దీపని చంపాలని రౌడీలను పిలిపిస్తుంది మోనిత. అది గమనించిన వారణాసి వచ్చి వారిని కొట్టడంతో దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే.. రౌడీలు నెత్తి మీద కొట్టడం కింద పడిపోతాడు వారణాసి. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ రౌడీలను కొట్టి వారణాసిని హాస్పిటల్‌కి తీసుకెళతాడు. అంతకుముందు సౌర్య విసిరిన రాయి తగలడంతో కార్తీక్‌కి గతం మొత్తం గుర్తొస్తుంది. అయితే.. కార్తీక్ జాడ ఎక్కడో తెలియని దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అక్టోబర్ 14న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
హాస్పిటల్‌కి వెళ్లిన కార్తీక్‌కి అక్కడి డాక్టర్ తలకి కట్టు కడతాడు. అనంతరం వారణాసి గురించి కార్తీక్ అడిగితే.. అతని పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతాడు డాక్టర్. తర్వాత గతం గుర్తొచ్చిన కార్తీక్.. అసలేం జరిగిందో.. తాను దీపకి కాకుండా మోనితకి ఎలా దొరికానని.. తను బతికున్నట్లు అమ్మనాన్నకి తెలుసా అని అనుకుంటాడు. అంతేకాకుండా.. అన్నింటికి కారణమైన మోనిత సంగతి చూడాలని అనుకుంటాడు. ఇంకోవైపు.. ఇంటికి వెళ్లిన దీప, కార్తీక్‌ని మోనిత ఎక్కడైనా తీసుకెళ్లుంటుందని బాధగా డాక్టర్ అన్నయ్య, ఆయన తల్లి, దుర్గతో అంటుంది. దాంతో.. అలాంటిదేం లేదని కార్తీక్ దొరుకుతాడని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు డాక్టర్ అన్నయ్య. అలాగే.. మోనితకి కార్తీక్ ఎక్కడా ఉన్నాడో తెలియకపోవడంతో నిజంగానే బాధ పడుతుందని చెబుతాడు దుర్గ. మళ్లీ సంగారెడ్డి వెళ్లి కార్తీక్‌ని వెతికి తీసుకొస్తానని అంటాడు దుర్గ. అలాగే.. కార్తీక్ కావాలనే మోనితని వదిలేసి ఉంటాడని చెబుతుంది పెద్దావిడ.
ఇంకోవైపు.. కార్తీక్ ఎక్కడ ఉన్నాడో తెలియని మోనిత ఏడుస్తూ ఉంటుంది. తన ప్రాణాలు కాపాడి దగ్గర చేసుకుంది.. తనని దూరం చేసుకోడానికా అని బాధగా అనుకుంటుంది. ‘నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా మనసులో నీకు కాకుండా వేరే వారికి చోటుందని ఎలా నమ్ముతావు. త్వరగా వచ్చేయి కార్తీక్’ అని తనలో తానే అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడ దీప సంతోషంగా నవ్వుతూ.. నీ కోసం ఏం కూర చేయను అన్నయ్య అని డాక్టర్‌ని అడుగుతుంది దీప. ఇంతలో వచ్చిన దుర్గ కోసం బిర్యానీ చేయనా అని అడుగుతుంది. అది చూసి ఏమైంది దీప అని డాక్టర్ అడిగితే.. డాక్టర్ బాబు ఎక్కడ ఉన్నాడో తెలియక పిచ్చెక్కుతోందని అంటుంది దీప. అందుకే అలా చేశానని చెబుతుంది. సరేనంటూ.. సంగారెడ్డి వెళ్లి డాక్టర్ బాబు గురించి వెతుకుదామని దుర్గతో చెప్పి.. బయటికి వెళ్లిన దీపకి కార్తీక్ ఎదురొస్తాడు. అతనికి తలకి కట్టు చూసి ఏమైందని కంగారుగా అడుగుతుంది దీప. ఏదో యాక్సిడెంట్ అని చెబుతాడు కార్తీక్. అంతేకాకుండా.. దీప బాధ చూసి నిజం చెప్పాలని అనుకుంటాడు. కానీ.. తనకి గతం గుర్తొచ్చిందని తెలిస్తే దీపకి మరింత ప్రమాదమని కార్తీక్ అనుకుంటాడు. అనంతరం.. దీపని ఇంటి దాకా రమ్మంటాడు. దాంతో అతనితో పాటు మోనిత ఇంటికి వెళుతుంది దీప.
మరోవైపు.. మోనితకి తగలాలని విసిరిన రాయి వెనక్కున్న ఎవరికో తగిలిందని అనుకుంటుంది సౌర్య. దాంతో.. అతనికి స్వారీ అని తనలో తానే చెప్పుకుంటుంది సౌర్య. అలాగే.. ఎలాగైనా అమ్మనాన్న గురించి మోనితకి తెలిసిన సమాచారం గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది సౌర్య. అనంతరం.. ఇంటికి వచ్చిన కార్తీక్ తలకి కట్టు చూసి కంగారు పడుతుంది మోనిత. ఏం చేశావని దీపని తిడుతుంది మోనిత. అది చూసి.. మోనిత మీద అరుస్తాడు కార్తీక్. తనకంటే ఇతర విషయాల మీద ఇంట్రస్ట్ ఎక్కువైందని దెప్పి పొడుస్తాడు. దీప అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మోనిత, కార్తీక్ మాట్లాడుకుంటుంటే.. ఇంతలో దుర్గ వస్తాడు. రాత్రి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిందని మోనితకి ఇస్తాడు దుర్గ. అది చూసి విషయం ఏంటని కార్తీక్ అడిగితే.. రాత్రి ఇద్దరు కలిసే వచ్చామని అంటాడు దుర్గ. అది విని మనిద్దరం కలిసి రావడం ఏంటని కసురుతుంది మోనిత. కార్తీక్ ఏం అనుకోడని అంటాడు దుర్గ. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగంలో.. దీపని చంపడానికి మనుషులని పెడితే మిస్సయిందని ఫీల్ అవుతున్నావా మోనితని అంటాడు దుర్గ. ఆమెని చంపితే ఏం ఉపయోగం చంపాల్సింది కార్తీక్ని కదా అంటాడు. ఇదంతా పక్కగా ఉండి కార్తీక్, దీప విని షాక్ అవుతారు. అసలేం జరిగిందో తరువాత ఎపిసోడ్‌లో చూడండి.