సౌర్య గురించి సమాచారం కోసం వెళ్లిన కార్తీక్‌కి ఇంద్రుడి ప్రవర్తన మీద అనుమానం వస్తుంది. అలాగే.. దీపకి అనుమానం వచ్చి దుర్గతో కలిసి ఇంద్రుడి ఇంటికి వెళుతుంది. ఇంట్లోకి వెళ్లకుండా బయటే చంద్రమ్మ అడ్డుపడుతుంది. దాంతో దీప అనమానం ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 4న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
చంద్రమ్మ అనుమతి ఇవ్వకపోవడంతో తన కూతురిని చూడలేకపోయానని బాధ పడుతూ ఇంటికి వస్తుంది దీప. అనంతరం చంద్రమ్మ ఏదో తప్పు చేసిందని, అందుకే తన కూతురిని చూపించట్లేదని అనుమానపడుతుంది దీప. దాంతో.. అలాంటిదేం లేదని అక్కడ సౌర్య ఉండే అవకాశం లేదని చెబుతాడు దుర్గ. అందుకే లేనిపోనివి ఆలోచిస్తూ మోనితని వదిలేస్తున్నావని సలహా ఇస్తాడు దుర్గ.
అక్కడ కార్తీక్‌ని తీసుకుని మోనిత తన కారు దగ్గరకి వస్తుంది. అక్కడికి వెళ్లగానే మెకానిక్ ఏడని అడుగుతాడు కార్తీక్. రిపేర్ చేసి వెళ్లిపోయాడని చెబుతుంది మోనిత. దాంతో.. ‘అప్పుడే రిపేర్ చేశాడా.. కావాలనే ఆటోలో రాడానికి నువ్వే అలా చెప్పొచ్చు కదా’ అని అనుమానపడతాడు కార్తీక్. అంతేకాకుండా.. ఇంద్రుడితో కలిసి మోనిత ఏదో నాటకం ఆడుతుందని అనుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. అనంతరం కార్తీక్ అలా మారిపోడానికి కారణం ఆ వంటలక్కే అనుకుంటూ కోపంగా దీప ఇంటికి వెళుతుంది మోనిత. అది చూసి ఎవరి మీద కోపం అని వెటకారంగా అడుగుతుంది దీప. లోకంలో నాకున్న ఏకైక శత్రువు నువ్వే అని ఆవేశంగా అంటుంది మోనిత. కార్తీక్‌కి ఏం మందు పెట్టావే అని కోప్పడుతుంది మోనిత. దాంతో.. నా మొగుడిని నువ్వు ఎత్తుకుపోయి నన్ను అంటున్నావా అని అంతే కోపంగా అంటుంది దీప. వారిద్దరు కూడా.. కార్తీక్ నా సొంతం అంటే.. నా సొంతం అని వాదులాడుకుంటారు. అంతేకాకుండా.. చంపేస్తానని ఒకరిని మరొకరు బెదిరించుకుంటారు.
ఇంకోవైపు.. దీప వచ్చిన విషయం గురించి మాట్లాడుతుంటుంది చంద్రమ్మ. ఆమె ఏ క్షణమైన రావొచ్చని ఇంద్రుడు రాగానే అదే విషయం చెబుతుంది చంద్రమ్మ. దాంతో.. కార్తీక్ కనిపించిన విషయం ఇంద్రుడు కూడా చెబుతాడు. అంతేకాకుండా.. ఎవరికీ తెలియనంత దూరంగా వెళ్లిపోదామని అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఓ కారు వచ్చి ఆగుతుంది.
మరో వైపు.. సౌర్య గురించే ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది దీప. దుర్గ వచ్చి దీపని ఓదార్చుతాడు. అక్కడ సౌర్య ఉంటే తీసుకొస్తానని ఆవేశంగా వెళుతుంటాడు దుర్గ. ఇంతలో ఎదురుగా కార్తీక్ వస్తాడు. రేపు ఉదయమే దీపతో కలిసి తను వెళ్లి మాట్లాడుతానని చెబుతాడు. సరేనని వెళ్లిపోతాడు దుర్గ. అనంతరం ఆకలేస్తుందని వంట చేయమని దీపకి చెబుతాడు కార్తీక్. దాంతో.. ఇటీవల ఎక్కువగా ఇక్కడే తింటున్నారంటే.. గతం గుర్తొంచ్చిందా అని అనుమానంగా అనుకుంటుంది దీప. అక్కడ మోనితకి కూడా కార్తీక్‌లో మార్పుకి కారణం ఏంటని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది. గతం గుర్తొచ్చిందా అని కంగారుగా అనుకుంటుంది మోనిత. దానికి అస్సలు కారణం ఏంతో తెలుసుకోవాలని అనుకుంటుంది మోనిత.
అక్కడ సౌర్య దగ్గరకి హిమ, ఆనందరావు వస్తారు. సౌర్యని ఇంటికి రమ్మని రిక్వెస్టు చేస్తుంది హిమ. కానీ రానని ఖరాఖండిగా చెబుతుంది సౌర్య. అలాగే.. తన ఇల్లు ఎలా తెలుసని అనుమానంగా అడుగుతుంది సౌర్య. దాంతో.. తమకి తెలుస్తుందని, ఇంటికి రా అని రిక్వెస్టు చేస్తాడు ఆనందరావు. అయినా రానని కోపంగా చెబుతుంది సౌర్య. దాంతో ఈ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.