గత ఎపిసోడ్‌లో.. మోనిత మీద అనుమానంతో ఆమెని ఇంటి వరకూ ఫాలో చేస్తుంది దీప. అది తెలిసిన కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తూ.. కార్తీక్ ఫొటోని చూస్తూ.. ‘నువ్వు ఎక్కడా ఉన్నావు’ అంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి మోనితకి నిజంగానే తెలియదేమోనని అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప. ఆమె వెళుతుంటే దీపని చూసి గుర్తు పట్టిన కార్తీక్ తనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. కానీ అదేం తెలియని దీప ఆటో ఎక్కి వెళ్లిపోతుంది. అనంతరం హిమ గొడవ చేయడంతో సౌర్య దగ్గరకి వెళ్లడానికి రెడీ అవుతారు సౌందర్య, ఆనందరావు. అనంతరం ఇంటికి వెళ్లిన దీప డాక్టర్ తల్లికి అంత వివరంగా చెబుతుంది. ఆ తర్వాత ఆగస్టు 26 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘కార్తీక్ దగ్గరకి మోనిత వస్తే .. దాని గురించి అని తెలుసు. కాబట్టి తిట్టి పంపిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మోనిత గురించి కాదు. నువ్వు కార్తీక్ ఎందుకు గుర్తు పట్టలేదు. అస్సలు ఆయన నీ భర్తేనా. ఆ విషయం గురించి ఆలోచించు. నిజం నీకే తెలుస్తుంది’ అని దీపని ఓదార్చుతుంది ఆ పెద్దావిడ. బట్టల కొట్టులో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. అది చూసి అక్కడ పనిచేసేవాళ్లు ఆయన మతిమరుపు గురించే మాట్లాడుకుంటారు. అంతలో ఇద్దరు అమ్మాయిలు వచ్చి డ్రెస్సులు కొని.. వాటి డబ్బులు ఇవ్వడానికి వస్తారు. కానీ.. మేడం చెప్పిన విషయాన్ని మరిచిపోయిన కార్తీక్ కస్టమర్స్ చెప్పినట్లే.. వాటి ఖరీదులో 30 శాతం డిస్కౌంట్ ఇస్తాడు. అనంతరం భార్యకి కాల్ చేసి లేటవుతుందని తెలిసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిపోతాడు.
మరోవైపు.. కార్తీక్‌ని వెతుకుతున్న దీపకి డ్రైవర్ కనిపిస్తాడు. దాంతో కోపంగా వెళ్లి కాలర్ పట్టుకుంటుంది. మీరేవరూ ఎందుకు ఇలా చేస్తున్నారంటూ దీప తెలియనట్లు నటిస్తాడు. దాంతో కోపంగా అడగడంతో కార్తీక్ గురించి చెప్పకపోవడంతో పోలీసులకి కొట్టించి నిజం తెలుసుకుంటానని బెదిరిస్తుంది దీప. దీంతో భయంగా నిజం చెప్పేస్తానని అంటాడు శివ. అతను నిజం చెప్పబోతుండగా.. అక్కడికి వచ్చిన శివ కాలర్ పట్టుకుని.. నీకు కార్తీక్ గురించి తెలుసా అని అడుగుతుంది. కార్తీక్‌ని చూపించంటూ శివని ఇద్దరూ లాగుతారు. ఇంతలో దీపని తోసేసిన మోనిత, శివని కారులో ఎక్కించుకుని వెళ్లిపోతుంది. అది చూసిన దీప కిందనుంచి లేచి నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటుంది.
అనంతరం కార్తీక్ ఫోన్ చూస్తుండగా.. ఎవరో గోరు ముద్దులు పెడుతుంటారు. కెమెరా అటు తిరగగా.. మోనిత క్రూయల్‌గా నవ్వుతూ ఉంటుంది. ‘చిన్నపిల్లాడిని కాదు. నాకు తినిపించాల్సిన అవసరం లేదు’ అంటూ తననే తదేకంగా చూస్తుంటాడు. అది చూసి ఏంటని మోనిత అడగగా.. నీ పేరెంటనీ అడుగుతాడు కార్తీక్. అది చూసి బాధ పడుతూనే.. ‘ఎవరినైనా మర్చిపో, తనని మర్చిపోవద్దు. ఎందుకంటే నేను నీ భార్య’ అంటుంది. అయితే.. ‘మోనిత వాలకం చూసి నువ్వు నిజంగా నా భార్యవేనా. నువ్వు చేసే పనులు చూసి అలా అనిపించట్లేదు’ అని అనుమానంగా అంటాడు కార్తీక్. దాంతో.. ‘గతం మర్చిపోయిన నిన్ను తీసుకొస్తే నాకేం ఉపయోగం. నీ ఆస్తిపాస్తుల కోసమా అంటే నీక అవేం లేవు కదా. నిన్ను ఫ్రిగా వదిలేస్తే ఎక్కడ ఇబ్బంది పడతావేమోనని నా బాధ’ అంటూ కార్తీక్‌ని కన్‌ప్యూజన్‌లో పడేస్తుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోతూ కార్తీక్‌ని చూసి క్రూయల్‌గా నవ్వుతుంది.
మరోవైపు.. సౌర్యని వెతుకుంటూ సౌందర్య, ఆనందరావు, హిమ అనాథాశ్రమాన్ని వెళతారు. సౌందర్యని, హిమని బయటే నిలబడమని లోపలికి వెళ్లబోతుంటాడు ఆనందరావు. అంతలోనే ఇంట్లోంచి బయటికి వస్తుంటుంది సౌర్య. బయటికి వచ్చిన సౌర్య నిలబడి ప్లేట్‌లో పెట్టుకొని తింటూ ఉంటుంది. అది చూసి సౌందర్య ఫిలై.. సౌర్య దగ్గరకి వెళ్లబోగా వద్దని వారించి పక్కకి తీసుకెళుతుంది హిమ. దాంతో ఆనందరావు వెళ్లి సౌర్యతో మాట్లాడుతాడు. ఎందుకు వచ్చావంటూ కోపంగా అడుగుతుంది సౌర్య. దాంతో ఇంటికి రామ్మని బ్రతిమిలాడతాడు ఆనందరావు. ‘అమ్మానాన్న వాళ్లు బ్రతికే ఉన్నారు.. వాళ్లు దొరికాకా.. ఇంటికి వచ్చి హిమతో మాట్లాడుతాను’ అంటుంది సౌర్య. చాటుగా ఇదంతా వింటున్న సౌందర్య, హిమ బాధపడతారు. దీంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగమంటూ.. శివని మోనిత లాక్కెళ్లడం గురించి ఆలోచిస్తుంది దీప. అక్కడ కార్తీకెమో కళ్లు మూసుకొని దీప పేరుని కలవరిస్తూ ఉంటాడు. అది విని షాక్ అవుతుంది మోనిత. దీంతో ఛైర్‌లో నుంచి లేచిన కార్తీక్‌ని మోనితని దీప అని పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.