ఈ మధ్యకాలంలో ఇండియన్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఎక్కువ మంది చర్చించుకునే చిత్రంగా నిలిచింది కాంతారా. కన్నడంలో కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 400 కోట్ల కలెక్షన్స్ ని సిల్వర్ స్క్రీన్ పై అన్ని భాషలలో కలిపి కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీతో రిషబ్ శెట్టి ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా సూపర్ హిట్ టాక్ ని ఈ మూవీ సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు సెలబ్రెటీల అభినందనలు కూడా సొంతం చేసుకుంది. ప్రభాస్, అనుష్క, రజినీకాంత్, ధనుష్ లాంటి స్టార్స్ అందరూ ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.
కేవలం కంటెంట్ ఉన్న సత్తా కారణంగానే ఈ సినిమా నేషనల్ వైడ్ గా ప్రేక్షకులకి రీచ్ అయ్యింది. అలాగే సనాతన ధర్మాన్ని బలంగా రిప్రజెంట్ చేసిన చిత్రంగా కాంతారా మూవీ మరింత ఎక్కువగా ప్రాచూర్యం లభించింది. ఇక ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓ వైపు నటుడిగా రిషబ్ శెట్టి తనలోని డిఫరెంట్ షేడ్స్ ని తెరపై ఆవిష్కరించి, మరో వైపు దర్శకుడిగా కథని ప్రేక్షకుడి దృక్కోణం నుంచి చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా కథని అర్ధం చేసుకుంటారు.
ఎవరు ఎలా అర్ధం చేసుకున్న కంటెంట్ లో ఉన్న స్పిరిట్యుయల్ సెన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఎలాంటి అఫీషియల్ డేట్ చెప్పకుండానే అకస్మాత్తుగా అమెజాన్ ఓటీటీలో నేటి నుంచి ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చేసింది. ఈ విషయాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. ఇక సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమైన స్పందనని సొంతం చేసుకున్న మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా ట్రెండ్ సృష్టించడం పక్కా అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. మరి డిజిటల్ ఆడియన్స్ ని కాంతారా ఏ మేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.