చంపాలని చూసిందని తెలిసి మోనితతో తాడోపేడో తేల్చుకోవాలని.. తన ఇంటి వద్దే కోపంగా ఎదురు చూస్తుంటుంది దీప. కార్తీక్ కూడా ఆమె పక్కనే ఉంటాడు. మోనితతో కలిసి తన ఇంటికి బయలుదేరిన సౌందర్యకి సౌర్య కనిపిస్తుంది. దాంతో తనతో మాట్లాడి సౌర్య వాళ్లతో కలిసి తన ఇంటికి వెళుతుంది సౌందర్య. అలాగే.. సౌందర్య నుంచి తప్పించుకుని వచ్చిన మోనితకి ఇంటికి తాళం వేసుండడం కనిపిస్తుంది. ఆ తర్వాత నవంబర్ 18న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఇంటికి రమ్మని సౌర్యని బ్రతిమిలాడుతుంటుంది సౌందర్య. సౌర్య తల్లిదండ్రులు చనిపోయారని తెలిసి కూడా తనని ఎందుకు తనని ప్రొత్సహిస్తున్నారని ఇంద్రుడు, చంద్రమ్మని కోప్పడుతుంది సౌందర్య. అలాగే.. తనతో కలిసి హైదరాబాద్‌కి బయలుదేరాలని ఖరాఖండిగా చెబుతుంది సౌందర్య. పని ఉందని చెప్పి బయటికి వెళుతుంది సౌందర్య. నిజానికి అది ఇంద్రుడికి తెలిసిన వారి ఇళ్లు కావడంతో.. సౌందర్య వచ్చేలోపు వెళ్లిపోదామని అనుకుంటారు వారు. ఇంకోవైపు.. మోనిత ఇంటికి తాళం వేసి తన ఇంట్లోనే కూర్చుని ఉంటారు దీప, కార్తీక్. మోనిత లోపలికి వస్తే తన సంగతి చూస్తానని కార్తీక్‌తో అంటుంది దీప. కార్తీక్ కూడా నీ ఇష్టమని అంటాడు. అది చూసి అతనికి గతం గుర్తొచ్చిందని గట్టిగా అనుకుంటుంది దీప.
అప్పడు దీప, కార్తీక్ ఎక్కడికి వెళ్లిపోయారని బయటే ఉన్న మోనిత కంగారు పడుతుంటుంది. ఇంతలో అక్కడి సౌందర్య వచ్చి ఏమైందని అడగగా.. ఇంటి తాళాలు పోయాయని అబద్దం చెబుతుంది మోనిత. దాంతో.. తనతో పాటు హోటల్కి రమ్మని అంటుంది సౌందర్య. దానికి కారు తాళాలు లేవని చెబుతుంది మోనిత. కోపం వచ్చిన సౌందర్య, మోనిత చెంప మీద లాగి పెట్టి కొడుతుంది. మోనిత తన దగ్గర కావాలనే ఏదో దాస్తుందనే అనుమానంతో ఇంటి తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంతలో లోపలికి తొంగి చూసిన మోనితకి దీప, కార్తీక్ కనిపిస్తారు. దాంతో.. ఏం చేయాలో తెలియని మోనిత పక్కనే ఉన్న దుంగ తీసుకుని సౌందర్య నెత్తి మీద కొట్టడంతో.. ఆమె మత్తులోకి పోతుంది.
ఇంకోవైపు.. నాన్నమ్మకి అబద్దం చెప్పినందుకు చంద్రమ్మ దగ్గర చెప్పి బాధ పడుతుంటుంది సౌర్య. దాంతో.. అమ్మనాన్న దొరికిన తర్వాత అన్ని సర్దుకుంటాయని చెబుతుంది చంద్రమ్మ. దాంతో.. నాన్నమ్మ వచ్చే వరకు ఆగి రిక్వెస్ట్ చేసి సంక్రాంతికి వస్తానని స్వారీ చెప్పాలని అంటుంది సౌర్య. అది విని సౌందర్య వస్తే బలవంతంగా సౌర్యని తీసుకెళ్లిపోతుందని బాధపడిపోతుంది చంద్రమ్మ. అదే సమయంలో ఇంక తలుపు బద్దలు కొట్టట్లేదేంటని అనుమానపడుతుంది దీప. ఏదో జరిగి ఉంటుందని అనుకుంటుంది దీప. ఆ సమయంలో మోనిత చెప్పడంతో దెబ్బ తగిలిన సౌందర్యని కారులో హైదరాబాద్‌లో తీసుకెళుతుంటాడు శివ. దాంతో.. అసలు ఆమె ఎవరని అనుమానపడుతుంటాడు శివ. ఆమెకి ఏమైన అయితే తన పని ఖతం అని కంగారు పడుతుంటాడు.
వెనుక దారి నుంచి బయటికి వచ్చిన దీప, కార్తీక్కి అక్కడ ఎవరు కనిపించరు. కానీ నెలపై పడున్న రక్తం మరకలు కనిపిస్తాయి. అవి చూసి మోనిత ఎవరినైనా కొట్టిందా అని కంగారు పడుతుంది దీప. తను తప్పు చేస్తుంటే ఆపినవాళ్లని కావొచ్చు.. లేదా మనల్ని చూడకూడకుండా ఉండడానికి కావొచ్చు అని అనుమానంగా అంటాడు కార్తీక్. అలాంటి వారు ఎవరు ఉంటారని అడుగుతుంది దీప. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత.. ‘నా మొగుడితో ఏం చేస్తున్నావు’ అని కోపంగా అరుస్తుంది మోనిత. దాంతో.. ఈ రక్తం ఎవరిదని దీప అడిగితే.. ఎవరిని కొట్టావని కోపంగా అడుగుతుంది దీప. దాంతో మీరే ఏవరినో కొట్టారా అని రివర్స్ లో ప్రశ్నిస్తుంది మోనిత. దానికి.. నీలాంటి వాళ్లం కాదని, నువ్వే ఎవరినో ఏదో చేశావని కోపంగా అంటుంది దీప. ఇంతలో దీపకి సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్లమని చెబుతాడు కార్తీక్. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప. మోనితకి కూడా కొప్పడి లోపలికి పంపిన కార్తీక్.. తర్వాత ఆ రక్తం ఎవరిదని అనుమానపడుతుంటాడు. అది తన తల్లి సౌందర్య రక్తం అని కార్తీక్కి తెలుస్తుందా లేదా అని తర్వాతి ఎపిసోడ్‌లో చూడండి.