తెలుగు టెలివిజన్ లో సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం లో యుక్త వయస్సు ఉన్న శౌర్య పాత్రలో నటించిన బ్యూటీని అందరూ గుర్తు పట్టే ఉంటారు. ఇందులో రౌడీ బేబీ తరహా క్యారెక్టర్ లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ అసలు పేరు అమూల్య గౌడ. కర్ణాటకకి చెందిన ఈ అమ్మడుకి తెలుగులో ఇదే మొదటి సీరియల్. అయితే నటిగా మాత్రం ఆమె 2014లోనే స్టార్ట్ చేసింది. స్వాతిముత్తు అనే సీరియల్ తో నటిగా తెరంగేట్రం చేసిన అమూల్య తరువాత వరుసగా అవకాశాలు అందుకుంటూ మూడు సీరియల్స్ లో నటించింది. ఇక కార్తీకదీపం సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
View this post on Instagram
ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హాట్ హాట్ ఫోటోషూట్ లతో ఈ అమ్మడు బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీకి ఇప్పటికే పెళ్లయ్యింది. ఓంకార్ గౌడ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు పెడుతూ తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ పెద్ద జలపాతం దగ్గర ఈ అమ్మడు ఎంజాయ్ చేస్తూ ఉంది. అయితే అక్కడ ఆమె వేసుకున్న డ్రెస్ అమూల్య అందాలని తెరపార చూపిస్తుంది. ఈ వీడియోలు ఆమె హొయలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పాలి.