బయటికి తీసుకెళతానని చెప్పి సౌర్యని బలవంతంగా హైదరాబాద్ తీసుకెళుతుంటాడు ఆనందరావు. ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు వారిని అడ్డగించి సౌర్యని తీసుకెళ్లిపోతాడు. ఇంద్రుడు దంపతుల మీద అనుమానం వచ్చి కార్తీక్, దీప వారి ఇంటికి వెళతారు. అప్పుడు ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. మరోవైపు.. కార్తీక్, దీప లేచిపోయారని మోనితకి చెబుతాడు దుర్గ. దీంతో మోనిత టెన్షన్ పడుతుంటుంది. ఆ తర్వాత నవంబర్ 8న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఉదయం నుంచి కార్తీక్ కనిపించట్లేదని కంగారు పడుతుంటుంది మోనిత. ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడు. అందుకే దుర్గ చెప్పినట్లు కార్తీక్, దీప వెళ్లిపోయి ఉంటారా అని అనుమానపడుతుంటుంది. ఇంతలో అక్కడికి కార్తీక్ రావడంతో సంతోషపడుతుంది మోనిత. దాంతో.. ఎక్కడికి వెళ్లావని కంగారుగా అడుగుతుంది. అది విని.. నటించకు మోనిత అని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. దాంతో.. తన ప్రేమని నటన అంటావా అని బాధ పడుతుంది మోనిత. అంతేకాకుండా.. గతం గుర్తొచ్చిందా లేదా అని తెలుసుకుంటానని పట్టుదలగా అనుకుంటుంది మోనిత.
ఉదయమే ఇంద్రుడి ఇంటికి వెళతారు కార్తీక్, దీప. అక్కడ టు లెట్ బోర్డు చూసి.. అక్కడ ఓనర్‌ని వారి గురించి అడిగితే.. రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెళ్లిపోయారని అంటాడు. దాంతో.. ఇంట్లోకి వెళ్లి ప్రతి మూల వెతుకుతారు. అప్పుడే దీపకి పెద్ద మనిషి పండుగ చేసినప్పుడు దిగిన ఫొటో దొరుకుతుంది. అందులో ఇంద్రుడు, చంద్రమ్మ, సౌర్య ఉంటారు. అది చూపించి చాలా బాధ పడుతుంది దీప. కావాలనే వేరే అమ్మాయిని చూపించారని కన్నీరు పెట్టుకుంటుంది. ‘సౌర్యని ఎక్కడికి తీసుకెళ్లారు.. నా బిడ్డ నాకు కావాలి డాక్టర్ బాబు. రాత్రి మీరు వెయిట్ చేద్దామంటున్న నేను వద్దన్నాను. అలాంటి బుద్ది నాకెందుకు పుట్టింది’ అని బాధగా అంటుంది దీప. దాంతో.. సౌర్యని తీసుకొచ్చే పూచి తనదని చెప్పి ఓదార్చుతాడు కార్తీక్.
అనంతరం.. సంగారెడ్డి పక్క ఊరికి తీసుకెళతాడు ఇంద్రుడు. అది చూసి.. మనం వెతకాల్సింది అక్కడైతే ఇక్కడ ఎందుకు ఉండడం అని అంటుంది సౌర్య. దానికి సంగారెడ్డిలో అద్దెలు ఎక్కువ అని చెబుతుంది చంద్రమ్మ. అనంతరం సౌర్య గురించే ఆలోచిస్తూ.. గుడిలో గంట కొడుతుంటుంది దీప. చాలాసేపటి వరకు అలాగే కొడుతుండడంతో పూజారి వచ్చి ఏమైందని అడుగుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ ఆమెని ఆపి.. తన ఏదో బాధలో ఉందని చెప్పి పూజారిని పంపేస్తాడు. దాంతో.. ‘నా బిడ్డని చేజేతులా నేనే దూరం చేసుకున్నాను. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చిన ఉపయోగించుకోలేకపోయాను’ అని కన్నీరు పెట్టుకుంటుంది దీప. తన తప్పేం లేదని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. అన్ని బాధలకు కారణం దేవుడే అని ఇద్దరు బాధ పడతారు. అనంతరం హిమ ఎక్కడ ఉందని అనుకుంటాడు కార్తీక్. ముందు మోనితని వదిలించుకుని మిగిలిన సమస్యలపై దృష్టి పెట్టాలని అనుకుంటాడు కార్తీక్.
మరోవైపు.. సౌర్య, ఇంద్రుడు, చంద్రమ్మ గుడికి వెళతారు. అక్కడ సౌర్యని అమ్మనాన్న పేరు చెప్పమని అడుగుతాడు పూజారి. దాంతో.. అసలు అమ్మనాన్న పేరు చెప్పబోతుంటే.. మధ్యలో అడ్డుపడుతూ ఇంద్రుడు, చంద్రమ్మ అని ఇంద్రుడు చెబుతాడు. అది విని షాక్ అవుతుంది సౌర్య. అదే విషయం వారిని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.