ఇంకా ఫ్లాష్‌బ్యాక్ కథ నడుస్తూనే ఉంది. పక్క ఊరి ఆసుపత్రిలో కార్తీక్ ఉన్నాడని తెలిసి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళుతుంది దీప. కానీ.. అక్కడికి వెళ్లి ఆరా తీయగా.. కార్తీక్‌ని అతని భార్య తీసుకెళ్లినట్లు నర్సు చెబుతుంది. దాంతో షాక్ గురై ఏడుస్తూ కూర్చుంటుంది. అంతలో నర్సు వచ్చి కార్తీక్ ఫొటో ఉన్న పర్సు ఇచ్చి అతనికి ఇవ్వమని చెబుతుంది. దాన్ని తీసుకెళ్లి అన్నయ్యకి జరిగిన విషయం చెబుతుంది. అనంతరం కార్తీక్‌ని వెతుక్కుంటూ కూరగాయల మార్కెట్ వరకూ వెళుతుంది. ఆ తర్వాత ఆగస్టు 22 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
శివ తన మేడమ్‌కి చెబుతాననడంతో కార్తీక్ మాట్లాడకుండా జ్యూస్ తాగడానికి వెళతాడు. కారు దగ్గరే శివ తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అటుగా వచ్చిన దీప, కార్తీక్ ఫొటో చూపించి ఎక్కడైనా చూశారా అని అడుగుతుంది. కానీ శివ చూడలేదని అబద్ధం ఆడతాడు. కానీ.. కార్తీక్ వెనుకే జ్యూస్ తాగుతూ ఉంటాడు. అనంతరం.. ‘మోనిత ఎమైనా డాక్టర్ బాబును తీసుకెళ్లిందా.. అది జరిగే అవకాశం లేదు. ఎందుకంటే.. మోనిత కుట్రలన్నీ డాక్టర్ బాబుకి బాగా తెలుసు.. ఎట్టి పరిస్థితుల్లోనూ మోనిత.. నేను నీ భార్య అని వస్తే.. డాక్టర్ బాబు కొట్టి పంపిస్తారే కానీ.. తనతో ఎందుకు వెళ్తారు.. అలా వెళ్లరు’ అనుకుంటూ గట్టి నమ్మకంతో ఉంటుంది. మళ్లీ కనిపించిన ప్రతి ఒక్కరినీ ఫొటో చూపించి.. ‘ఇతడ్ని చూశారా?’ అని అడుగుతూ వెళుతుంది. ఒకతను కార్తీక్ ఫొటోని చూసి గుర్తుపట్టి జ్యూస్ తాగుతున్నట్లు చెబుతాడు. దాంతో.. భర్త దొరికాడనే ఆనందంలో పరిగెత్తుకెళుతుంది.
కానీ.. దీప ఫొటో చూపించడంతో విషయం అర్థం చేసుకున్న శివ జ్యూస్ తాగుతున్న కార్తీక్ దగ్గరకి వెళ్లి త్వరగా వెళదాం రండంటూ తీసుకెళ్లిపోతాడు. అంత తొందర ఏంటని కార్తీక్ అడగడంతో మేడమ్ తీసుకురమ్మంటుందని అబద్ధం చెబుతాడు. అక్కడికి వెళ్లిన దీపకి కార్తీక్ కనిపించడు. దాంతో అక్కడున్న ఓ వ్యక్తిని అడగగా.. ఇప్పుడే వెళ్లిపోయాడని చెబుతాడు. దాంతో.. డాక్టర్ బాబు అని ఏడుస్తూ బాధపడుతుంది.
