ఫంక్షన్ జరుగుతుండగా అమ్మ గుర్తొచ్చి కన్నీరు పెట్టుకుంటుంది సౌర్య. దత్త కూతురి కన్నీళ్లు ఇంద్రుడిలో మార్పు తీసుకువస్తాయి. దాంతో తనకి ఇష్టం లేయినప్పటికీ దీపని, కార్తీక్‌ని ఇంటి తీసుకొస్తుంటాడు ఇంద్రుడు. ఆ తర్వాత నవంబర్ 1న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఆటోలో ముందు వెళుతుంటాడు ఇంద్రుడు. వెనుక కారులో దీప, కార్తీక్ ఫాలో అవుతుంటారు. సౌర్యని ఇవ్వడం ఇష్టం లేని ఇంద్రుడు గుండె రాయి చేసుకుంటానని బాధగా అనుకుంటూ ఉంటాడు. తమ స్వార్థం కోసం సౌర్య జీవితాన్ని కష్టాలు పాలు చేయడం కరెక్టు కాదని అనుకుంటాడు ఇంద్రుడు. వెనుకే ఫాలో అవుతున్న కార్తీక్, దీప మాత్రం.. అక్కడ ఉన్నది సౌర్య అవునా కదా అని మనసులో అనుకుంటూ ఉంటారు. సౌర్య కావాలని దేవుడిని కోరుకుంటూ ఉంటారు. అక్కడ మాత్రం సౌర్య ఫంక్షన్ జరుగుతుంటుంది. ఇంతలో అక్కడికి వస్తారు కార్తీక్, దీప, ఇంద్రుడు.
దాంతో.. తల్లిదండ్రులు వచ్చినట్లు సౌర్య మనసుకి అనిపిస్తుంది. అది చూసి తనని లోపలికి తీసుకెళ్లమని బంధువులకి చెబుతుంది చంద్రమ్మ. హైదరాబాద్ వెళుతున్నప్పుడు కలిసిన దీపని గుర్తు పట్టేస్తుంది చంద్రమ్మ. దాంతో.. జ్వాలని ఆశీర్వాదించమని చెబుతుంది చంద్రమ్మ. అలాగే.. సౌర్యకి వారికి ఉన్న అనుబంధం గురించి చెబుతారు ఇంద్రుడు, చంద్రమ్మ. అనంతరం సౌర్యని బయటికి తీసుకొస్తుంది చంద్రమ్మ. అయితే నిజంగా సౌర్య మాత్రం కాదు. తన ప్లేస్ మరొకరిని చూపిస్తుంది. అది చూసి ఇంద్రుడు షాక్ అవుతాడు. అది పట్టించుకోని చంద్రమ్మ తమకే పుట్టిందని ఏవేవో కథలు చెబుతుంది. అనంతరం జ్వాలని దీప, కార్తీక్ ఆశీర్వాదిస్తారు. ఇదంతా తెలియని సౌర్య అమ్మనాన్న గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అనంతరం చంద్రమ్మ ఉండమంటున్న వినకుండా వెళ్లిపోతారు కార్తీక్, దీప.
అనంతరం.. ఏందుకు అలా చేశావని చంద్రమ్మని నిలదీస్తాడు ఇంద్రుడు. దాంతో.. సౌర్య మీద తన ప్రేమని చంపుకోలేక పోతున్నానని అంటుంది చంద్రమ్మ. అంతేకాకుండా.. తన దూరమై పోతే నీ పరిస్థితి ఏంటోననే అనుమానంతో ఇలా చేశానని చెబుతుంది చంద్రమ్మ. అలాగే.. త్వరలోనే జ్వాల కూడా తన తల్లిదండ్రులని మర్చిపోతుందని అంటుంది చంద్రమ్మ. అందుకే జ్వాల ఇకపై మన బిడ్డ మాత్రమేనని చెబుతుంది. మరోవైపు.. అక్కడ ఉన్నది సౌర్య కాకపోవడంతో కన్నీరు పెట్టుకుంటుంది దీప. అలాగే.. ఇక్కడే ఉందా అని అంటుంది దీప. దానికి.. సౌర్య ఇక్కడే ఉందని అంటాడు కార్తీక్. దాంతో.. మీకేలా తెలుసని అడుగుతుంది దీప. కార్తీక్‌కి గతం గుర్తొచ్చిన విషయం చెబుతాడో లేదో తర్వాతి ఎపిసోడ్‌లో చూడండి.