సౌందర్యని తలపై కొట్టి మత్తులోకి వెళ్లేలా చేస్తుంది మోనిత. అనంతరం శివకి చెప్పడంతో కారులో సౌందర్యని హైదరబాద్‌లో వదిలేసి వస్తాడు. అనంతరం ఇంటికి వచ్చిన శివ ఆమె ఎవరని నిలదీస్తాడు. అతని నోరు మూయించడానికి లక్ష రూపాయల కట్టని ఇస్తుంది మోనిత. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్, శివకి డబ్బులు ఎందుకు ఇస్తున్నావని మోనితని నిలదీస్తాడు. ఆ తర్వాత నవంబర్ 21న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘శివకి ఓకేసారి ఇంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏముంది. ఏ తప్పు పని చేయబోతున్నావు’ అని మోనితని నిలదీస్తాడు కార్తీక్. అది విని.. వంటలక్కని చంపడానికి శివకి సుపారీ ఇస్తున్నానని వెటకారంగా చెబుతుంది మోనిత. అది చూసి.. కంగారు పడతాడు శివ. అయితే.. మోనిత వెంటనే తనకంటే ఆ వంటలక్కకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావని కార్తీక్‌ని నిలదీస్తుంది. అలాగే.. ఆ డబ్బులు బట్టలకి అవసరమైన మెటీరియల్ కోసం ఇస్తున్నానని చాలా తేలిగ్గా అబద్దం చెప్పేస్తుంది మోనిత. వెంటనే కార్తీక్ చేతిలోని డబ్బులని తీసుకుని శివ చేతిలో పెడుతుంది. దాంతో.. మేడం మహా ముదురు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటాడు శివ. ఇంతలో కార్తీక్, శివని ఆపి.. మోనిత చెప్పేది నిజమైతే మేడం మీద ఒట్టేయమని చెబుతాడు. దాంతో.. మోనిత చనిపోయిన పర్లేదు అనుకుని ఒట్టేసి వెళ్లిపోతాడు శివ. అది చూసి.. సంతోషించాలో ఏడవాలో తెలియని స్థితిలో ఉండిపోతుంది మోనిత.
ఇంద్రుడు, చంద్రమ్మకి చెప్పకుండా ఏదో జిరాక్స్ కోసం బయటికి వెళుతుంది సౌర్య. కారులో ఏటో వెళుతున్న కార్తీక్, సౌర్య గురించే ఆలోచిస్తుంటాడు. తాము బ్రతికే ఉన్నామని తెలిసి సౌర్య అక్కడే తమ కోసం వెతుకుతోందని అనుకుంటాడు కార్తీక్. నిజానికి కార్తీక్ హాస్పిటల్‌లో సర్జరీ చేయడానికి వెళుతుంటాడు. ఆ సమయంలో మోనిత అతన్ని ఫాలో అవుతూ వస్తుంటుంది. అది గమనించి కంగారు పడతాడు కార్తీక్. ఇంకోవైపు.. దీప ఇంటికి వెళ్లి ఆమె ఇంకా పడుకుని ఉండడం చూసి ఆమెని లేపుతాడు దుర్గ. నిద్ర లేచి ఆరోగ్యం బాగాలేదని చెబుతుంది దీప. దాంతో.. దుర్గనే దీప కోసం టీ పెడతాడు. ఆ సమయంలో ఇంతకుముందు తాను, కార్తీక్ ఇంట్లో ఉండగా.. బయట ఎవరిదో రక్తం ఉందని, అది ఎవరిదోనని అనుమానపడుతుంది దీప. మోనిత అసలు ఎవరిని కొట్టిందని దుర్గతో అంటుంది దీప. అదే సమయంలో.. మోనిత వెంటబడుతుండడంతో ఆమె నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటాడు కార్తీక్. మరోవైపు.. హస్పిటల్లో పేషెంట్ పరిస్థితి సిరీయస్‌గా ఉంటుంది.
మోనిత తన తల మీద కొట్టిన విషయం గురించే ఆలోచిస్తుంటుంది సౌందర్య. ఆ ఇంట్లో ఏముందని తనని కొట్టిందని అనుమానపడుతుంది. అదే సమయంలో మోనిత కొడుకు ఆనంద్‌ని చూస్తూ.. తన చేసిన మోసం గురించి మాట్లాడుతుంటుంది సౌందర్య. ఇంతలో అక్కడికి వచ్చిన ఆనందరావు.. పసివాడితో ఏం మాట్లాడుతున్నావని అడుగుతాడు. దాంతో.. వీడు మోనిత దురాశకి పుట్టిన అకారణజన్ముడు అని బాధగా అంటుంది సౌందర్య. వీడు మన రక్తం అని ఫీల్ అయినట్లు మోనితలో ఏ ఆలోచన లేదా అని అంటుంది సౌందర్య. దాంతో.. కార్తీక్ నిజంగా బతికే ఉండి ఉండొచ్చని అనుమానంగా అంటాడు ఆనందరావు.
అక్కడ ఇంటి దగ్గర కార్తీక్, మోనిత ఎక్కడికి వెళ్లారని ఆలోచిస్తుంటుంది దీప. సౌర్యని వెతకడానికి తనకి శక్తి సరిపోట్లేదని బాధగా అనుకుంటుంది. కొంచెం తిని సౌర్యని వెతకడానికి వెళ్లడానికి సిద్ధమవుతుంది దీప. కానీ కళ్లు తిరిగి కిందపడిపోతుంది. ఇంకోవైపు.. సౌర్య ఎక్కడ ఉందని చంద్రమ్మని అడుగుతాడు ఇంద్రుడు. సౌర్యని వెతుకుతూ తన ఫ్యామిలీ వారు వస్తే పరిస్థితి ఎంటని ఇద్దరు కంగారు పడతారు. ఇంతలో అక్కడికి వస్తుంది సౌర్య. జిరాక్స్ షాపుకి వెళ్లిన విషయం చెప్పి తన ఫొటో, ఫోన్ నెంబర్ రాసి ఉన్న పేపర్లని చూపిస్తుంది సౌర్య. అది చూసి షాక్ అవుతాడు ఇంద్రుడు. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి ఎపిసోడ్‌లో చూడండి.