గత ఎపిసోడ్‌లో సౌర్యని కలిసిన సౌందర్య హైదరాబాద్‌కి రావాల్సిందేనని ఖరాఖండిగా చెబుతుంది. సౌర్య ఎంత రిక్వెస్ట్ చేసిన ఒప్పుకోదు. సౌర్య వాళ్లని అక్కడే ఉండమని చెప్పి మోనిత ఇంటికి వెళుతుంది సౌందర్య. ఆమె ప్రవర్తనతో అనుమానం వచ్చి తన ఇంటి తలుపుకి వేసున్న తాళాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తుంటుంది సౌందర్య. అప్పుడే ఆ ఇంట్లోనే కార్తీక్, దీప ఉండటాన్ని గమనించిన మోనిత.. సౌందర్య తలపై కర్రతో కొట్టడంతో ఆమె మత్తులోకి వెళుతుంది. అనంతరం శివకి చెప్పి కారులో హైదరాబాద్‌కి పంపించేస్తుంది. అనుమానంతో బయటికి వచ్చిన దీప, కార్తీక్ నేల మీద రక్తపు మరకలు కనిపిస్తాయి. దాంతో.. ఎవరు వచ్చారని ఆలోచిస్తుంటాడు కార్తీక్. ఆ తర్వాత నవంబర్ 19న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
బంధువుల ఇంట్లో ఉన్న సౌర్య, సౌందర్య కోసం ఎదురుచూస్తుంటుంది. నాన్నమ్మ వస్తే ఆమెకి నిజం చెప్పి సంగారెడ్డి వెళదామంటుంది సౌర్య. దాంతో.. కంగారుగా ఇంద్రుడు కోసం ఎదురుచూస్తుంటుంది చంద్రమ్మ. ఇంతలో అతను రావడంతో.. వెంటనే అతని దగ్గరకి వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతుంది. అదే జరిగితే సౌర్యని వారికి ఇవ్వాల్సి వస్తుందని బాధపడతారు ఇంద్రుడు, చంద్రమ్మ. అందుకే ఏం చేయలా అని ఇంద్రుడు ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఓ ఐడియా వస్తుంది. అనుకున్నదే తడవుగా సౌర్య దగ్గరకి వెళ్లి ‘మీ నాన్నమ్మ రానని చెప్పింది’ అని అబద్దం చెబుతాడు. దాంతో.. నాన్నమ్మ, తాతయ్య తనని మర్చిపోతున్నారా అని బాధగా అంటుంది సౌర్య. దానికి.. నీ బాధ అర్థం చేసుకుని నిన్ను బలవంతం చేయడం ఇష్టం లేక అలా చేసుండొచ్చని చెప్పి సౌర్యని తీసుకెళ్లిపోతారు చంద్రమ్మ, ఇంద్రుడు.
హైదరాబాద్‌లో తన ఇంట్లో ఉన్న సౌందర్య, మోనిత గురించే ఆలోచిస్తుంటుంది. ఇంతలో ఆనందరావు అక్కడికి వచ్చి ఎలా ఉందని అడుగుతాడు. దాంతో.. కార్తీక్, దీప బతికే ఉన్నారేమోనని, అందుకే మోనిత ఇలా ప్రవర్తించిందని అనుమానపడుతుంది సౌందర్య. సౌర్య చెప్పింది నిజమే కావొచ్చని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. అది విని.. నిజాన్ని బయట పెట్టేందుకు ఓ ఉపాయం ఆలోచించమని సలహా ఇస్తాడు ఆనందరావు. అదే సమయంలో.. కార్తీక్ గతం గుర్తొచ్చిందో లేదోనని నిజం తెలిసేలా చేయమని, ఆ విషయంలో క్లారిటీ ఇవ్వమని దేవుడికి దండం పెడుతుంటుంది మోనిత. ఇంతలో అక్కడిక వచ్చిన దుర్గ నాకో విషయంలో క్లారిటీ ఇవ్వమని దేవుడిని కోరుకుంటాడు. అది చూసి.. తననేందకు ఇబ్బంది పెడుతున్నావని బాధగా అంటుంది మోనిత. దాంతో.. తలుపు బయట దీప, కార్తీక్‌కి కనిపించిన రక్తం ఎవరిదని అడుగుతాడు దుర్గ. తనకి ఎవరో ఒకరిని కొట్టడమే పనా అని వెటకారంగా అంటుంది మోనిత. అది విని.. నువ్వు అలాంటి దానివే అని అదే స్థాయిలో సమాధానం చెబుతాడు దుర్గ. అలాగే.. కార్తీక్‌కి నిజం చెప్పి అక్కడిని నుంచి వెళ్లిపోమ్మని చెబుతాడు దుర్గ. అది జరగని పనని చెబుతుంది మోనిత. అయితే నిన్ను ఇలాగే టార్చర్ పెడుతుంటానని చెప్పి వెళ్లిపోతాడు దుర్గ. అతని మాటలు విని చిరాకు పడుతుంది మోనిత.
మరోవైపు.. తలపై దెబ్బ గట్టిగా తగిలిందని, మూడు రోజులైన రెస్టు తీసుకోవాలని సౌందర్యకి చెబుతుంది డాక్టర్. దెబ్బ ఎలా తగిలిందని డాక్టర్ అడిగితే నిజం చెబుతుంది సౌందర్య. దాంతో.. నమ్మని డాక్టర్ నవ్వేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అనంతరం సౌర్య చెప్పినట్లు కొడుకు, కోడలు బతికే ఉన్నారని సంతోషపడతారు సౌందర్య, ఆనందరావు. అదే నిజమైతే.. వారు తమ దగ్గరకి ఎందుకు రాలేదని సందేహపడతారు. త్వరలోనే వెళ్లి మోనిత సంగతి తేల్చుతానని ఆనందరావుకి చెబుతుంది సౌందర్య. అదే సమయంలో.. సౌందర్య గురించే ఆలోచిస్తుంటుంది మోనిత. అప్పుడే కార్తీక్, దీప తన ఇంట్లో ఏం చేస్తున్నారని, అంత క్లోజ్ ఎలా అయ్యారని సిరీయస్‌గా ఆలోచిస్తుంటుంది మోనిత. కార్తీక్‌ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఇంతలో అక్కడి వచ్చిన శివ.. అసలు ఆమె ఎవరు, ఆమె తల ఎందుకు పగులగొట్టారని అడిగితే పట్టించుకోదు. ఇలాగే ఉంటే నేను ఇక్కడ పని చేయలేనని అంటాడు శివ. అది విని.. నిజం తెలుసుకోకపోవడమే నీకు మంచిదని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చి ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు వేయ్యేద్దని అంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్.. ఎందుకు అంత డబ్బు ఇస్తున్నావని, ఏం తప్పు పని చేయబోతున్నావని అంటాడు కార్తీక్. దానికి వంటలక్కని చంపేయమని సుపారీ ఇస్తున్నానని కోపంగా అంటుంది మోనిత. అది విని శివ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.