దీపకి ఆరోగ్య పరిస్థితి బాలేదని తెలుసుకున్న కార్తీక్ ఆమెని హాస్పిటల్‌లో చేరమని చెబుతాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తనకి గతం గుర్తొచ్చిందనే నిజం చెబుతాడు కార్తీక్. కానీ అది వినకుండానే కళ్లు తిరిగిపడిపోతుంది దీప. ఆమెని హాస్పిటల్‌లో చేర్పించి గుండెకి స్టంట్ వేసేందుకు తనే స్వయంగా ఆపరేషన్ చేసేందుకు సిద్ధమవుతాడు కార్తీక్. ఆ తర్వాత నవంబర్ 29న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సౌర్య పోస్టర్‌ని చూసి బాధ పడుతుంటుంది దీప. అప్పుడే వచ్చిన కార్తీక్ ఆ పోస్టర్‌లోని నెంబర్ ఎవరిదో కనుక్కుని సౌర్యని చేరుకుంటానని చెబుతాడు కార్తీక్. అది విని.. తనకేమన్న అయితే సౌర్యని వెతకాలని కార్తీక్‌తో అంటుంది దీప. గతం గుర్తురాకున్న సౌర్య అతని కూతురేనని అంటుంది కార్తీక్‌తో అంటుంది దీప. అది విన్న కార్తీక్ మనసులోనే బాధ పడతాడు. దాన్ని బయటికి చెప్పకుండా దీపకి నయం అయ్యే వరకు మోనితకి తెలియకుండా తనతోనే ఉంటానని అంటాడు కార్తీక్. ఇంతలో దుర్గ ఎలా ఉన్నాడని కార్తీక్‌ని అడుగుతుంది దీప. అది విని.. బానే ఉన్నాడని చెబుతాడు కార్తీక్. దాంతో.. అందరు గుర్తొస్తున్నారని, తరువాత అందరినీ గుర్తు పట్టగలనో లేదోనని చెబుతుంది దీప. అది విని.. ఏం కాదని ఓదార్చుతాడు కార్తీక్.
మరోవైపు.. రాజమ్మ దగ్గర నుంచి కాల్ కోసం ఎదురుచూస్తుంటుంది సౌందర్య. ఇంతలో అక్కడికి వచ్చిన హిమ.. సౌర్య కోసం వెళదామంటుంది. అది విని.. రాజమ్మ ఫోన్ చేయలేదని చెబుతుంది సౌందర్య. దాంతో తననే కాల్ చేయమని చెబుతాడు ఆనందరావు. సౌందర్య ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తుంది. దాంతో అందరు కలిసి ఆమె ఇంటికి బయలు దేరతారు.
అదే సమయంలో బయటికి వెళ్లి వచ్చిన కార్తీక్‌కి దీప కనిపించదు. దాంతో హాస్పిటల్ అంతా వెతుకుతాడు, అక్కడ అందరినీ అడుగుతాడు కార్తీక్. దాంతో దీప పరిస్థితి అసలు బాలేదని బాధగా అనుకుంటాడు కార్తీక్. మరోవైపు.. రాజమ్మ ఇంటికి వెళ్లిన సౌందర్యకి వారు ఇళ్లు ఖాళీ చేశారని చెబుతుంది ఆ ఇంట్లోని మహిళ. అది విని.. రాత్రికి రాత్రే ఖాళీ చేశారా అని అనుమానపడతాడు ఆనందరావు. అతను అదే సౌందర్యకి చెప్పడంతో.. నిజం ఏంటో చెప్పమని లేకపోతే అందరి మీద పోలీసు కంప్లైంట్ చేస్తానని ఆ మహిళతో అంటుంది సౌందర్య. అనంతరం వారు వెళ్లిపోయిన తర్వాత ఆ మహిళ ఇంద్రుడికి కాల్ జరిగిన విషయాన్ని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెబుతుంది. అది విని.. ఏం కాదని సర్ది చెబుతాడు ఇంద్రుడు. అలాగే.. సౌర్యని వాళ్లకి ఇవ్వకూడదని అనుకుంటాడు ఇంద్రుడు.
అదే సమయంలో అమ్మనాన్నని వెతుకుతూ బయటికి వెళుతుంది సౌర్య. అదే సమయంలో ఓ వైపు దీప కూడా సౌర్య గురించే వెతుకుతూ ఉంటుంది. వారిద్దరు ఒకరిని ఒకరు చూసుకోబోతున్న సమయంలో వేగంగా వచ్చిన ఇంద్రుడు, సౌర్యని పక్కకి లాక్కెళ్లిపోతాడు. తనని ఆటోలో తీసుకెళుతుంటాడు సౌర్య. సౌర్యని బయటికి రాకుండా ఎలాగైనా ఆపాలని అనుకుంటాడు ఇంద్రుడు. ఇదే సమయంలో ఆటో సడెన్‌గా ఆగుతుంది. ఎవరని చూస్తే దీప. ఆ సమయంలో నీరసంగా ఉందని ఇంద్రుడు ఓడిలో పడుకుని ఉంటుంది సౌర్య. అందుకే దీపని గుర్తుపట్టిన ఇంద్రుడు ఆటోని పోనియ్యమని డ్రైవర్‌కి చెబుతాడు. దాంతో అతను వెళ్లిపోతాడు.
దీపని వెతుకుతూ కారులో తిరుగుతూ ఉంటాడు కార్తీక్. అదే సమయంలో సౌందర్య, ఆనందరావు కూడా కారులో తిరుగుతూ ఉంటారు. సౌర్య, కార్తీక్, దీప ఎక్కడో ఉన్నారని బాధపడతాడు ఆనందరావు. ఇంద్రుడు చెప్పినట్లు రాజమ్మ అబద్ధాలు ఆడిందని అంటుంది సౌందర్య. అలా అయితే కార్తీక్, దీప బతికి ఉన్నారని వారు చెప్పింది కూడా అబద్దమేనా అంటాడు ఆనందరావు. అది విని.. తను రాకముందే ఎవరికో భయపడి ఊరొదిళి వెళ్లారు కాబట్టి ఆ విషయం నిజమయ్యే అవకాశం ఉందని అంటుంది సౌందర్య. అది విని.. అమ్మనాన్న బతికే ఉన్నారా అని సంతోషంగా అంటుంది హిమ. మరోవైపు.. ఆరోగ్యం బాలేని దీప రోడ్డు పక్కన పడిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.