Karthi తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన హీరోల్లో సూర్య, కార్తీ బ్రదర్స్ ముందు వరుసలో ఉంటారు. అన్నదమ్ములైన వీరిద్దరూ నటనలో ఎవరికివారే సాటి అన్నట్లు నటిస్తుంటారు. ఇక సూర్య అయితే ప్రయోగాలకు పెట్టింది పేరు అన్నట్లు వ్యవహరిస్తుంటారు. కొత్త కథలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల జైభీం సినిమాకు అవార్డుల పంట కూడా పండింది.
మరోవైపు సూర్య సోదరుడు కార్తీ సైతం అటు తమిళంతోపాటు తెలుగులోనూ సినిమాలు రిలీజ్ చేస్తూ గుర్తింపు పొందుతున్నాడు. తెలుగులో విడుదలైన యుగానికి ఒక్కడు మూవీ కార్తీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా తన సినిమాలను తెలుగులోనూ డబ్బింగ్ చేస్తూ రిలీజ్ చేసేలా కార్తీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఆవారా చిత్రం కూడా తమిళంతోపాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలోని పాటలు అత్యద్భుతంగా ఉంటాయి.
హీరో కార్తీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. అయితే, తాజగా కార్తీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కార్తీ తన మరో సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కార్తీ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందన్న సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాలీవుడ్‌లోనూ ఎక్కువ సంఖ్యలో కార్తీకి అభిమానులున్నారు.
Karthi త్వరలోనే పునరుద్ధరణ జరుగుతుంది..
ఈ మేరకు హీరో కార్తీ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. హాయ్ గాయ్.. నా ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ చేయబడింది.. దీనిపై మేము ఫేస్‌బుక్ బృందంతో పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.. అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు హీరో కార్తీ. దీనిపై అభిమానులు ఒకింత కలవరపాటుకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరో నుంచి అప్‌డేట్స్ వస్తుండేవంటున్నారు. ఇటీవల కార్తీ నటించిన సర్దార్ మంచి హిట్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద 100 కోట్లు క్రాస్ చేసి భారీ విజయాన్ని నమోదు చేసింది. త్వరలోనే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.