పాన్ ఇండియా లెవల్ లో సంచలన విజయం సొంతం చేసుకొని రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా కాంతారా మూవీ నిలిచింది. రిషబ్ శెట్టి ఈ మూవీని కేవలం కన్నడ భాష కోసం కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే కంటెంట్ అద్బుతంగా ఉండటంతో కన్నడంలో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషలలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. కన్నడంలో ఈ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత అత్యధిక కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. అ భాషలో ఏకంగా 130 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ మూవీ డబ్బింగ్ చేసిన అన్ని భాషలలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరికి ఈ మూవీ కనెక్ట్ అయ్యింది.
ట్విట్టర్ లో ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. క్లైమాక్స్ సన్నివేశాలు అయితే అద్బుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా కాంతారా సినిమాపై ప్రశంసలు కురిపించారు అంటే ఎ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీ త్వరలో ఒటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. అయిన థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. తెలుగులో ఈ మూవీ ఏకంగా 65కోట్లకి కలెక్ట్ చేయడం ద్వారా తెలుగు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3 డబ్బింగ్ మూవీగా కాంతారా నిలిచింది. దీనికంటే ముందు కేజీఎఫ్ చాప్టర్ 2, రోబో 2. ఓ సినిమాలు ఉండటం విశేషం. ఇక హిందీలో కూడా ఏకంగా 90 కోట్ల వరకు కాంతారా మూవీ కలెక్ట్ చేసింది.
కనీసం హీరో, హీరోయిన్ ఎవరూ కూడా తెలియకుండా నార్త్ ఇండియన్ ఆడియన్స్ సినిమాకి భారీ కలెక్షన్స్ ఇచ్చారంటే సౌత్ ఇండియా కల్చర్, సౌత్ కాన్సెప్ట్స్ ని వారు ఎంతగా దగ్గర చేసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక తమిళంలో 13 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా రిలీజ్ అయిన అన్ని భాషలలో కలిసి కాంతారా మూవీ ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాతలు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న రెండో సినిమాగా కాంతారా ఇప్పుడు నిలిచింది. దీనికంటే ముందు కేజీఎఫ్ చాప్టర్ 2 ఉంది. ఇక ఇండియన్ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న టాప్ 10 చిత్రాల జాబితాలో కూడా కాంతార ప్లేస్ సొంతం చేసుకుంది.