దీపని ఇబ్బంది పెట్టడానికి మోనిత చేసిన ప్లాన్‌లు అన్ని బెడిసి కొడతాయి. దాంతో.. కార్తీక్‌ని ఎక్కడా దూరం చేస్తుందోనని దీపని కోపంతో తిడుతుంది మోనిత. అంతేకాకుండా.. దీపని చంపడానికి రౌడీలను కూడా మాట్లాడుతుంది. అలాగే.. సౌర్య కనిపిస్తే ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని ఆమె అమ్మనాన్న చనిపోయారని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపో అని అంటుంది. అలాగే.. దీపని చంపడానికి రౌడీల వైపు పంపుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 13న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సౌర్య అమ్మ అనుకుంటున్న వ్యక్తిని వెతకడానికి వెళ్లిన చంద్రమ్మ తిరిగి వస్తుంది. దీప కనిపించలేదని చెబుతుంది. దాంతో.. మోనితతో జరిగిన విషయాలను వివరించడంతో మోనితని తిడుతుంది. తర్వాత మోనితతో తేల్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని ఆమె దగ్గరకి వెళుతుంది సౌర్య. ఇంకోవైపు వారణాసి చూపించిన ఫొటో వల్ల కార్తీక్‌కి తన గతం లీలగా గుర్తొస్తూ ఉంటుంది. సౌందర్య, ఆనందరావు బాధ పడుతున్నారని, సౌర్య పిచ్చి దానిలా తిరుగుతుందని చెబుతాడు వారణాసి. అలాగే దీపక్క ఎక్కడ ఉంది డాక్టర్ బాబు అని అడుగుతాడు. తను ఉండే దగ్గరే ఉందని చెబుతాడు కార్తీక్. తను ఎంత అవమానించిన తన చుట్టే తిరుగుతుందంటాడు. దాంతో.. దీపక్క బ్రతుకు ఇంకా మారలేదా అని బాధ పడతాడు వారణాసి. అది విని.. ‘నువ్వు చెబుతుంతే నిజమే అనిపిస్తుంది. కానీ గతం గుర్తు రావట్లేదు. నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయ్యి. ప్లీజ్’ అని వారణాసితో అంటాడు కార్తీక్.
మరోవైపు.. విధి చివరికి నడుచుకుంటూ వెళ్లిన దీపని చంపడానికి వెనుకే ఫాలో అవుతుంటారు మోనిత పురమాయించిన రౌడీలు. అప్పుడే అటుగా వచ్చిన వారణాసి అది గమనించి ఆ రౌడీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. దాంతో వారు కర్రతో నెత్తి మీద కొట్టడంతో కిందపడిపోతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ వారందరినీ కొట్టడంతో రౌడీలు పారిపోతారు. అనంతరం వారణాసిని లేపుతుంటాడు కార్తీక్. ఇంతలో మోనితని వెతుక్కుంటూ వెళ్లిన సౌర్య.. ఆమె కనిపించగానే ఓ రాయి తీసుకుని విసురుతుంది. అది గమనించిన మోనిత తప్పించుకోవడంతో.. ఆ రాయి సరాసరి వెళ్లి కార్తీక్‌కి తగులుతుంది. దాంతో కార్తీక్‌కి గతం మొత్తం గుర్తొస్తుంది. దీపని అవమానించడం దగ్గర నుంచి హిమ వల్ల తమకి యాక్సిడెంట్ అవ్వడం వరకూ అన్ని గుర్తొస్తాయి. దాంతో.. తల పట్టుకుని దీప అని గట్టిగా అరుస్తాడు. అనంతరం వారణాసిని దీప లేపడానికి ప్రయత్నించి లేవకపోవడంతో హాస్పిటల్‌కి తీసుకెళుతుంటాడు.
అనంతరం.. సౌర్య ఇంకా రాలేదని భయపడుతుంటుంది చంద్రమ్మ. అది చూసి ఏం పర్లేదని అంటాడు ఇంద్రుడు. ఇంతలో అక్కడికి వచ్చిన సౌర్య జరిగిన విషయాన్ని వివరించి.. మోనిత వస్తే కష్టమని అక్కడి నుంచి వారిని తీసుకెళ్లిపోతుంది. మరోవైపు.. ఎన్ని ప్రయత్నాలు చేసిన దీప తప్పించుకుందని కావేరి దగ్గర బాధ పడుతుంది మోనిత. దుర్గ, సౌర్య, దీప అందరూ తన మీద దాడి చేస్తున్నారని చెబుతుంది. అంతేకాకుండా.. కార్తీక్ తన మీద కోపంతో ఎటైనా వెళ్లిపోయాడని భయపడుతుంది. దాంతో అలా ఏం జరగదని మోనితని ఓదార్చి కార్తీక్ని వెతుకుదాం పదా అని అంటుంది కార్తీక్.
ఇంకోవైపు.. కార్తీక్ గురించి డాక్టర్ అన్నయ్య దగ్గర మాట్లాడుతుంటుంది దీప. డాక్టర్ బాబుని తనకి దూరం చేయడానికి తనని మోసం చేసి ఏటో తీసుకెళ్లి ఉంటుందని అతనితో అంటుంది దీప. దాంతో.. కంగారు పడొద్దని దీపని ఓదార్చుతాడు డాక్టర్ అన్నయ్య. ఆసుపత్రికి వెళ్లిన కార్తీక్‌కి కట్టుకడతాడు అక్కడి డాక్టర్. అనంతరం వారణాసి ఎలా ఉన్నాడని అడిగితే.. అతని పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని, కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతాడు డాక్టర్. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయిభాగంలో.. డాక్టర్ బాబు కనిపించకపోవడంతో కంగారుగా ఉందని డాక్టర్ అన్నయ్య, దుర్గ దగ్గర బాధగా అంటుంది దీప. ఆయన్ని వెతుకుదాం అని వెళుతున్న దీపకి కార్తీక్ ఎదురొస్తాడు. అసలేం జరిగిందో తరువాతి ఎపిసోడ్‌లో చూడండి.