మోనిత దగ్గర నుంచి ఆనంద్ ని తీసుకెళ్లడానికి ఆనందరావు, హిమ వస్తారు. అతన్ని చూసి కంగారు పడిన మోనిత, కార్తీక్ ని అక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమెని నమ్మని కార్తీక్ ఇంట్లోకి వెళతారు. అయితే.. విషయం అర్థం చేసుకున్న ఆమె దగ్గర పని చేసే శివలత ఆనందరావు, హిమని వెనుక డోర్ నుంచి పంపిస్తుంది. దాంతో ఊపిరి పీల్చుకుంటుంది మోనిత. ఆ తరవాత నవంబర్ 12న ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
ఇంద్రుడు, చంద్రమ్మ ప్రవర్తన మీద సౌర్యకి అనుమానం వస్తుంది. అదే మాట వారితో చెప్పి.. మీరు మారిపోయారు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. అది చూసి ఫీల్ అవుతాడు ఇంద్రుడు. అప్పుడు జ్వాల కోసం తప్పదు అని సర్ది చెబుతుంది చంద్రమ్మ.
కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించడానికి కార్తీక్, స్టాఫ్ నీ తీసుకొని వెళుతుంది మోనిత. నువ్వు సంతోషంగా ఉందని మోనిత చెబుతుండగా వినకుండా అక్కడి నుంచి గుడిలోనే ఉన్న దీపని వెతకడానికి వెళ్లిపోతాడు కార్తీక్. దాంతో అతన్ని వెట్టుకుంటు వెళ్లిన కార్తీక్ కి ఓ చోట అతను కనిపిస్తాడు. దాంతో తనతో ఉండమని దీనంగా బ్రతిమిలాడుతుంది మోనిత. దాంతో తన కర్చీఫ్ ఉంటే తను ఉన్నట్లే అని చెప్పి.. కర్చీఫ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కార్తీక్. అది చూసి చిరాకు పడుతుంది మోనిత.
అనంతరం అదే గుడిలో దీపాలు వెలిగిస్తున్న దీప దగ్గరికి వెళ్లి తనతో కలిసి దీపాలు వెలిగిస్తుంటాడు కార్తీక్. అది చూసిన మోనిత కోపంతో ఊగిపోతూ.. దీపని చంపాలని అనుకుంటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళబోతుండగా అప్పుడే వచ్చిన శివలత ఆమెని పక్కకి లాక్కెళ్లిపోతుంది. గుడిలో అందరూ ఉన్నారని బావుండదు అని సర్ది చెబుతుంది. కార్తీక్, మోనిత భర్త కాదనే విషయం తెలియని శివలత.. కార్తీకదీపం వెలిగిస్తే కార్తీక్ తన సొంతమే అవుతాడని చెబుతుంది. అది చూసి.. కార్తీక్, దీపకే నిజమైన మొగుడు కాబట్టి దాన్ని దీపం పెట్టకుండా ఆపాలి అనుకుంటుంది మోనిత.
రాత్రి కాగానే దీపాలు నదిలో వదలడానికి వెళుతుంటారు గుడిలోనే మహిళలు. ఈ సంద్భంలోనే దీప, మోనిత ఎదురుపడతారు. దాంతో.. నీ దీపం ఆర్పేస్తానని వార్నింగ్ ఇస్తుంది మోనిత. గతం గుర్తు రాకున్న తనతో కలిసి కార్తీక్ దీపాలు వెలిగించాడని, అదే భార్యభర్తల బంధమని చెబుతుంది దీప. అదే తన కోపానికి కారణమని తన అంతు చూస్తానని దీపకి వార్నింగ్ ఇస్తుంది మోనిత. దీపం వదలకుండా దీపని మోనిత ఇబ్బంది పెట్టిందా లేదా తర్వాతి ఎపిసోడ్ లో చూడండి.