దీపతో కార్తీక్ చాలా సమయం గడుపుతున్నాడని కోప్పడుతుంది మోనిత. ఎలాగైనా దీప అంతు చూడాలని అనుకుంటుంది. ఉదయమే సౌర్య కోసం ఇంద్రుడి ఇంటికి వెళ్లిన దీప, కార్తీక్‌కి వారు రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలుస్తుంది. అంతేకాకుండా.. ఇంట్లోకి వెళ్లి చూసిన వారికి సౌర్య ఫొటో దొరుకుతుంది. మరో వైపు.. సంగారెడ్డి వెళ్లిపోయిన ఇంద్రుడు, చంద్రమ్మ.. సౌర్యని తమ బిడ్డే అని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఆ తర్వాత నవంబర్ 9న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.
గుడిలో అమ్మనాన్న పేరుకి బదులు ఇంద్రుడు, చంద్రమ్మ పేరు చెప్పడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదే విషయం వారిని అడిగితే.. ‘మీ అమ్మనాన్న విషయం పూజారికి తెలిస్తే.. నువ్వు ఇక్కడ ఉన్నట్లు మీ నాన్నమ్మ, తాతయ్యకి తెలుస్తుంది. అప్పుడు వారు నిన్ను తీసుకెళతారు’ అని చెబుతాడు ఇంద్రుడు. అలాగే చంద్రమ్మ కూడా.. ‘మీ అమ్మనాన్న పేరు ఎవరికీ చెప్పొద్దని చెబుతుంది’. అలాగే.. అమ్మనాన్న వెతకడం గురించి అడిగితే ఏవేవో కారణాలు చెప్పి వాయిదా వేస్తాడు ఇంద్రుడు.
మరోవైపు.. కార్తీక్, దీప ఎక్కడికి వెళ్లారో తెలియని మోనిత.. ఆమె ఇంటి ముందే కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది. అది చూసిన దుర్గ.. ఇక్కడేం చేస్తున్నావని వెటకారంగా అడుగుతాడు. దాంతో.. అక్కడి నుంచి వెళ్లు అంటూ దీప ఇంట్లోకి వెళ్లి కూర్చుంటుంది మోనిత. దాంతో.. మోనితకి ఇంకా ఇరిటేట్ చేద్దామని ఫిక్స్ అయినా దుర్గ.. కార్తీక్, దీప చాలా ఎంజాయ్ చేస్తున్నారని అంటాడు దుర్గ. గతం గుర్తొచ్చిన కార్తీక్.. ‘నీ మీద రివెంజ్ తీర్చుకోడానికి నటిస్తున్నాడు. ఇప్పుడు కూడా వారిద్దరూ కలిసి వస్తారు చూడు’ అని మోనితకి చెబుతాడు దుర్గ. అది విని.. అది జరగని పని అని చెబుతుంది మోనిత. ఇంతలో కార్తీక్, దీప కలిసి కారులో దిగుతారు. అది చూసి మొదట షాకైనా మోనిత.. కోపంతో ఊగిపోతుంది.
ఇదే అదునుగా భావించిన దుర్గ.. ఎవరు లేరని ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందామని తీసుకొచ్చిందని కార్తీక్‌కి చెబుతాడు. దాంతో.. అక్కడ స్టాప్ ఉన్నారని ఇక్కడికి వచ్చావా అని వెటకారంగా అంటాడు కార్తీక్. అది విని.. మీరిద్దరు ఎక్కడికి వెళ్లారు అని కోపంగా అడుతుంది మోనిత. ఆమె మాటలు విని.. ఓపిక లేదు వెళ్లమంటుంది దీప. అది పట్టించుకోని మోనిత.. కార్తీక్, దీపపై విమర్శలు చేస్తుంది. దాంతో.. తనని కాసేపు ఒంటరిగా వదిలేయమని మోనితని రిక్వెస్టు చేస్తుంది దీప. అది విని.. సిగ్గు లేకుండా కార్తీక్‌ని పట్టుకుని వేలాడుతుందని దీప మీద కోపంగా విమర్శలు చేస్తుంది మోనిత. దాంతో.. ఏదో సహాయం చేస్తున్నానని చెప్పి మోనితని అక్కడి నుంచి తీసుకెళతాడు కార్తీక్. అతని ప్రవర్తన చూసి.. కార్తీక్‌కి గతం గుర్తొచ్చినట్లే ఉందని అనుకుంటుంది మోనిత. అనంతరం.. సౌర్య ఫొటో చూస్తూ బాధ పడుతుంటుంది దీప.
మరోవైపు.. హోటల్‌లో భోజనం చేసిన తర్వాత సౌర్య గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఆనందరావు, హిమ. సౌందర్య ఊరి నుంచి రాగానే అందరం వెళ్లి బలవంతంగానైనా సౌర్యని తీసుకొద్దామని చెబుతాడు ఆనందరావు. అలా చేస్తే.. తను డాక్టర్ చదువుతానని చెబుతుంది హిమ. ఇంకోవైపు.. దొంగతనంగా కార్తీక్ పర్సు తీసిన మోనితకి.. అందులో చాలా డబ్బులు కనిపిస్తాయి. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్‌తో.. ‘ఇంత డబ్బు ఎక్కడిది’ అని కోపంగా అడుగుతుంది మోనిత. దాంతో.. మోనితకి తన మీద డౌట్ వచ్చిందని మనసులో అనుకున్న కార్తీక్.. ‘నేను డాక్టర్‌ని మోనిత. రోజు సర్జరీలు చేసి డబ్బు సంపాదిస్తున్నా’ అని చెబుతాడు కార్తీక్. అది విని షాకైనా మోనితలో మళ్లీ.. ‘లేకపోతే నాకు ఎలా వస్తాయి. బంగారు గొలుసు తాకట్టు పెట్టాను’ అని అబద్ధం చెప్పేస్తాడు. అది విని.. బంగారు గొలుసు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని బాధగా అంటుంది మోనిత. దానికి.. నీ మీద ఆధారపడడం ఇష్టం లేదని చెబుతాడు కార్తీక్. ఇది మన డబ్బు అని సర్ది చెబుతుంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన దుర్గ.. ఆమె గిఫ్ట్ ఇచ్చిందని చెబుతూ ఓ గోల్డ్ చైన్ చూపించి ఎలా ఉందని అడుగుతాడు. అది చూసి.. ఎప్పటిలాగే మోనిత మీద వెటకారంగా ఏవేవో మాటలు అనేసి వెళ్లిపోతాడు. మోనిత ఎంత చెప్పిన వినడు. అనంతరం కోపంగా దుర్గ కాలర్ పట్టుకుని ఏం పాపం చేశానని బాధ పడుతుంటుంది మోనిత. దాంతో.. నీకు రోజులు దగ్గర పడ్డాయని వెటకారంగా అని వెళ్లిపోతాడు దుర్గ. తర్వాత.. కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఆ డబ్బు దీప కోసం ఖర్చు పెడుతున్నాడా.. అంటే అతనికి నిజంగా గతం గుర్తొచ్చిందా అనుకుంటుంది మోనిత. మోనితకి నిజం తెలిసిపోయిందో లేదో తర్వాతి ఎపిసోడ్‌లో చూడండి.