పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడితో భేటీ కావడంతో వైసీపీ నేతలకి టెన్షన్ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు అందరూ ముప్పేట దాడి చేశారు. ఇదే సమయంలో దర్శకుడు ఆర్జీవీ కూడా పవన్ కళ్యాణ్ కాపులని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టేసాడు అని అంటూ రిప్ కాపులు అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ పై కాపు వర్గానికి చెందిన నాయకులు, యూత్ సోషల్ మీడియాలో సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. అలాగే బయట కూడా ఆర్జీవీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం చేశారు. ఇదే సమయంలో ఆర్జీవీ కామెంట్స్ వెనుక వైసీపీ హస్తం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ కారణంగా కాపు కమ్యూనిటీకి చెందిన ఓటర్లు వైసీపీకి దూరం అవుతారని అందరూ భావిస్తున్నారు. వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన ఈ సారి మాత్రం కాపులు అందరూ కూడా గంపగుత్తగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. వైసీపీలో ఉన్న కాపు నాయకులకి ఈ టెన్షన్ ఇప్పటికే ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ పై వారందరూ అదే పనిగా రెచ్చిపోతున్నారు.
ఇక ఆర్జీవీ వైసీపీకి సపోర్ట్ అనే సంగతి అతని గత సినిమాలతోనే రుజువు అయ్యింది. అలాగే ఆర్జీవీతో సినిమాలు చేసే దాసరి కిరణ్ కి వైసీపీ టీటీడీలో పదవి కూడా కట్టబెట్టింది. ఈ నేపధ్యంలో కాపులని కావాలనే జగన్ రెడ్డి ఇలా ఆర్జీవీతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని అందరూ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆర్జీవీ కామెంట్స్ తో వైసీపీపై మరింతగా కాపు కులంలో వ్యతిరేకత పెరిగింది. ఈ సారి ఎట్టి పరిస్థితిలో వైసీపీకి ఓటు వేసే అవకాశం లేదనే మాట ఇప్పుడు కాపు నాయకుల నుంచి వినిపిస్తుంది.