపోతే ఇది ఎలా తగిలిందని లాజిక్ మాట్లాడతాడు కార్తీక్. దాంతో.. సౌర్య విసిరిన తగిలి ఉంటుందని అర్థమైన మోనిత.. నిజం చెప్పలేక వేరే కారణాలు ఏవో చెబుతుంది. దాంతో.. మోనిత తన మీదకో, దీప మీదకో రౌడీలను నిజంగానే పంపావంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. అది విన్న దీప కోపంగా అక్కడి నుంచి కోపంగా తన ఇంటికి వెళ్లిపోతుంటుంది దీప. ఆమెకి ఎదురుగా దుర్గ వస్తాడు. దాంతో.. జరిగిన విషయాన్ని అంత వివరించి మోనిత పారిపోయేలా ఏదైనా చేయమని దుర్గతో అంటుంది దీప. అది విని దాని పని చెబుతానంటూ మోనిత ఇంటికి వెళతాడు దుర్గ.
అక్కడ హాలులో కనిపించిన మోనితకి బంగారం అంటూ హలో చెబుతాడు దుర్గ. దాంతో.. కాలర్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా అని కోపంగా అడుగుతుంది మోనిత. దానికి దీప మీద ఎటాక్‌కి ప్రయత్నించి ఫెయిల్ అయ్యావు కదా అలాగే కోపం వస్తుందిలే అని వెటకారంగా అంటాడు దుర్గ. ఇదంతా ఓ పక్కగా ఉన్న కార్తీక్ వింటూనే ఉంటాడు. దాంతో ఈ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డు పడుతుంది. తరువాయి భాగంలో.. కార్తీక్ రాత్రంతా దీప ఇంట్లోనే ఉంటాడు. ఉదయమే కార్తీక్కి టీ ఇస్తుండగా.. అక్కడికి వచ్చిన మోనిత, దీప మీద విరుచుకుపడుతుంది. తన భర్తని రాత్రంత తనతో ఉంచుకుంటావా అని మోనిత అడగడంతో.. లాగి పెట్టి ఒకటి కొడుతుంది దీప. అది చూసిన కార్తీక్ చాలా కూల్గా ఉంటాడు. దాంతో.. నీ భార్యని కొడుతుంటే అలాగే చూస్తుంటావా కార్తీక్ అని మోనిత అడుగుతుంది. దానికి నా భార్య వంటలక్క లేక నువ్వా అని మోనితని అడగుతాడు కార్తీక్. అసలేం జరిగిందో తరువాతి ఎపిసోడ్‌లో చూడండి.