మనసు మారిన ఇంద్రుడు, సౌర్యని కార్తీక్, దీపకి ఇచ్చేదామని అనుకుంటాడు. వారిని ఇంటికి తీసుకెళతాడు. అయితే.. చంద్రమ్మ మాత్రం సౌర్యకి బదులు వేరే అమ్మాయిని జ్వాల అని చూపిస్తుంది. ఇంద్రుడు ఏమైపోతాడోననే భయంతో అలా చేసినట్లు భర్తకి చెబుతుంది చంద్రమ్మ. అక్కడ దీప మాత్రం సౌర్య కాకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత నవంబర్ 2న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఇంద్రుడి దగ్గర సౌర్య ఉంటుందనే ఆశతో వెళ్లిన అక్కడ సౌర్య లేకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. దాంతో అసలు సౌర్య ఈ ఊళ్లోనే ఉందా అని అంటుంది దీప. దానికి.. సౌర్య ఇక్కడే ఉందని అంటాడు కార్తీక్. దాంతో.. మీకెలా తెలుసు డాక్టర్ బాబు అని అడగడంతో.. హిమ కాకుండా సౌర్య మాత్రమే ఇక్కడ మాత్రమే ఉన్నట్లు ఎందుకు అనిపించింది అని అడుగుతాడు కార్తీక్. బిడ్డ ఉనికి తల్లికి తెలుస్తుందని చెబుతాడు. నిజమే కదా అనుకుంటుంది దీప.
ఇంకోవైపు.. ఫంక్షన్ కోసం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని బాబాయ్, పిన్నిని నిలదీస్తుంది సౌర్య. దాంతో.. తడబడుతూ చిన్న పిల్లలకు అవసరం లేదని అంటుంది చంద్రమ్మ. దాంతో.. దొంగతనం చేశారా.. లేక వ్యాపారం కోసం తెచ్చిన డబ్బులు వాడారా అని ప్రశ్నిస్తుంది సౌర్య. దానికి.. ‘అదేం లేదమ్మా.. మంచి వ్యక్తులు ఎవరో ఇచ్చారు’ అని కవర్ చేస్తాడు ఇంద్రుడు. అనంతరం.. ఫంక్షన్‌కి వస్తే ఎంత ఆనందించో వారో కదా అని బాధగా అంటుంది సౌర్య.
మరోవైపు.. సౌర్య గురించే దుర్గకి బాధపడుతూ చెబుతుంటుంది దీప. దాంతో.. అన్ని అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుందని సముదాయించే పని చేస్తాడు దుర్గ. కానీ.. కష్టాలు మాత్రమే ఉన్నాయని ఏడుస్తూ అంటుంది దీప. దానికి.. కార్తీక్‌కి గతం గుర్తొస్తే అన్ని సర్దుకుంటాయని చెబుతాడు దుర్గ. అనంతరం వాణి గురించి అడుగుతుంది దీప. దాంతో జరిగిన విషయం చెబుతాడు దుర్గ. మోనితనే వాణిని దుర్గని, దీపని చంపడానికి నియమించిందని చెబుతాడు దుర్గ. మోనితకి బుద్ది చెప్పాలని అనుకుంటుంది దీప.
అక్కడ మోనిత మాత్రం.. వాణి గురించి దుర్గకి తెలిసిపోయిన విషయం గురించి ఆలోచిస్తుంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన శివని.. కార్తీక్, దీప గురించి ఆరా తీస్తుంది. దీపని ఇంటి దగ్గర దింపి ఎక్కడికో వెళ్లాడని చెబుతాడు శివ. దాంతో.. సౌర్యని కలిస్తే నిజం తెలిసిపోయిందా అని భయపడుతుంది మోనిత. అదే జరిగితే తిన్నగా తన దగ్గరకి వచ్చి తన చెంప పగులగొడతాడు కదా అని అనుకుంటూ ఉంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన దీప.. మోనిత చెంప పగుల గొడుతుంది దీప. తనని చంపడానికి వాల్తేరు వాణి పురమాయిస్తావా అని కోపంగా అంటుంది దీప. దాంతో.. ‘అవును.. కార్తీక్‌ని దూరం చేయాలని చూస్తే చంపేస్తాను’ అని అంటుంది మోనిత. అలాగే.. కార్తీక్ మీద పూర్తి హక్కు తనదని చెబుతుంది మోనిత. ‘నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేయలేవు’ అని అంటుంది దీప. డాక్టర్ బాబు వచ్చిన తర్వాత నీ అంతు తెలుస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప.
అక్కడ సౌర్యకి భోజనం తినిపిస్తుంటుంది చంద్రమ్మ. బయట ఉన్న ఇంద్రుడు ఫంక్షన్‌కి సంబంధించిన డబ్బులను సెటిల్ చేస్తుంటాడు. ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి ఇంద్రుడితో మాట్లాడాలి అంటాడు. పక్కకి తీసికెళ్లి విషయం ఏంటని అడుగుతాడు ఇంద్రుడు. దాంతో.. వారణాసి ఫొటో చూపించి ‘నీకు తెలుసా’ అని అడుగుతాడు కార్తీక్. అతన్ని గుర్తు పట్టిన ఇంద్రుడు షాకై.. చూడలేదని చెబుతాడు. సౌర్య ఫొటో చూపిస్తే తనని కూడా చూడలేదని చెబుతాడు ఇంద్రుడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. అనంతరం ఇంట్లోకి వెళ్లిన ఇంద్రుడు.. ఆ అంకుల్‌యే ఫంక్షన్‌కి డబ్బులు ఇచ్చాడని చెబుతాడు. అనంతరం చంద్రమ్మకి సీక్రెట్‌గా ‘వారణాసి గురించి కార్తీక్ అడిగాడని చెబుతాడు ఇంద్రుడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.