Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సీరియల్లో దీప, కార్తీక్, మోనిత పాత్రలలో నటించినటువంటి ప్రేమి విశ్వనాథ్, శోభా శెట్టి, నిరుపమ్ పరిటాల వంటి నటీనటులకు ఎంతటి క్రేజ్ వచ్చిందో మనకు తెలిసిందే.ఇలా ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ నటీనటులు గత కొంతకాలంగా కార్తీకదీపం సీరియల్ కు దూరమయ్యారు.ఇలా ఈ సీరియల్ లో వీరి పాత్రలను చనిపోయినట్టు చూపించడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే దీప, కార్తీక్, మోనిత పాత్రలు లేకపోవడంతో ఈ సీరియల్ రేటింగ్ కూడా భారీగా తగ్గిపోయింది. ఎలాగైనా ఏదో ఒక ట్విస్ట్ తో వీరిని తిరిగి సీరియల్ లోకి తీసుకు వస్తే బాగుండని అభిమానులు సైతం భావించారు. ఈ క్రమంలోనే వీరు చనిపోకుండా కోమాలోకి వెళ్లినట్టు డైరెక్టర్ తిరిగి ఈ క్యారెక్టర్ లను తీసుకువచ్చారు. ఇక కార్తీకదీపం సీరియల్ లోకి వంటలక్క డాక్టర్ బాబు తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషించారు.
ఇక వీరిద్దరితోపాటు విలన్ పాత్రలో నటించిన మోనితను కూడా సీరియల్ లోకి తీసుకురావడంతో తిరిగి కథ మొదటికే వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో కార్తీక్ కోసం దీప,మోనిత ఎలాగైతే గొడవపడ్డారో ప్రస్తుతం కూడా గతం మర్చిపోయిన డాక్టర్ బాబుకు గతం గుర్తుచేయాలని దీప, గతం గుర్తుకు రాకుండా కార్తీక్ ను సొంతం చేసుకోవాలని మోనిత పోటీ పడుతున్నారు.
Karthika Deepam: డాక్టర్ బాబుతో వంటలక్క..
ఇలా ఈ సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలో ఏముంది ఈ క్రమంలోనే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ డాక్టర్ బాబుతో కలిసి కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోని ప్రేమీ విశ్వనాథ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డ్రైవ్ విత్ డాక్టర్ బాబు అంటూ క్యాప్షన్ జోడించారు.ఇలా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఈ ఫోటో పై స్పందిస్తూ డాక్టర్ బాబు మోనితను వదిలేసి వంట లెక్కతో లాంగ్ డ్రైవ్ వెళుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.