దీపని చంపడానికి ప్రయత్నించిందని తెలిసి మోనితని నిలదీస్తాడు కార్తీక్. అది చూసి మోనితకి కార్తీక్ మీద అనుమానం ఇంకా బలపడుతుంది. దాంతో ఏదేదో చెప్పి కవర్ చేస్తాడు. ఆ రోజే సౌర్య, ఇంద్రుడు, చంద్రమ్మ పని మీద ఆ ఊరు వస్తారు. అదే రోజు మోనిత కోసం అక్కడికి వస్తుంది సౌందర్య. ఆ తర్వాత నవంబర్ 17న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఆటోలో వెళుతున్న సౌర్యకి ఆ ఊరిలోనే ఉంటే బావుంటుందని అనిపిస్తుంది. అదే ఇంద్రుడుతో అంటే.. తనకి ఇష్టమైతే అక్కడే ఉందామంటాడు. అది విని.. ఈ ఊర్లోనే ఉంటే ఈ సారి నాన్నమ్మ వచ్చి చేతులు, కాళ్లు కట్టేసి తీసుకెళుతుందని, అందుకే అక్కడు ఉండొద్దని అంటుంది సౌర్య. అది విని.. సంతోషంగా ఫిల్ అవుతాడు ఇంద్రుడు. ఇంకోవైపు.. మోనిత కోసం కోపంగా ఎదురు చూస్తుంటుంది దీప. ఆమె పక్కనే కార్తీక్ కూడా కూడా ఉంటాడు. తన ప్రాణాలు తీయడానికి మోనిత ప్రయత్నాలు చేస్తుందని కోపంతో ఊగిపోతుంటుంది దీప. దానికి.. తను చూసుకుంటానని అంటాడు కార్తీక్. అది విని.. ఎప్పటి వరకూ నా ప్రాణాలు కాపాడగలుగుతారని అంటుంది దీప. అందుకే మోనితతో అటో ఇటో తేల్చేయాలని అనుకుంటుంది దీప.
మరోవైపు.. మోనిత కారులో ముందుకు వెళుతుండగా.. వెనుక మరో కారులో సౌందర్య ఫాలో అవుతుంటుంది. దాంతో.. సౌందర్య ఇంటికి వస్తే కార్తీక్‌గానీ, దీపగానీ కనిపిస్తే అంత చెడిపోతుందని మనసులో కంగారుగా అనుకుంటుంది మోనిత. అక్కడ సౌందర్య కూడా.. మోనిత ప్రవర్తనలో ఏదో తేడా ఉందని, అందుకే అంతగా కంగారు పడుతోందని అనుకుంటుంది. అదే సమయంలో.. ఓ పార్లర్‌లో కూర్చుని ఐస్‌క్రీమ్ తింటూ ఉంటుంది సౌర్య. అది సౌందర్య చూసేస్తుంది. అందుకే అక్కడే ఆగిపోతుంది సౌందర్య. అదే సందర్భమని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత. అక్కడ ఇంటి దగ్గర మోనిత కోసమే ఎదురు చూస్తుంటారు దీప, కార్తీక్. దీపని ఎలా ఆపాలి అని ఆలోచిస్తుంటాడు కార్తీక్. అదే సమయంలో కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందా లేదా అని కన్‌ఫార్మ్ చేసుకోవాలని అనుకుంటుంది దీప. అందుకే మోనిత, కార్తీక్ ఫొటోని పగులగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అది గమనించిన దీపని నిలవరిస్తాడు కార్తీక్. అది చూసి చాలా ఫీల్ అయిపోతుంది దీప. అందుకే మోనితనే నిజం ఒప్పుకునేలా చేస్తానని అంటుంది దీప.
అయితే.. సౌర్యని ఇంటికి రమ్మని కోపంగా అంటుంది సౌందర్య. దానికి.. అమ్మనాన్న దొరికిన తర్వాతే ఇంటికి వస్తానని అంటుంది సౌర్య. అది విని.. వారు చచ్చిపోయారని కోపంగా అంటుంది సౌందర్య. అలాగే.. ఇంద్రుడు, చంద్రమ్మ తనని ఏదో మాయ చేశారని అరుస్తుంది సౌందర్య. అది విని.. పెద్దమనిషి ఫంక్షన్ కూడా చేశారని, చాలా మంచి వారని అంటుంది సౌర్య. దాంతో.. సౌర్యని కౌగిలించుకుని వారి ఇంటికి తీసుకెళ్లమని చెప్పి.. వారితో కలిసి వెళుతుంది సౌందర్య.
సౌందర్య నుంచి తప్పించుకున్న మోనిత తన ఇంటికి వస్తుంది. కారు దిగి ఇంట్లోకి వెళుతూ ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. అయితే.. అక్కడి ఇంటికి తాళం వేసి ఉండడం చూసి షాక్ అవుతుంది. కార్తీక్, దీప దగ్గరకి వెళ్లుంటాడని.. దీప ఇంటికి వెళితే ఆ ఇంటికి కూడా తాళం వేసి ఉంటుంది. ఇంతలో దుర్గ వచ్చి మోనిత కారు తాళాలు తీసుకుని వెళ్లిపోతాడు. అక్కడ సౌర్యతో ఫంక్షన్ గురించే మాట్లాడుతూ బాధ పడుతుంటుంది సౌందర్య. అలాగే.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని ఇంద్రుడు, చంద్రమ్మని నిలదీస్తుంది సౌందర్య. అంతేకాకుండా.. సౌర్యని హైదరాబాద్ తీసుకెళతానంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.