మోనిత చేసిన మోసం గురించి చెప్పి సహాయం చేయమని రాజ్యలక్ష్మిని రిక్వెస్టు చేస్తుంది దీప. బతుకమ్మ పూర్తి కాగానే దాని గురించి చూద్దామని అంటుంది రాజ్యలక్ష్మి. దీప కూడా బతుకమ్మను పేర్చి పండుగకి సిద్ధమవుతుంది. అక్కడికే బతుకమ్మ తీసుకుని వచ్చిన మోనిత, తన ఫ్రెండ్ కావేరి సహాయంతో దీప పరువు తీయడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పి కొట్టిన రాజ్యలక్ష్మి.. మోనితనే తిడుతుంటుంది. ఇదంతా పక్క నిలుచుని విన్న కార్తీక్‌కి మోనిత చేసిన మోసం అర్థమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దీప, మోనిత విషయం పక్కన పెట్టి బతుకమ్మ ఆటని మొదలు పెట్టమని చెబుతుంది రాజ్యలక్ష్మి. దాంతో.. ప్లాన్ బెడిసి కొట్టిందని బాధ పడుతూ కార్తీక్ ఉన్నాడేమోనని చుట్టూ చూసిన మోనితకి అక్కడే కార్తీక్ కనిపిస్తాడు. మరో వైపు సౌర్య కూడా మోనిత కంటపడుతుంది. దాంతో.. కార్తీక్, దీపలో ఒకరిని సౌర్య చూసిన ఇబ్బందేనని కంగారు పడుతుంది మోనిత. వెంటనే శివని పిలిచి ఏదో చెబుతుంది. అలాగే కార్తీక్‌ని అక్కడిని నుంచి తీసుకెళుతుంది మోనిత. అనంతరం శివ మోనత దగ్గరకి వెళ్లి కార్తీక్ సర్ పిలుస్తున్నాడని దీపకి చెబుతాడు. దాంతో.. భర్తని వెతుక్కుంటూ వెళ్లిన దీపకి మోనిత ఎదురొస్తుంది. పిలిచింది కార్తీక్ కాదు.. అతని పేరుతో తనేనని చెబుతుంది మోనిత. అంతేకాకుండా.. రాజ్యలక్ష్మికి తనకి సంబంధం ఏంటని దీపని అడుగుతుంది. దాంతో.. ‘ఆమె నీ మోసాన్ని బయటపెట్టిందా.. అది డాక్టర్ బాబు విన్నాడా. వినుండడులే. వింటే నువ్వు ఇలా ప్రశాంతంగా ఉండేదానివి కాదు కదా’ అంటుంది. దానికి.. ‘కార్తీక్‌ని తన నుంచి ఎవరు వేరు చేయలేరు. నాకు అడ్డొస్తే చంపేస్తా’ అని దీపకి వార్నింగ్ ఇస్తుంది. దాంతో.. నీ వల్ల ఏం కాదంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.
ఇదంతా పక్కనే ఉండి వింటుంటాడు కార్తీక్. దీప అక్కడి నుంచి వెళ్లగానే మోనిత దగ్గరకి వచ్చి.. ‘నువ్వు నిజంగా నా భార్యవేనా. ఇది మన ఊరు కాదని అందరు అంటున్నారు. అంటే నువ్వు చెబుతున్నావన్ని అబద్దమే కదా. అయినా దీపని ఎందుకు చంపుతా అని బెదిరిస్తున్నావు’ అని అడుగుతాడు కార్తీక్. దానికి.. ‘ఎన్నిసార్లు చెప్పిన దీప విన్నట్లేదు. అందుకే చంపుతా అని బెదిరించా. అయినా మారకపోతే నువ్వే వెళ్లి చెప్పు మోనిత మంచిది కాదు. ప్రాణాలు తీస్తుందని చెప్పు’ అని కోపంగా అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత.
అనంతరం.. సౌర్య చాలా నిరాశగా ఉంటుంది. అందరినీ గమనించారా అని ఇంద్రుడు, చంద్రమ్మని అడుగుతుంది సౌర్య. వెతకాము కాని కనిపించలేదని చెబుతారు వారు. దాంతో.. ముగ్గురం మూడు వైపులు వెళ్లి వెతుకుదాం అప్పుడు దొరికే అవకాశం ఉందని అంటుంది సౌర్య. సరేనని తలో వైపు వెళతారు. మరో వైపు.. మిగిలిన మహిళలతో కలిసి మోనిత, దీప కూడా కోలాటం ఆడతారు. అనంతరం అందరు బతుకమ్మలని నిమజ్జనం చేయడానికి చెరువు దగ్గరకి వెళుతుంటారు. ఇంకోవైపు.. మోనిత మాటల గురించే ఆలోచిస్తుంటాడు కార్తీక్. మోనిత అంత గట్టిగా వాదిస్తుందంటే.. దీపదే తప్పు ఉందా అనుకుంటాడు. మరో వైపు.. దీప నాటకం వేసినప్పుడు తన పరిస్థితి గురించి ఆలోచిస్తే.. ఏదో సంబంధం ఉండొచ్చని కార్తీక్ అనుకుంటాడు.
అక్కడ శివనేమో.. కార్తీక్ పేరు చెప్పి దీపని మోనిత పిలవడం ఏంటని ఆలోచిస్తుంటాడు శివ. మోనిత జీతం ఇస్తుందని, ఆమె మాటలు వింటూ దీపని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటాడు శివ. ఇంతలో అతని దగ్గరకి సౌర్య వస్తుంది. ఎవరని శివ అడిగితే.. వినాయకుడి విగ్రహాలను కొన్నారు కదా అని అంటుంది సౌర్య. వారు ఏదో మాట్లాడుకుంటుండగా.. మోనిత చూసి శివని తిట్టుకుంటుంది. ఇంతలో.. సౌర్యకి డబ్బులు ఇవ్వడానికి వెళుతున్న కార్తీక్‌ని మోనిత ఎందుకు ఆపిందని అనుకుని.. సౌర్యని కార్తీక్ దగ్గరకి తీసుకెళతానంటాడు శివ. ఇంతలో మోనిత కాల్ చేసి శివని సౌర్యని అక్కడే వదిలేసి వెళ్లమని వార్నింగ్ ఇస్తుంది. దాంతో మేడం పిలస్తుందని వెళ్లకపోతే జాబ్ పోతుందని చెప్పి సౌర్యని పంపిచేస్తాడు. కానీ.. ఆ పాప అంటే మోనితకి ఎందుకు భయమో తెలుసుకోవాలని అనుకుంటాడు శివ. ఇంతలో ఏదో వెతుకుతూ దీప అటు వైపే వెళుతుంటుంది. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగంలో.. మోనిత, దీప ఇద్దరు తనకి తెలియదని, దీపని మాత్రమే నమ్మమని కార్తీక్‌కి చెబుతుంది రాజ్యలక్ష్మి. ఏదో ఆలోచిస్తూ వెళుతున్న కార్తీక్‌కి వారణాసి ఎదురొచ్చి.. కార్తీక్, దీప ఉన్న పిక్ చూపిస్తాడు. అది చూసి షాక్ అవుతాడు కార్తీక్. ఆ తరువాత ఏం జరిగిందో నెక్ట్ ఎపిసోడ్‌లో చూడండి.