కార్తీక పౌర్ణమి సందర్భంగా కొలనులో దీపాలు వదలడానికి వెళుతుంది దీప. ఇంతలో వెనుకగా వచ్చిన మోనిత తనని నదిలోకి తోసి చంపేయాలని అనుకుంటుంది. అది గమనించిన కార్తీక్.. మోనితని అక్కడి నుంచి లాక్కెళతాడు. దీపకి సపోర్టు చేస్తున్న కార్తీక్‌ని చూసి కోపంతో ఊగిపోయి ఇద్దరినీ తిడుతుంది మోనిత. ఆ తర్వాత నవంబర్ 15న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
గుడిలో జరిగిన విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. కార్తీక్ ప్రవర్తన చూసి అతనికి గతం గుర్తొచ్చిందా లేదా అని అనుమానపడుతుంది మోనిత. ఇంతలో కార్తీక్‌కి ఓ ఫోన్ వస్తుంది. ఫోన్‌లో మాట్లాడుతూ.. అన్ని సిద్ధం చేసుకోండి వస్తాను అంటాడు కార్తీక్. అది విని ఎవరితో మాట్లాడుతున్నాడు అని అనుమానంగా అనుకుంటుంది మోనిత. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి.. ఆనంద్ ఎక్కడ అని అడుగుతుంది. అది విని.. ‘24 గంటల తర్వాత వాడి గురించి అడుగుతున్నావా.. దీప చుట్టు తిరుగుతున్నావని నా ఫ్రెండ్‌కి ఇచ్చేశాను’ అని అంటుంది మోనిత. ఆమె వేరే దేశం తీసుకెళ్లిందని అబద్దం చెప్పేస్తుంది. దీంతో ఏ మాట్లాడో తెలియని కార్తీక్.. సైలెంట్ అయ్యిపోతాడు. కానీ.. తనకి గతం గుర్తొచ్చిందనే అనుమానంతో అలా ప్రవర్తిస్తోందా అని అనుకుంటాడు కార్తీక్.
ఇంకోవైపు.. ‘డాక్టర్ బాబులో మార్పు వచ్చిందని నీకు అనిపిస్తోందా.. ఆయన గతం గుర్తొచ్చినట్లు అనిపిస్తుంది’ అని దుర్గని అడుతుంది దీప. తనకి అలా ఏం అనిపించట్లేదని అంటాడు దుర్గ. ‘ఆయనకే గతం గుర్తొస్తే మీ కుటుంబాన్ని ఇన్ని కష్టాలు పెట్టిన మోనితని వదిలేస్తాడా’ అని అంటాడు. మోనిత మీద కోపంతో తన మీద అభిమానం చూపిస్తున్నాడని చెబుతాడు దుర్గ. మరోవైపు.. పని మీద ఊరికి వెళ్లిన సౌందర్య ఇంటికి వస్తుంది. రాగానే.. అందరూ కలిసి మోనిత గురించి, ఆనంద్ గురించి మాట్లాడుకుంటారు ఆనందరావు, సౌందర్య, హిమ. అలాగే.. ఏం ఆలోచించకుండా బాగా చదువుకోమని హిమకి చెబుతాడు ఆనందరావు. దానికి.. ముందు సౌర్యని తీసుకురావడానికి ఏదో ఒకటి చేయమని అంటుంది హిమ.
బట్టలు ఊతుకుతూ మోనితని దుర్గ దగ్గర తిడుతుంటుంది దీప. తనని చంపడానికి వాల్తేరు వాణిని మాట్లాడిందని అంటుంది దీప. ఇదంతా అటుగా వెళుతున్న కార్తీక్ చెవిలో పడుతుంది. అసలేం అయ్యిందని అడుగుతాడు కార్తీక్. దాంతో.. జరిగిన విషయాలను పూస గుచ్చినట్లు చెబుతుంది దీప. అది విని.. మోనితని కంట్రోల్ చేయకపోతే దీప ప్రాణాలకి ప్రమాదం అని మనసులో అనుకుంటాడు కార్తీక్. ఇంతలో.. తన జీవితం ఏటు వెళుతుందో, ఏమౌతుందో అర్థం కావట్లేదని బాధ పడుతుంది దీప. అలాగే.. ‘మోనిత నా మీద ఇన్నిసార్లు హత్యాయత్నాలు చేయడానికి కారణం ఏంటో ఆలోచించారా. నేను మీ భార్యని కాబట్టే అలా చేస్తుందని అర్థం కావట్లేదా’ అని అంటుంది కార్తీక్. అది విని సైలెంట్‌గా వెళ్లిపోతాడు కార్తీక్.
హైదరాబాద్‌లో మోనిత ప్రవర్తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆనందరావు, సౌందర్య. మన దగ్గర ఏదో దాస్తోందని అనుమానంగా అంటాడు ఆనందరావు. తనకి అదే అనుమానంగా ఉందని, వెంటనే అక్కడికి వెళతానని అంటుంది సౌందర్య. అలాగే.. సౌర్య గురించి కూడా ఆలోచించాలని చెబుతుంది. దీపని చంపడానికి ప్రయత్నించిన మోనితని తిడుతుంటాడు కార్తీక్. అయినా తనేం చేయలేదని బుకాయించే ప్రయత్నం చేస్తుంది మోనిత. అంతేకాకుండా.. తన మీద కంటే దీప మీదే ఎక్కువగా కేరింగ్ ఉంటున్నావని రివర్స్‌లో నిలదీస్తుంది మోనిత. దాంతో.. మోనితకి తన మీద అనుమానం వచ్చిందని కన్‌ఫార్మ్ చేసుకున్న కార్తీక్.. కవర్ చేయడానికి ఫిక్స్ అవుతాడు. అందుకే.. ‘నా భార్య మంచిగా ఉండాలని అలా బిహేవ్ చేశాను. నువ్వు నిజంగా చనిపోవని తెలిసి అలా కామ్‌గా ఉండిపోయాను’ అని ఏవేవో కథలు చెబుతాడు కార్తీక్. అంతేకాకుండా.. నువ్వు నిజంగా నా భార్య అయితే వంటలక్క మీద ఎందుకు పగబట్టావు అని వెటకారంగా అంటాడు కార్తీక్. అది నిజం కాదని తనే కార్తీక్ భార్యని అని చెబుతుంది మోనిత. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.