దీపకి దూరంగా ఉంచడానికి కార్తీక్‌ని సంగారెడ్డిలో జరిగే బతుకమ్మ పండుగకి తీసుకెళుతుంది మోనిత. అదే బతుకమ్మ పండుగ చూడటానికి వెళతారు దీప, డాక్టర్ అన్నయ్య, పెద్దావిడ. అలాగే అక్కడే ఉండే డాక్టర్ పిన్ని రాజ్యలక్ష్మిని కూడా సహాయం అడుగుతారు. ఆమె పండుగ కాగానే అస్సలు విషయం తేల్చేస్తానని చెబుతుంది రాజ్యలక్ష్మి. ఆ తర్వాత అక్టోబర్ 10న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
బతుకమ్మలు తీసుకొని చాలామంది మహిళలు రాజ్యలక్ష్మి ఇంటికి వస్తారు. అప్పుడే మైక్ తీసుకున్న రాజ్యలక్ష్మి మిగిలిన వారిని కూడా త్వరగా రమ్మని చెబుతుంది. ఇంతలో రకరకాల పూలతో బతుకమ్మని పేర్చిన దీప కూడా అక్కడికి వస్తుంది. మరోవైపు.. మోనిత కూడా అక్కడికే బయలుదేరుతుంది. రాజ్యలక్ష్మి ఇంటికి వస్తున్న దారిలోనే దీపని ఎలా బాధ పెట్టేలా అని కావేరి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకోవైపు.. సౌర్య, ఇంద్రుడు, చంద్రమ్మ ఆటో వెళుతుంటారు. ఇంతలో.. దీపని చూసినట్లు గుర్తొచ్చిన సౌర్య ఆటోని ఆపమని అంటుంది. ఆటో దిగిన తర్వాత అప్పటికి వరకూ జరిగిన విషయాలు ఇంద్రుడికి పరిచయం ఉన్న ఆమె తన అమ్మ దీప అనిపిస్తుందని అంటుంది సౌర్య. సరే అందరం కలిసి వెతుకుదాం అనుకుంటారు.
ఇంకోవైపు.. బైక్ మీద సంగారెడ్డికి వస్తాడు దుర్గ. రాజ్యలక్ష్మి ఎక్కడ అని ఆలోచిస్తుండగా.. అక్కడికే డాక్టర్ వచ్చి ఆమె ఇళ్లు చూపిస్తాడు. దాంతో.. మోనితకి చుక్కలు చూపిస్తానని అంటాడు దుర్గ. ఇంతలో అక్కడికే కార్తీక్, మోనిత నడుస్తూ వెళుతుంటారు. కార్తీక్ దిగాలుగా ఉండడం చూసి.. విషయం ఏంటని అడుగుతుంది మోనిత. దానికి ఇది నా ఊరు కాదని అనిపిస్తుందని అంటాడు కార్తీక్. ఇంతలో అక్కడికే వచ్చిన దుర్గ మోనిత, కార్తీక్‌ని పలకరిస్తాడు. సంగారెడ్డి బతుకమ్మ పండుగ కలిసి చేసుకుందామని ఇలా చెప్పపెట్టకుండా వచ్చేస్తారా అని అడుగుతాడు దుర్గ. దాంతో.. ఇది నీకు ఈ ఊరుకి సంబంధం ఎంటని కోపంగా అడుగుతుంది మోనిత. ఇంతలో కొందరు వ్యక్తులు వచ్చి దుర్గని, దీపని తెలిసినట్లు పలకరిస్తారు. అంటే దీప విషయంలో మోనిత వేసిన ప్లాన్ లాగే దుర్గ ప్లాన్ వేశాడన్నమాట. దాంతో కార్తీక్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అనంతరం నిజం ఒప్పుకోమని దుర్గ వార్నింగ్ ఇచ్చిన ససేమిరా కుదరదని అంటుంది మోనిత. దాంతో.. నీ తిక్క కుదురుస్తానని మోనితకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు దుర్గ.
అనంతరం.. దుర్గ మాటలని గుర్తు చేసుకుని ఫీల్ అవుతుంటాడు కార్తీక్. ఇంతలో అక్కడికి వచ్చిన శివ హ్యాపీ బర్త్ డే అంటాడు. వారి వెనుకే సౌర్య, ఇంద్రుడు నడుస్తూ వస్తుంటారు. ఇంతలో శివని.. ఆదిత్య అని పిలుస్తాడు కార్తీక్. దాంతో.. ఆదిత్య పేరుతో ఏదో సంబంధం ఉన్నట్లు సడెన్‌గా గుర్తొస్తుంది కార్తీక్. అదే విషయం శివకి చెబుతాడు. అయితే.. కార్తీక్ని చూడకుండానే బతుకమ్మ జరుగుతున్న దగ్గరకి వెళ్లితే దీప గురించి తెలిసే అవకాశం ఉందని అనకుంటారు సౌర్య, ఇంద్రుడు. వారి కంటే ముందే కార్తీక్ అక్కడికి వెళతాడు. మోనిత అప్పటికే అక్కడ ఉంటుంది. ఇంతలో దీప బతుకమ్మ అక్కడికి వస్తుంది. దాంతో.. మోనిత చెప్పిన ప్రకారం ఓ మహిళ దీపని నానా మాటలు అంటూ రాజ్యలక్ష్మి ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. దాంతో.. దీప చాలా మంచిదని అంటుంది రాజ్యలక్ష్మి. దాంతో.. తను అబద్దాలు చెబుతుందని మోనిత, కావేరీ ఏదో చెప్పబోతారు. అది విని అసలు మోనితకి, కార్తీక్కి ఈ ఊరికి సంబంధమే లేదని, ఎందుకు నాటకాలు ఆడుతున్నారని అందరి ముందే నిలదీస్తుంది.
ఇదంతా విని ఇది తన ఊరు కాదా.. మోనిత నాటకాలు ఆడిందా అని అనుకుంటాడు కార్తీక్. అనంతరం గొడవ పక్కన పెట్టి ఆటని మొదలు పెట్టమని చెబుతుంది రాజ్యలక్ష్మి. అయితే.. ప్లాన్ రివర్స్ అవడంతో తనని తానే తిట్టుకుంటుంది మోనిత. అయితే.. చూడలేదు కదా అనుకుంటూ చుట్టు చూస్తే.. కార్తీక్ అక్కడే ఉండడం చూసి షాక్ అవుతుంది. దాంతో.. ఈ ఎపిసడ్‌కి ఎండ్ కార్డు పడుతుంది. తరువాయి భాగంలో.. అందరు సరదాగా బతుకమ్మ ఆడతారు. రాజ్యలక్ష్మికి తనకి ఏంటి సంబంధం అని దీపతో కోపంగా అంటుంది మోనిత. మోసం బయటపడి డాక్టర్ బాబు తనతో వస్తాడని అంటుంది దీప. దాంతో.. కార్తీక్ని దక్కించుకోవడం కోసం ఎంత దూరమైన వెళతానని అంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి ఎపిసోడ్‌లో చూడండి.