మోనితకి కార్తీక్ ప్రతి రోజు ఎక్కడికి వెళుతున్నాడని అనుమానం వస్తుంది. దాంతో హాస్పిటల్‌కి వెళుతున్న కార్తీక్‌ని ఫాలో చేస్తుంది మోనిత. ఇంకోవైపు దీపకి ఆరోగ్యం బాగలేకపోవడంతో అలాగే పడుకుని ఉంటుంది. నిద్ర లేచిన కొద్ది సేపటికి కూడా కళ్లు తిరిగి పడిపోతుంది. దాంతో తనకి ఏమైందని కంగారుగా అనుకుంటుంది దీప. ఆ తర్వాత నవంబర్ 22న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
తన ఫొటో, ఫోన్ నెంబర్ ఉన్న పోస్టర్లని జిరాక్స్ తీయడానికి బయటికి వెళుతుంది సౌర్య. ఆ విషయం తెలియని ఇంద్రుడు, చంద్రమ్మ కంగారు పడుతారు. ఇంతలో సౌర్య వచ్చి వారికి అసలు విషయం చెప్పి.. ఆ పోస్టర్లని సంగారెడ్డిలో అతికిద్దమని చెబుతుంది. మొదట షాక్ అయిన ఇంద్రుడు.. మరుసటి రోజు అతికిద్దామని చెప్పి సౌర్యని లోపలికి పంపుతాడు. అదే సమయంలో హాస్పిటల్‌కి వెళ్లి ఆపరేషన్ పూర్తి చేస్తాడు కార్తీక్. అది సక్సెస్ అయిన తర్వాత అక్కడి డాక్టర్‌కి దగ్గరకి వెళ్లి తనకి రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. అయితే కార్తీక్‌ని ఫాలో అవుతూ వెళ్లిన మోనిత మాత్రం అతను ఎక్కడికి తప్పించుకువెళ్లాడని అనుకుంటుంది.
అనంతరం దీప దగ్గరకి ఏమైన ఉన్నాడా అని తన ఇంట్లోకి వెళితే సౌర్య, ఇంద్రుడు, చంద్రమ్మ ఉన్న ఫొటో కనిపిస్తుంది. ఇంతకుముందు ఇంద్రుడు గురించి అడిగిన విషయాన్ని గుర్తు చేసుకుని కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందని అనుకుంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన దీప ఎందుకు వచ్చావని మోనితని ప్రశ్నిస్తుంది. ఇంతలో కార్తీక్ కూడా అక్కడికే వస్తాడు. దాంతో.. వంటలక్క కూతురిని చూశావా కార్తీక్ అని వెటకారంగా అంటుంది మోనిత. అది విని.. తనకి గతం గుర్తొచ్చిందనే విషయం బయటపడకూడదని ‘నీకు తెలుసా అని రివర్స్‌లో ఓ ఆట ఆడుకుంటాడు కార్తీక్. మోనిత వెళ్లిపోయాక తనకి కనిపించకుండా ఫొటోని దాచాల్సిందని దీపకి చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. వారు వెళ్లిపోయక నిలుచుని ఉన్న దీపకి మళ్లీ కళ్లుతిరుగుతాయి. దాంతో తనకేమైందని అనుకుంటుంది దీప.
ఇంకోవైపు.. సౌర్యతో కలిసి పోస్టర్లను అతికించడానికి ఊర్లోని బస్‌స్టాండ్‌కి వెళతాడు ఇంద్రుడు. వాటిని అతికిస్తూ ఈ ఫొటో ఎవరైనా చూస్తే సౌర్యని తీసుకెళ్లిపోతారని బయటపడతాడు ఇంద్రుడు. ఆ పోస్టర్లని అతికించి వెళ్లిపోతారు ఇంద్రుడు, సౌర్య. అనంతరం ఆ పోస్టర్ల మీద నల్ల రంగు పూస్తుంది చంద్రమ్మ. అంతేకాకుండా అలా చేస్తున్నందుకు సౌర్యకి మనసులోనే క్షమాపణలు చెప్పుకుంటుంది. ఇంకోవైపు.. నీరసంగా ఉండడంతో పడుకుని ఉంటుంది దీప. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్, దీపని లేపి ఏమైందని అడుగుతాడు. దాంతో జరిగిన విషయం చెబుతుంది దీప. అది విని.. డాక్టర్ దగ్గరకి వెళదామంటాడు కార్తీక్. దానికి అంతా అనారోగ్యం ఏం లేదని సర్ది చెబుతుంది దీప. అలాగేనని.. సౌర్య గురించి ఆలోచించకుండా ఉండమని చెబుతాడు కార్తీక్. దాంతో.. ఈ రోజు సౌర్యని వెతకడానికి వెళ్లలేకపోయానని బాధ పడుతుంది దీప. దాంతో.. సౌర్యని వెతకడం నా బాధ్యత, అలాగే రేపటికి కూడా ఆరోగ్యం ఇలాగే ఉంటే హాస్పిటల్‌కి రావాలని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. వెళుతూనే గతంలోనూ ఇలాగే అయ్యిందని, జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు కార్తీక్.
ఇంకోవైపు.. ఇంటికి వెళ్లిన మోనితకి ఇంటికి తాళం వేసి ఉండడం చూసి సౌందర్య వచ్చిందేమోనని కంగారు పడుతుంది మోనిత. ఇంతలో కిటీకీలోంచి దుర్గ హాయ్ చెబుతాడు. దాంతో.. తాళం తీయమని కోపంగా అరుస్తుంది మోనిత. దానికి ఇంటి బయట కనిపించిన రక్తం ఎవరిదని అడుగుతాడు దుర్గ. దానికి తనకి తెలియదని ఎప్పటిలాగే బుకాయించే ప్రయత్నం చేస్తుంది మోనిత. అది విని.. ‘నేను లోపల. నువ్వు బయట. దుర్గని లోపల పెట్టి తాళం ఎందుకు వెశావని కార్తీక్ అడిగితే ఏం చెబుతావు. అప్పుడు నీ మీద ఉన్న అనుమానం ఎక్కువవుతుంది’ అని కూల్‌గా అంటాడు దుర్గ. దానికి.. కార్తీక్ తల్లి సౌందర్యని కొట్టాననే నిజం తెలిస్తే నా నెత్తి పగులగొట్టి చంపుతాడని మనసులోనే భయపడుతుంది మోనిత. కానీ బయటికి మాత్రం కోపం తెలియదు అని అరుస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ ‘ఏం తెలియదు మోనిత’ అని అడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.