అక్కడ సౌర్య.. ఏదో ఆలోచిస్తూ బాధగా ఉంటుంది. ‘అమ్మా ఈ రోజు శుక్రవారం కదా.. సెకండ్ షో సినిమాకి వెళ్దాం’ అంటారు చంద్రమ్మ, గండ. ‘ఎందుకు సినిమా చూడటానికా.? లేక.. కటింగ్స్ వేయడానికా?’ అంటుంది సౌర్య. ‘అయ్యో అంతమాటా.. కావాలంటే మధ్యలో కూర్చుని, మా ఇద్దరి చేతులు పట్టుకుని కూర్చోమ్మా.. అంతే కానీ శుక్రవారం రోజున సినిమా వద్దు అని మాత్రం చెప్పొద్దు..’ అంటారు. దాంతో వాళ్లని బాధపెట్టడం ఇష్టం లేక ఒకేనంటుంది సౌర్య.
మరోవైపు.. దీప మార్కెట్‌లో కూరగాయలు కొంటూ ఉంటుంది. కార్తీక్ కూడా అక్కడే ఉంటాడు. సౌర్య కూడా అక్కడికే వస్తుంది చిత్రంగా. కానీ.. అమ్మనాన్నని చూసుకోకుండానే సినిమాకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ బిర్యానీ తిందామని శివతో గొడవపడుతుంటాడు. దాంతో కార్తీక్ గొంతు గుర్తుపట్టి డాక్టర్ బాబు అంటూ అతని దగ్గరకి వెళుతుంది. దీపని గుర్తుపట్టని కార్తీక్.. ‘నేను డాక్టర్ బాబునేంటి’ అని అడుగుతాడు. దాంతో దీప షాక్ అవుతుంది. అంతేకాకుండా.. వాళ్లకి పెళ్లై, పిల్లలు ఉన్న విషయాన్ని దీప చెప్పిన కార్తీక్‌కి ఏం గుర్తుకురాదు. ఏదో ప్రమాదం వస్తుందని గ్రహించిన శివ ఎవరో పిచ్చిది డబ్బుల కోసం అలా చేస్తుందని కవర్ చేస్తాడు. అది విని మార్నింగ్ ఫొటో చూసి తెలియదని చెప్పిన విషయం గుర్తొచ్చి.. ‘నువ్వు ఎవర్రా.. ఎందుకిలా చేస్తున్నావు’ అని ప్రశ్నిస్తుంది. డేంజర్ అని గ్రహించిన శివ.. కార్తీక్ అసలు సంగతి ఏంటో కనుకుందామంటున్న వినకుండా బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తాడు. దాంతో తట్టుకోలేకపోయిన దీప కళ్లుతిరిగిపడిపోతుంది.
అనంతరం ఇంటికి వెళ్లిన దీప డాక్టర్ అన్నయ్య దగ్గర ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెబుతుంది. ఏం జరిగిందమ్మా అని అడిగితే.. ‘మార్కెట్‌లో కనబడిన డాక్టర్ బాబు నన్ను గుర్తు పట్టలేదు.. నన్ను చూడగానే ప్రేమగా దగ్గరకి తీసుకుంటారు అనుకున్నా. కానీ.. నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటన్నయ్యా’ అని కన్నీటి పర్యంతం అవుతుంది. అదేకాకుండా.. శివ చేసిన పనుల గురించి కూడా డాక్టర్‌కి వివరిస్తుంది దీప. దాంతో.. ‘ఏం పర్లేదమ్మా.. ఆయన నీ భర్తో కాదో.. ఎంక్వైరీ చేయడం పెద్ద కష్టం కాదు. నువ్వు బాధపడకు’ అని ఓదార్చుతాడు. అనంతరం డాక్టర్, వేరే వ్యక్తితో ఆ రోజు డేట్ 22 అని చెప్పడంతో తన పెళ్లి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్న విషయాన్ని తెలుసుకుని బాధపడుతుంటుంది దీప. అది గమనించిన డాక్టర్ ఏమైనా ఈ రోజు ఏమైనా ప్రత్యేకత ఉందా అని అడగగా.. తన పెళ్లి రోజని తన భర్త గురించి తలచుకుని బాధపడుతుంది. అసలేమైంది.. కార్తీక్‌ని భార్య అని చెప్పి తీసుకెళ్లింది ఎవరో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.